కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/98 పేజీ 8
  • పయినీర్లు ఇతరులకు సహాయపడతారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పయినీర్లు ఇతరులకు సహాయపడతారు
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన పయినీర్లను మెచ్చుకొనుట
    మన రాజ్య పరిచర్య—1990
  • పయినీర్లకు మద్దతు చూపుట
    మన రాజ్య పరిచర్య—1992
  • దేవుని వాక్యమును ఉపయోగించుటలో నిపుణులగునట్లు ఇతరులకు సహాయము చేయుము
    మన రాజ్య పరిచర్య—1990
  • మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 9/98 పేజీ 8

పయినీర్లు ఇతరులకు సహాయపడతారు

1 “కోత విస్తారముగా ఉన్నది, గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి” అని యేసు చెప్పాడు. మొదటి శతాబ్దంలోని కోతపనివారి సంఖ్య తక్కువగా ఉండడం మూలనా, పూర్తి చేయాల్సిన ప్రాంతం విస్తారంగా ఉన్నందునా యేసు వారిని ఒక్కొక్కరినిగా పంపడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి సువార్తను అందించేలా చేయగల్గేవాడే. కానీ దానికి బదులుగా, ఆయన వారిని “ఇద్దరిద్దరినిగా” పంపించాడు. (లూకా 10:1, 2) ఇద్దరిద్దరినిగా ఎందుకు?

2 ఆ శిష్యులు క్రొత్తవారు, అంతేకాదు అనుభవశూన్యులు కూడాను. కలిసి పనిచేయడం ద్వారా వారు ఒకరినుండి ఒకరు నేర్చుకోగలరు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగలరు. సొలొమోను చెప్పినట్లు, “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు.” (ప్రసం. 4:9, 10) సా.శ. 33లో పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత కూడా, పౌలు బర్నబా మరితరులూ పరిచర్యలో తోటి విశ్వాసులతో కలిసి పనిచేశారు. (అపొ. 15:35) అటువంటి సామర్థ్యంగల వారి నుండి వ్యక్తిగతంగా శిక్షణను పొందడం ఎంతటి ఆధిక్యత!

3 చక్కని శిక్షణా కార్యక్రమం: మొదటి శతాబ్దపు సంఘానికి సమాంతరంగా నేటి ఆధునిక క్రైస్తవ సంఘం కూడా ప్రకటనా కార్యకలాపాన్ని చేపట్టిన ఒక సంస్థ. అది శిక్షణను కూడా అందిస్తుంది. వ్యక్తిగతంగా మన హృదయాభిలాష ఏమై ఉండాలంటే సాధ్యమైనంత ప్రభావవంతంగా సువార్తను ఇతరులకు అందించాలి. మరింత ఎక్కువమంది ప్రచారకులు తమ ప్రతిభను మెరుగుపర్చకోవడానికి సహాయం అందుబాటులో ఉంది.

4 ఇటీవల ముగిసిన రాజ్య పరిచర్య పాఠశాలలో, క్షేత్ర పరిచర్యలో పయినీర్లు ఇతరులకు సహాయం చేయడానికైన ఒక కార్యక్రమాన్ని గురించి సొసైటీ ప్రకటించింది. దీని అవసరం ఉందా అసలు? అవును, ఉంది. గత మూడు సంవత్సరాల్లో పది లక్షల మందికి పైగా బాప్తిస్మం తీసుకున్నారు, వారిలో చాలామందికి ప్రకటనా పనిలో మరింత ప్రభావవంతంగా తయారుకావడానికి శిక్షణ అవసరం. ఆ అవసరాన్ని తీర్చడానికి ఎవర్ని వినియోగించవచ్చు?

5 పూర్తికాల పయినీర్లు సహాయం చేయగలరు. యెహోవా సంస్థ వారికి ఎంతో చక్కని సలహాను, శిక్షణను అందిస్తుంది. పయినీర్ల అవసరాలకు తగ్గట్లుగా వారికి రెండువారాల పయినీరు సేవా పాఠశాలలో ఉపదేశం ఇవ్వబడుతుంది. వారు సర్క్యూట్‌, డిస్ట్రిక్ట్‌ పైవిచారణకర్తతో జరిగే కూటాలనుండి కూడా ప్రయోజనం పొందుతారు, అలాగే పెద్దలనుండి నడిపింపు కూడా వారికి లభిస్తుంది. పయినీర్లు అందరూ పౌలు బర్నబాల అంతటి అనుభజ్ఞులు కాకపోయినప్పటికీ, వారికి మాత్రం విలువైన శిక్షణ లభించింది, దాన్ని ఇతరులతో పంచుకోవడానికి వారు సంతోషిస్తున్నారు.

6 ప్రయోజనం పొందేది ఎవరు? ఈ కార్యక్రమం క్రొత్తగా ప్రచారకులు అయినవారికి, లేక క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్నవారికి మాత్రమే పరిమితమా? ఎంత మాత్రం కాదు. ఎన్నాళ్ళనుంచో సత్యంలో ఉన్నప్పటికీ పరిచర్యలోని కొన్ని రంగాల్లో సహాయం స్వీకరించడానికి సంతోషించే యౌవనులు, వృద్ధులు ఉన్నారు. కొంతమంది సాహిత్యాన్ని అందించడంలో ప్రజ్ఞావంతులుగా ఉంటారు, కానీ పునర్దర్శనాలు చేయడమూ బైబిలు పఠనాలు చేయడమూ కాస్త కష్టంగా ఉంటుంది. ఇతరులు బైబిలు పఠనాలను చాలా సులభంగా ప్రారంభిస్తారు కానీ తమ విద్యార్థులు అభివృద్ధిని సాధించడం లేదని గమనిస్తారు. వారిని వెనక్కి లాగుతున్నది ఏమిటి? ఈ రంగాల్లో సహాయం చేయమని అనుభవజ్ఞులైన పయినీర్లను అడగవచ్చు. కొంతమంది పయినీర్లు ఆసక్తిని మొలకెత్తించడంలోను, బైబిలు పఠనాలను ప్రారంభించడంలోను, క్రొత్త విద్యార్థుల్ని సంస్థవైపుకి నడిపించడంలోను మంచి ప్రతిభను చూపిస్తారు. వారి అనుభవం ఈ క్రొత్త కార్యక్రమంలో సహాయపడుతుంది.

7 మీ పనుల మూలంగా, సంఘంలో ప్రతివారం జరిగే క్షేత్ర సేవ కొరకైన కూటాలకు మీకు కోరుకున్నంతగా హాజరు కాలేకపోతున్నారా? అలాగైతే, ఇతర ప్రచారకులు అందుబాటులో లేనప్పుడు ఒక పయినీరు మీతో అప్పుడప్పుడు పనిచేసే అవకాశం ఉండవచ్చు.

8 మంచి సహకారం అవసరం: వ్యక్తిగత సహాయం కోరే ప్రచారకులు, పయినీర్లు ఇతరులకు సహాయపడతారు అనే కార్యక్రమంలో పాల్గొనగల్గేలా పెద్దలు సంవత్సరానికి రెండుసార్లు ఏర్పాట్లు చేస్తారు. అటువంటి సహాయం స్వీకరించడానికి మీరు సమ్మతిస్తే, మీకు సహాయం చేయడానికి నియమించబడిన పయినీరుతో కలిసి, సేవ కోసం ఒక ఆచరణయోగ్యమైన షెడ్యూలును వేసుకుని దానికి కట్టుబడి ఉండండి. మాటమీద నిలబడండి. మీరు పయినీరుతో కలిసి పనిచేస్తుండగా సువార్తను తెలియజేయడంలోని ప్రభావవంతమైన పద్ధతులను జాగ్రత్తగా గమనించండి. వ్యక్తులను ఫలాని విధంగా సమీపించడం ఎందుకు ప్రభావవంతంగా ఉంటుందో విశ్లేషించండి. మీ అందింపును మెరుగుపర్చుకునేందుకు పయినీరు ఏమైనా సూచనలు ఇస్తే వాటిని పరిగణలోనికి తీసుకోండి. మీరు నేర్చుకుంటున్న విషయాల్ని అమలులో పెడుతుండగా, పరిచర్యలో మీ అభివృద్ధి మీకూ ఇతరులకూ స్పష్టంగా కనబడుతుంది. (1 తిమో. 4:15 చూడండి.) సాధ్యమైనంత తరచుగా కలిసి పనిచేస్తుండండి, అనియత సాక్ష్యంతో పాటుగా పరిచర్యలో అన్ని విధాలుగా ప్రయత్నించి చూడండి. కానీ మీకు వ్యక్తిగతమైన సహాయం అవసరం అనుకున్న రంగాల్లో మరెక్కువగా కేంద్రీకరించండి.

9 జరుగుతున్న అభివృద్ధి విషయమై సేవా పైవిచారణకర్త ఆసక్తి కలిగివుంటాడు. అప్పుడప్పుడు, ఈ కార్యక్రమం నుండి మీరు ఎలా ప్రయోజనం పొందుతున్నారో చూసేందుకు ఆయన పుస్తక పఠన నిర్వాహకుడ్ని కలుస్తాడు. సర్క్యూట్‌ పైవిచారణకర్త సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు తాను కూడా అదే విధంగా మీకు సహాయం చేస్తాడు.

10 యెహోవా తన ప్రజలు శిక్షణపొంది ఉండాలనీ, “ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి” ఉండాలని ఆశిస్తున్నాడు. (2 తిమో. 3:16, 17) వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఇష్టపడేవారికి సహాయం చేసేందుకైన మంచి ఏర్పాటుగా పయినీర్లు ఇతరులకు సహాయపడతారు అనే కార్యక్రమాన్ని దృష్టించండి. దానిలో భాగం వహించే ఆధిక్యత మీదైతే, కృతజ్ఞతా భావంతో, నమ్రతతో, ఆనందంగా అందులో పాల్గొనండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి