ప్రచార కార్యక్రమం మార్చి 22న మొదలౌతుంది
ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాలను పంచిపెట్టే ప్రచార కార్యక్రమం మార్చి 22న మొదలౌతుంది. దానిలో పాల్గొనమని ప్రతీ ఒక్కర్ని ప్రోత్సహిస్తున్నాం. వారాంతాల్లో, వీలైనప్పుడు తాజా పత్రికను కూడా అందించవచ్చు. ఏప్రిల్ నెల మొదటి శనివారం రోజు బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కాకుండా ఆహ్వానపత్రాలు అందించడానికే ప్రాధాన్యతనిస్తాం. అయితే, ఎవరైనా ఎక్కువ ఆసక్తి చూపిస్తే వాళ్లతో బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు. క్షేత్రంలోని ఎక్కువ మందికి ఆహ్వానపత్రాలు అందించడానికి బహిరంగ సాక్ష్యం సహాయపడుతుందేమో సేవా పర్యవేక్షకుడు నిర్ధారించవచ్చు. మీ బంధువులను, సహోద్యోగులను, తోటి విద్యార్థులను, ఆసక్తి చూపించినవాళ్లను, పరిచయస్థులను ఆహ్వానించడానికి వీలుగా ఇప్పుడే ఒక లిస్టు తయారుచేసుకొని, ప్రచార కార్యక్రమం మొదలవ్వగానే ఆహ్వానపత్రం అందించండి. ఇద్దరు వ్యక్తులు చూపించిన అత్యంత గొప్ప ప్రేమను గుర్తుచేసుకోవడానికి జరిపే ఈ ఆచరణకు ఎంతోమంది హాజరౌతారని ఆశిస్తున్నాం.—యోహా. 3:16; 15:13.