మన అధికారిక వెబ్సైట్—వేరే భాష మాట్లాడేవాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగించండి
మన వెబ్‌సైట్‌ని వాళ్లకు చూపించండి: వెబ్‌సైట్‌ను తమ భాషలో చూడడానికి “Site Language” (వెబ్సైట్ భాష) లిస్ట్ ఎలా ఉపయోగించాలో చూపించండి. (కొన్ని భాషల్లో వెబ్సైట్ కొంతభాగం మాత్రమే అందుబాటులో ఉంది.)
వాళ్ల భాషలో వెబ్ పేజీ చూపించండి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? లేదా మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? వంటి మన ప్రచురణల్లో నుండి ఒక పేజీని వాళ్లకు చూపించండి. “Read In” (భాష) లిస్ట్ నుండి వాళ్ల భాషను ఎంపిక చేయండి.
ఆడియో రికార్డింగ్ వాళ్లకు వినిపించండి: ఏదైనా ఒక ఆర్టికల్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్ వాళ్ల భాషలో ఉంటే, వాళ్లకు వినిపించండి. ఒకవేళ మీరే మరో భాష నేర్చుకుంటుంటే, ఆ భాషలోని ప్రచురణ చదువుతున్నప్పుడు దాని ఆడియో రికార్డింగ్‌ను వినండి. అప్పుడు ఆ భాషలో మరింత నైపుణ్యం సాధిస్తారు.—“ప్రచురణలు” కింద “పుస్తకాలు & బ్రోషుర్లు” లేదా “పత్రికలు” చూడండి.
బధిరులకు సాక్ష్యమివ్వండి: మీరు బధిరులను కలిసినప్పుడు బైబిలుకు, ఏదైనా ఒక పుస్తకానికి, బ్రోషుర్కు లేదా కరపత్రానికి సంబంధించిన సంజ్ఞా భాష వీడియోను చూపించండి.—“ప్రచురణలు” కింద “సంజ్ఞా భాష” చూడండి.
[6వ పేజీలోని డయాగ్రామ్]
(For fully formatted text, see publication)
ఇలా చేసి చూడండి
1 ప్రచురణ ఆడియో రికార్డింగ్ (మీ భాషలో ఉంటే) వినాలనుకుంటే గుర్తు మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేయాలనుకుంటే “Download Options” (డౌన్లోడ్ ఎంపికలు) కింద ఉన్న ఒక బటన్ మీద క్లిక్ చేయండి.
2 ఈ పేజీని వాళ్ల భాషలో చూపించడానికి “భాష” లిస్ట్ నుండి ఆ భాష ఎంచుకోండి.
3 మరో ఆర్టికల్ లేదా అధ్యాయం చదవడానికి “తరవాతి” మీద లేదా “విషయసూచిక” కిందవున్న లింక్ మీద క్లిక్ చేయండి.
▸