ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
ఆగస్టులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“దేవునికి విధేయత చూపించడానికి ప్రయత్నించే ప్రజలు సంతోషంగా ఉంటారని మీరనుకుంటున్నారా? [వాళ్లేమి చెబుతారో వినండి. గృహస్థుడు వినడానికి ఆసక్తి చూపిస్తే చర్చ కొనసాగించండి.] ఈ ఆర్టికల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.” కావలికోట జూలై-సెప్టెంబరు ప్రతి ఒకటి చేతికిచ్చి 16, 17 పేజీల్లోని ఏదైనా ఉపశీర్షిక కింద ఉన్న సమాచారాన్ని చదివి, చర్చించండి. అక్కడున్న లేఖనాల్లో కనీసం ఒక్కటైనా చదవండి. పత్రిక ఇచ్చి తర్వాతి ప్రశ్నకు జవాబును పరిశీలించడానికి పునర్దర్శనాన్ని ఏర్పాటు చేసుకోండి.
కావలికోట జూలై - సెప్టెంబరు
“చరిత్రలోని గొప్ప స్త్రీపురుషుల నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మీరు నాతో ఏకీభవిస్తారా? [వాళ్లేమి చెబుతారో వినండి.] ఒక గొప్ప వ్యక్తి గురించి, ‘దేవుని స్నేహితుడు’ అని బైబిలు చెబుతున్న ఏకైక వ్యక్తి గురించి తెలియజేసే లేఖనాన్ని మీకు చూపించమంటారా? [గృహస్థులకు ఆసక్తి ఉంటే, వాళ్ళు ఇష్టపడితే యాకోబు 2:23 చదవండి.] దేవుడు ఎందుకు అబ్రాహామును తన స్నేహితునిగా ఎంచాడో, ఆయన ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”