కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/12 పేజీ 2
  • మీ మనసును భద్రంగా కాపాడుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ మనసును భద్రంగా కాపాడుకోండి
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన ఆధ్యాత్మికతను కాపాడుకునేందుకు సహాయం చేసే ప్రాంతీయ సమావేశం
    మన రాజ్య పరిచర్య—2009
  • మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోండి
    మన రాజ్య పరిచర్య—2012
  • క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
    మన రాజ్య పరిచర్య—1995
  • క్రైస్తవ పరిచారకుల కోసం ఒక ఏర్పాటు
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2012
km 8/12 పేజీ 2

మీ మనసును భద్రంగా కాపాడుకోండి

1. రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ ముఖ్యాంశం ఏమిటి, ఆ కార్యక్రమ ఉద్దేశం ఏమిటి?

1 యెహోవాను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనసుతో ప్రేమించాలని యేసు తన శిష్యులకు ఉద్బోధించాడు. (మత్త. 22:​37, 38) ఈ సంవత్సరం జరిగే జిల్లా, ప్రాంతీయ, ప్రత్యేక సమావేశాలు మన హృదయాన్ని, మనసును, మనస్సాక్షిని బలపర్చుకునేలా సహాయం చేయడానికి రూపొందించబడ్డాయి. “మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి!” అనేది మన జిల్లా సమావేశ ముఖ్యాంశం. “మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోండి” అనేది 2013 సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశ దిన ముఖ్యాంశం. ఇక, మత్తయి 22:37 ఆధారంగా తీసుకోబడిన “మీ మనసును భద్రంగా కాపాడుకోండి” అనేది, వచ్చే నెల మొదలుకొని, రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ ముఖ్యాంశం. ఈ సమావేశం, మనలో ప్రతీ ఒక్కరం మన ఆలోచనలు యెహోవాకు సంతోషం కలిగించేలా ఉండాలనే ఉద్దేశంతో వాటిని విశ్లేషించుకోవడానికి సహాయం చేసే విధంగా ఉంటుంది.

2. సమావేశంలో మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

2 ఈ విషయాలు తెలుసుకుంటాం: ప్రాంతీయ సమావేశంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఈ కింది ప్రశ్నలకు జవాబులను అక్కడ తెలుసుకుంటాం:

• ‘మనుష్యుల’ తలంపులు తలంచకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

• అవిశ్వాసుల మనసులకు గ్రుడ్డితనం కలిగించే ముసుగును మనమెలా తొలగించవచ్చు?

• ఎలాంటి మనోవైఖరిని కలిగివుండాలని మనం కోరుకుంటాం?

• సరైన విధంగా ధ్యానించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

• యెహోవా మన ఆలోచనలను మలచాలంటే మనం ఎలా ఉండాలి?

• భర్తలు, భార్యలు, తల్లిదండ్రులు, పిల్లలు కుటుంబ సంతోషానికి ఎలా దోహదపడవచ్చు?

• యెహోవా దినానికి మనమెలా సిద్ధంగా ఉండవచ్చు?

• మన మనసు అనే నడుము కట్టుకోవడం అంటే ఏమిటి?

• నేర్చుకున్నవాటిని అన్వయించుకునే వాళ్లు ఏ ప్రయోజనాలు పొందుతారు?

3. సమావేశానికి రెండు రోజులూ హాజరవడం, శ్రద్ధగా వినడం, నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

3 మన మనసులను పాడుచేయాలని సాతాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. (2 కొరిం. 11:⁠3) కాబట్టి, మనం మన మనసుల్ని కాపాడుకోవాలి, మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. మనం ఎల్లప్పుడూ క్రీస్తు మనసు కలిగివుండాలి, అవినీతికరమైన ఈ లోక ప్రభావం మనపై పడకుండా పోరాడాలి. (1 కొరిం. 2:16) ప్రాంతీయ సమావేశం జరిగే రెండు రోజులూ హాజరవడానికి ఏర్పాట్లు చేసుకోండి. శ్రద్ధగా వినండి. అక్కడ వినే ప్రాముఖ్యమైన సమాచారాన్ని అన్వయించుకుంటే, రాజ్య సేవను ఆసక్తితో చేసేలా మన మనసు అనే నడుము కట్టుకోవడానికి సహాయం పొందుతాం.​—⁠1 పేతు. 1:⁠13.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి