ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
నవంబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“మనందరి కుటుంబాల్లో లేదా స్నేహితుల్లో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. మనం ఎప్పటికైనా వాళ్లను మళ్లీ చూస్తామా? [వాళ్లేమి చెప్తారో వినండి.] పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ఓదార్పునిచ్చే ఒక విషయాన్ని మీకు చూపించమంటారా?” గృహస్థుడు ఆసక్తి చూపిస్తే కావలికోట, అక్టోబరు - డిసెంబరు సంచిక 20వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని, అక్కడ ఇచ్చిన లేఖనాల్లో ఒకదాన్ని చదివి చర్చించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“జీవితంలోని గొప్ప సంతోషాల్లో పిల్లలు కలిగివుండడం ఒకటి. పిల్లలు పుట్టినప్పుడు ఎదురయ్యే సవాళ్లను తల్లిదండ్రులు ఎలా ఎదుర్కోవచ్చు? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయంలో ఉపయోగపడే ఒక లేఖన సూత్రాన్ని మీకు చూపించమంటారా? [గృహస్థుడు ఒప్పుకుంటే 1 కొరింథీయులు 13:4, 5 చదవండి.] మారిన పరిస్థితితో చక్కగా వ్యవహరించడానికి సహాయం చేసే సలహాలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.” తర్వాత, “పిల్లలు పుట్టినప్పుడు దంపతులకు ఎదురయ్యే సవాళ్లు” అనే ఆర్టికల్ చూపించండి.