వేరే భాషా సాహిత్యం మీకు త్వరగా కావాలంటే
మన సంఘంలో కొన్ని భాషల సాహిత్యం అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు, ఆ భాషల్లోనే సాహిత్యాన్ని చదివే ప్రజలను మనం కలుస్తాం. అలాంటప్పుడు మీకు ఇంటర్నెట్, ప్రింటర్ అందుబాటులో ఉంటే చాలు, దాదాపు 400 భాషల్లో సాహిత్యాన్ని మీరే ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా?
• మన అధికారిక వెబ్సైట్ అయిన www.watchtower.org కి వెళ్లండి.
• హోమ్‌పేజ్ కుడివైపున భాషలకు సంబంధించిన లిస్టు ఉంటుంది. అందుబాటులో ఉన్న అన్ని భాషల లిస్టు చూడడానికి గ్లోబ్ చిత్రంపై క్లిక్ చేయండి.
• ఇప్పుడు మీకు కావాల్సిన భాషపై క్లిక్ చేయండి. మీరు ప్రింట్ చేయగల సాహిత్యాన్ని అంటే కరపత్రాలను, బ్రోషుర్లను, ఇతర ఆర్టికల్స్‌ను చూపించే ఒక పేజీ కనిపిస్తుంది. ఈ పేజీ మీరు ఎంపిక చేసుకున్న భాషలోనే ఉంటుంది కాబట్టి, శీర్షికల పేర్లు మీకు అర్థంకాకపోతే కంగారుపడకండి.
• ఏదైనా ఒక సాహిత్యం మీద క్లిక్ చేయండి. దానిలోని సమాచారం స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇప్పుడు మీరు బ్రౌసర్లోని ప్రింట్ ఆప్షన్ని ఉపయోగించి దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు.
మన వెబ్సైట్లో కొన్ని ప్రాథమిక సాహిత్యాలు మాత్రమే ఉంటాయి. మిగతావి సంఘం ద్వారానే తీసుకోవాలి. కాబట్టి, వారి ఆసక్తి పెరిగిన తర్వాత అదనపు సాహిత్యాల కోసం సంఘంలోని సాహిత్య విభాగం నుండి రిక్వెస్టు చేయవచ్చు.