ఇతరుల ఎడల యథార్థంగా శ్రద్ధవహించడం ద్వారా యెహోవాను అనుకరించండి
1 ఇతరుల ఎడల యథార్థమైన శ్రద్ధను ప్రదర్శించేవారిలో యెహోవా అత్యంత గొప్ప ఉదాహరణ. విశ్వ సర్వాధిపతిగా, ఆయన తన మానవ సృష్టి యొక్క అవసరతలను ఎరిగి ఉన్నాడు. (1 పేతు. 5:7) నీతిమంతులపైన, అనీతిమంతులపైన సూర్యుని ఉదయింపజేసి, వర్షాన్ని కురిపింపజేసే తన తండ్రి యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్త. 5:45) మీరు కలిసే ప్రతి ఒక్కరితో రాజ్య వర్తమానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండి, ఇతరుల ఎడల యథార్థమైన ఆసక్తిని చూపించడం ద్వారా మీరు యెహోవాను అనుకరించవచ్చు. జూలైలో పరిచర్యలో ఉపయోగించబడే బ్రోషూర్లతో బాగా పరిచితం అవ్వడం ద్వారా, మీరు ఇతరులకు ఆత్మీయ సహాయం అందించడానికి మంచి స్థానంలో ఉంటారు. తొలి సందర్శనం కొరకు ఎలా సిద్ధపడాలి, అటు తరువాత సమయానుకూల పునర్దర్శనాలు చేసి ఆసక్తి చూపించిన వారిని ఎలా కలవాలి అనేవాటికి ఈ క్రిందనున్న సూచనలు కొన్ని ఆలోచనలనిస్తాయి.
2 “దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?” అనే బ్రోషూరును ప్రతిపాదించేప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “దేవుడు మానవుల ఎడల నిజంగా శ్రద్ధవహిస్తున్నట్లైతే వారు బాధపడేందుకు ఎందుకు అనుమతిస్తున్నాడని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ బ్రోషూరు ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబునివ్వడమే కాక మానవుడు తనపైన తన భూగృహంపైన తెచ్చుకున్న నష్టాన్ని భర్తీ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడని చూపిస్తుంది.” 27వ పేజీలోని 23వ పేరాను చదవండి. దాని క్రిందనున్న చిత్రాన్ని చూపించి, 22వ పేరా నుండి కీర్తన 145:16 చదవండి. బ్రోషూరును ప్రతిపాదించండి. అది అంగీకరించబడితే, తరువాతి సందర్శనంలో జవాబివ్వగలిగే ఇటువంటి ప్రశ్నను అడగండి: “మానవజాతికి ఆశీర్వాదాలను తేవాలనే, భూమిని పరదైసుగా మార్చాలనే తన సంకల్పాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడో తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా?”
3 “దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?” అనే బ్రోషూరును అందించినవారి దగ్గరకు మీరు తిరిగి వెళ్లినప్పుడు మీరు మరో చర్చను ఇలా ప్రారంభించవచ్చు:
◼ “క్రితంసారి నేను వచ్చినప్పుడు, దేవుడు నిజానికి మన ఎడల శ్రద్ధవహిస్తాడని, మానవుడు తనపైన తన భూగృహంపైన తెచ్చుకున్న నష్టాన్ని భర్తీ చేయడం ఆయన సంకల్పమని మనం పరిశీలించాము.” బ్రోషూరును 2-3 పేజీలలోని చిత్రానికి త్రిప్పి ఇలా చెప్పండి: “మానవజాతికి ఆశీర్వాదాలను తేవాలనే, భూమిని పరదైసుగా మార్చాలనే తన సంకల్పాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడన్న ప్రశ్నతో మనం మన సంభాషణను ముగించాము. మీరేమనుకుంటారు?” ప్రతిస్పదించనివ్వండి. 17వ పేజీకి త్రిప్పి, 2వ పేరాను, దానియేలు 2:44 వ వచనాన్ని చదవండి. ఆ తరువాత, 18వ పేజీలోని 12వ పేరాను చదవండి. గృహస్థుడు బ్రోషూరులోని 9వ భాగాన్ని మీతో పరిశీలించడానికి ఇష్టపడతాడేమో అడగండి. ఆయన ఇష్టపడితే దాన్ని ఆయనతో కలిసి పఠించండి.
4 “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే బ్రోషూరును ప్రతిపాదించడంలో ఈ క్రిందిదానిని ఉపయోగించవచ్చు. దాని ముఖపత్రాన్ని చూపించి, ఇలా చెప్పండి:
◼ “తమ ప్రియమైన వారిని మరణంలో కోల్పోయిన లక్షలాదిమంది ప్రజలకు ఓదార్పును, నిరీక్షణను తెచ్చిన ఈ బ్రోషూరులోని సమాచారాన్ని ఈరోజు మేము పంచుకుంటున్నాము. మృతులకు ఏ నిరీక్షణ ఉన్నదన్న దానిగురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు దేవుని వాగ్దానమైన పునరుత్థానాన్ని స్పష్టంగా పేర్కొంటుంది.” యోహాను 5:28, 29 చదవండి. బ్రోషూరును తెరిచి, 28వ పేజీలోని ఆఖరి పేరాలోను, 31వ పేజీలోని మొదటి పేరాలోను ఉన్న అంశాలపై వ్యాఖ్యానించండి. వాటితోపాటున్న చిత్రాలను చూపించండి. బ్రోషూరును ప్రతిపాదించండి. “చివరికి మరణం పూర్తిగా తీసివేయబడుతుందని మనం ఎందుకు నమ్మకం కలిగివుండగలము?” అని అడగడం ద్వారా మీరొక పునర్దర్శనానికి మార్గాన్ని సిద్ధం చేసుకోగలరు.
5 “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే బ్రోషూరును అందించిన చోట పునర్దర్శనంలో ఈ అందింపును ఉపయోగించుకోవాలని మీరు అనుకోవచ్చు:
◼ “మనం క్రితంసారి మాట్లాడినప్పుడు, అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణను గురించి మనం చర్చించాము. నేను మీకిచ్చిన బ్రోషూరు చివరికి మరణం పూర్తిగా తీసివేయబడుతుందని మనం ఎందుకు నమ్మకం కలిగివుండగలమనే దాన్ని వివరిస్తుంది. దేవుని వాగ్దానాలు ఓదార్పుకరంగాను, అభయం ఇచ్చేవిగాను ఉన్నట్లు మీరు కనుగొనలేదా?” ప్రతిస్పందించనివ్వండి. తరువాత బ్రోషూరులో 31వ పేజీకి త్రిప్పి, ప్రకటన 21:1-4 వచనాలతోపాటు రెండు, మూడు పేరాలను చదవండి. ఇంకెన్నడూ మరణించకుండా జీవితాన్ని ఆనందించేలా మనకున్న ఉత్తరాపేక్షను ఉన్నతపరచండి. అప్పుడు చూపించబడిన ఆసక్తినిబట్టి, పరిస్థితులనుబట్టి మీరు జ్ఞానము పుస్తకంలో బైబిలు పఠనాన్ని ప్రతిపాదించవచ్చు లేదా తరువాతి పునర్దర్శనానికి మార్గాన్ని తెరిచే మరొక ప్రశ్నను అడుగవచ్చు.
6 “జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?” అనే బ్రోషూరును అందించేటప్పుడు మీరీ క్రింది విధంగా చెప్పవచ్చు:
◼ “చాలామంది ప్రజలు జీవిత సంకల్పమేమిటాయని ఆశ్చర్యపోయారు. వారు తమను తాము, ‘నేనెందుకు ఇక్కడున్నాను? నేనెక్కడికి వెళ్తున్నాను? భవిష్యత్తు నా కొరకు ఏమి కలిగివుంది?’ అని ప్రశ్నించుకున్నారు. మనం జవాబులను ఎక్కడ కనుగొనగలమని మీరు అనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలేమి చెబుతుందో గమనించండి. [కీర్తన 36:9 చదవండి.] మనమెందుకు ఇక్కడున్నామనే దానికి వివరణనిచ్చే సరైన స్థానంలో మానవుని సృష్టికర్త మాత్రమే ఉన్నాడని నిర్ధారించడం సహేతుకం కాదా? [ప్రతిస్పందించనివ్వండి.] మన కొరకు దేవుడు కలిగివున్న గొప్ప సంకల్పాన్ని ఈ బ్రోషూరు చూపిస్తుంది.” 20-1 పేజీలకు త్రిప్పి, క్యాప్షన్‌ను చదివి, చిత్రంపై వ్యాఖ్యానించండి; తరువాత బ్రోషూరును ప్రతిపాదించండి. అంగీకరించబడితే, “పరదైసు భూమిపై మానవులు నిరంతరం జీవించాలన్నది ఇంకనూ దేవుని సంకల్పమని మనం ఎలా నిశ్చయతను కలిగి ఉండగలం?” అని అడగండి. తిరిగి రావడానికి సమయాన్ని నిర్ణయించండి.
7 “జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?” అనే బ్రోషూరును అందించినట్లైతే, మీరు తిరిగి వెళ్లినప్పుడు ఇలా చెప్పవచ్చు:
◼ “నేను తొలిసారి సందర్శించినప్పుడు, మానవ జీవానికి నిజంగా ఒక సంకల్పం ఉందన్న బైబిలు ఉద్దేశం గూర్చి నేను మీతో చర్చించడాన్ని నిజంగా ఆనందించాను.” 31వ పేజీలోని చిత్రాన్ని చూపించి, “పరదైసు భూమిపై మానవులు నిరంతరం జీవించాలన్నది ఇంకనూ దేవుని సంకల్పమని మనం ఎలా నిశ్చయతను కలిగి ఉండగలం?” అని అడగండి. 20వ పేజీలోని 3వ పేరాను చదవండి. 21వ పేజీలోని “ఇంకనూ దేవుని సంకల్పము” అనే ఉపశీర్షిక క్రిందనున్న అంశాలను చర్చించండి. బ్రోషూరును వెనుకకు త్రిప్పి, ఉచిత బైబిలు పఠన ప్రతిపాదన గురించి చదవండి. జ్ఞానము పుస్తకాన్ని పరిచయం చేసి, బైబిలును పఠించడానికి దానిని ఒక సహాయకంగా మనమెలా ఉపయోగిస్తామన్నది ప్రదర్శిస్తారని ప్రతిపాదించండి.
8 యథార్థహృదయులు ‘సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారయ్యేందుకు’ వారికి సహాయం చేయడంలో మనకున్న యథార్థమైన ఆసక్తిని మన పరిచర్య ప్రతిబింబించాలి. (1 తిమో. 2:4) అందువలన, పరిచర్యలో పాల్గొనేప్పుడు ఎదురుపడే సాధ్యతగల భాషలన్నింటిలో బ్రోషూర్లను తీసుకెళ్లండి. మీరు బ్రోషూరును అందించిన ప్రతి వ్యక్తి వద్దకు తిరిగి వెళ్లేందుకు మీ సేవా పట్టికలో సమయాన్ని కేటాయించుకోండి. మీరు వారియెడల వాస్తవమైన ఆసక్తిని కనుపర్చడం, అబద్ధ మతంలో అభ్యసించబడుతున్న హేయకృత్యములను గూర్చి మూల్గుతూ, ప్రలాపిస్తున్న వారు తప్పించుకునేలా గుర్తించబడే వారయ్యేలా సహాయం చేయడానికి నడిపించవచ్చు. (యెహె. 9:4, 6) యథార్థంగా ఇతరుల కొరకు శ్రద్ధవహించడం ద్వారా మీరు యెహోవాను అనుసరిస్తున్నారని తెలుసుకోవడం వల్ల వచ్చే ఆనందాన్ని, సంతృప్తిని మీరు కూడా అనుభవించవచ్చు.—ఫిలిప్పీయులు 2:20 పోల్చండి.