మన అధికారిక వెబ్సైట్—మీ పరిచర్యలో ఉపయోగించండి
వెబ్సైట్ గురించి అందరికీ చెప్పండి: మనతో మాట్లాడడానికి లేదా మన సాహిత్యం తీసుకోవడానికి సంకోచించేవాళ్లు, ఇంటర్నెట్లో jw.org వెబ్‌సైట్‌ను సందర్శించి యెహోవాసాక్షుల గురించి తెలుసుకోవడానికి సుముఖంగా ఉండవచ్చు. కాబట్టి అవకాశం దొరికిన ప్రతీసారి మన వెబ్సైట్ గురించి చెప్పండి.
ప్రశ్నలకు జవాబివ్వండి: ఒక్కోసారి ఇంటివాళ్లో, ఆసక్తిపరులో, పరిచయస్థులో మన గురించి లేదా మన నమ్మకాల గురించి ఏదైనా ప్రశ్న అడుగుతుంటారు. అప్పుడు, మొబైల్లో లేదా కంప్యూటర్లో వెబ్సైట్ తెరిచి అక్కడికక్కడే జవాబు చూపించండి. సాధారణంగా లేఖనాలను బైబిలు తెరిచి చదివితే మంచిది. మీకు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే, jw.org ఉపయోగించి వాళ్లే ఆ ప్రశ్నకు జవాబును ఎలా వెదకవచ్చో వివరించండి.—“Bible Teachings” (బైబిలు బోధలు) కింద “Bible Questions Answered” (బైబిలు ప్రశ్నలకు జవాబులు) లేదా “మా గురించి” కింద “తరచూ అడిగే ప్రశ్నలు” చూడండి.
తెలిసినవాళ్లకు ఒక ఆర్టికల్ లేదా ప్రచురణ పంపండి: PDF లేదా EPUB రూపంలో ఉన్న ప్రచురణలను ఈ-మెయిల్‌కు జత చేసి పంపండి. లేదా ఆడియో రూపంలో ఉన్న ప్రచురణను సీడీలోకి డౌన్లోడ్ చేయండి. బాప్తిస్మం తీసుకోని వాళ్లకు ఎలక్ట్రానిక్ రూపంలో పూర్తి పుస్తకం, బ్రోషుర్, లేదా పత్రిక ఇచ్చిన ప్రతీసారి దాన్ని మీరు క్షేత్ర సేవా రిపోర్టులో రాసుకోవచ్చు. అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురణలు పంపించేటప్పుడు వాటిని పంపుతున్నది మీరేనని అవతలి వాళ్లకి స్పష్టం చేయండి. ఒకేసారి అధిక సంఖ్యలో పంపకండి. మన సాహిత్యాన్ని ఏ ఇతర వెబ్సైట్లోనూ పెట్టకండి.—“ప్రచురణలు” చూడండి.
యెహోవాసాక్షుల గురించిన తాజా వార్తలు చూపించండి: మీ బైబిలు విద్యార్థులకు, ఇతరులకు వాటిని చూపిస్తే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మన పని మీద, మన క్రైస్తవ ఐక్యత మీద మెప్పుదల పెరుగుతుంది. (కీర్త. 133:1)—“News” (వార్తలు) చూడండి.
[5వ పేజీలోని డయాగ్రామ్]
(For fully formatted text, see publication)
ఇలా చేసి చూడండి
1 “ప్రచురణలు” కింద మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న దాన్ని ఎంచుకుని, మీకు ఏ రూపంలో కావాలో ఆ బటన్ని క్లిక్ చేయండి.
2 MP3 బటన్ మీద క్లిక్ చేస్తే దానిలో ఉన్న ఆర్టికల్‌ల పట్టిక కనిపిస్తుంది. ఏ ఆర్టికల్నైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే దాని శీర్షిక మీద క్లిక్ చేయండి. ఆన్లైన్లో వినాలనుకుంటే గుర్తు మీద క్లిక్ చేయండి.
3 మరో భాషలో ప్రచురణను డౌన్లోడ్ చేయాలనుకుంటే, ఈ లిస్ట్‌లో ఆ భాషను ఎంచుకోండి.
▸