ప్రత్యేక ప్రచార కార్యక్రమం మార్చి 1న మొదలౌతుంది
1. ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఎప్పుడు మొదలౌతుంది? ఈసారి అది ఎందుకు ఎక్కువరోజులు ఉంటుంది?
1 జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరులను ఆహ్వానించడానికి ప్రతీ సంవత్సరం చేసే ప్రచార కార్యక్రమాన్ని ఈసారి మార్చి 1, శుక్రవారం రోజు ప్రారంభిస్తాం. జ్ఞాపకార్థ ఆచరణ మార్చి 26న జరుగుతుంది. అంటే, గత సంవత్సరాల్లో కన్నా ఈ సంవత్సరం ప్రచార కార్యక్రమం ఎక్కువ రోజులు ఉంటుంది. దానివల్ల, ఎక్కువమందిని ఆహ్వానించడానికి వీలౌతుంది, ముఖ్యంగా మీ సంఘ క్షేత్రం పెద్దగా ఉంటే ఆహ్వానపత్రాలు ఇవ్వడానికి సమయం సరిపోతుంది.
2. ఆహ్వానపత్రాలు తీసుకోవడానికి, క్షేత్రాన్ని పూర్తిచేయడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి?
2 తగిన ఏర్పాట్లు: మీ క్షేత్రాన్ని ఎలా పూర్తిచేయాలి? ప్రజలు ఇంటిదగ్గర లేకపోతే ఆహ్వానపత్రాన్ని వాళ్ల ఇంట్లో వేయాలా వద్దా? వంటివాటికి సంబంధించిన సూచనలను మీ సంఘ పెద్దలు ఇస్తారు. మీ క్షేత్రం పూర్తయిన తర్వాత కూడా మీ దగ్గర ఆహ్వానపత్రాలు మిగిలిపోతే, వాటిని బహిరంగ పరిచర్యలో పంచిపెట్టవచ్చు. జ్ఞాపకార్థ ఆచరణ జరిగే స్థలం, సమయం ముద్రించివున్న ఆహ్వానపత్రాలు సాహిత్య కౌంటర్లో లేదా పత్రికల కౌంటర్లో ఉండేలా సేవా పర్యవేక్షకుడు చూసుకుంటాడు. అయితే, వాటిని మొత్తం ఒకేసారి పెట్టకుండా చూసుకోవాలి. మనం ఆ వారానికి ఎన్ని కావాలో అన్నే తీసుకోవాలి.
3. ఆహ్వానపత్రాలను అందిస్తున్నప్పుడు మనమేమి గుర్తుంచుకోవాలి?
3 ఏమి చెప్పాలి? ఎక్కువమందిని ఆహ్వానించాలంటే క్లుప్తంగా మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడవచ్చో 6వ పేజీలో ఉంది. మీ క్షేత్రానికి తగినట్టుగా దాన్ని మలచుకోవచ్చు. ఒకవేళ ఇంటివాళ్లు స్నేహపూర్వకంగా మాట్లాడితే లేదా ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తే మనం కాస్త సమయం తీసుకొని మాట్లాడవచ్చు. వారాంతాల్లో ఆహ్వానపత్రాలను పంచుతున్నప్పుడు, అవకాశముంటే పత్రికలను కూడా ఇవ్వాలి. మార్చి 2న, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కాకుండా, ఆహ్వానపత్రాలను అందించడానికే మనం ఎక్కువగా కృషిచేస్తాం.
4. ప్రచార కార్యక్రమంలో మనందరం ఎందుకు ఉత్సాహంగా భాగం వహించాలి?
4 జ్ఞాపకార్థ ఆచరణకు మనతోపాటు చాలామంది వస్తారని ఆశిస్తున్నాం. ఆ రోజు ఇచ్చే ప్రసంగంలో, యేసు నిజంగా ఎవరనేది వివరిస్తారు. (1 కొరిం. 11:26) ఆయన మరణం మనకెలా సహాయం చేస్తుందో సమీక్షిస్తారు. (రోమా. 6:23) ఆయనను గుర్తుచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో చర్చిస్తారు. (యోహా. 17:3) ప్రచార కార్యక్రమంలో మనందరం ఉత్సాహంగా భాగం వహిద్దాం!