మీరు ఆపేయాలా?
పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది ప్రచారకులు ఆనవాయితీగా ఎప్పుడూ ఒకే సమయంలో ఆపేస్తారు, ఎక్కువగా మధ్యాహ్నం పూట అలా ఆపేస్తారు. నిజమే, కొంతమంది ప్రచారకులు తమ పరిస్థితులను బట్టి నిర్దిష్ట సమయంలో పరిచర్య ఆపేయాల్సి ఉంటుంది. మరి మీ విషయమేమిటి? మీ గుంపులోని మిగతావాళ్లను బట్టి, లేదా మీ ప్రాంతంలోని ఆనవాయితిని బట్టి ఎప్పుడూ ఒకే సమయంలో పరిచర్యను ఆపేస్తున్నారా? మీరు ఇంకాసేపు ఉండి, వీధి సాక్ష్యం లేదా ఇతర బహిరంగ స్థలాల్లో సాక్ష్యం ఇవ్వగలరా? ఇంటికి వెళ్లేముందు దార్లో ఒకట్రెండు పునర్దర్శనాలు చేయగలరా? అలా, ఆసక్తిగల ఒక్కరినైనా కలిసి మాట్లాడగలిగితే లేదా అటువైపుగా వెళ్తున్న ఒక్కరికైనా పత్రికలు ఇవ్వగలిగితే ఎంత ప్రయోజనం ఉంటుందో కదా! మనకు సమయం ఉంటే, ఇంకాస్త ఎక్కువసేపు పరిచర్య చేయడం వల్ల సునాయాసంగా యెహోవాకు మరింత “స్తుతియాగము” చెల్లించవచ్చు.—హెబ్రీ. 13:15.