ఆరాధన కోసం కొత్త పాటలు!
అక్టోబరు 4, 2014లో జరిగిన వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్షిక కూటంలో, ప్రస్తుతం ఉన్న పాటల పుస్తకాన్ని రివైజ్‌చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అది నిజంగా సంతోషాన్నిచ్చే వార్త! మన ఆరాధనలో రాజ్యగీతాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడికి వచ్చిన వాళ్లందరికీ ఆ కూటంలో గుర్తుచేశారు.—కీర్త. 96:2.
2 ‘పాటల పుస్తకాన్ని ఎందుకు రివైజ్‌చేయాలి?’ అని మీరు అనుకోవచ్చు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిగా, లేఖనాల విషయంలో మన అవగాహన మెరుగౌతూ ఉంది, కాబట్టి మన పాటల్లో ఉన్న పదాలు కూడా మార్చాల్సి ఉంటుంది. (సామె. 4:18) మరో కారణం ఏమిటంటే, చాలా భాషల్లో ప్రస్తుతం ఉన్న పాటల పుస్తకంలోని చాలా పదాలను, పదబంధాలను అంతకుముందు ఉన్న నూతనలోక అనువాదం నుండి తీసుకున్నారు. ఇప్పుడు ఆ పదాలను రివైజ్‌చేసిన బైబిలుకు తగ్గట్టు సవరించాలి. పదాలను మార్చాలంటే చాలా పని ఉంటుంది. ఇంకా, పాటల పుస్తకంలో కొన్ని కొత్త పాటలను కూడా చేర్చాలని నిర్ణయించుకున్నాం.
3 కొత్త పాటలు పాడాలంటే కొత్త పాటల పుస్తకం ముద్రించే వరకు ఆగాలా? లేదు. రానున్న కొన్ని నెలల్లో, jw.org వెబ్‌సైట్‌లో కొత్త పాటలు విడుదలౌతాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. కొత్త పాట విడుదలచేసినప్పుడు, సేవా కూటం పట్టిక చివర్లో “కొత్త పాట” అని సూచిస్తూ ఇస్తారు.
4 కొత్త పాటలను పాడడం ఎలా ప్రాక్టీసు చేయవచ్చు: కొత్త పాటను నేర్చుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినా, కీర్తనకర్తలాగే సంఘ కూటాల్లో మనం పాడాలనుకుంటాం, ‘మౌనంగా ఉండం.’ (కీర్త. 30:11) కొత్త పాట నేర్చుకోవడానికి, సులువైన ఈ సలహాలు పాటించండి.
• వెబ్‌సైట్‌లో పెట్టే పాట పియానో రికార్డింగ్‌ను ఎక్కువసార్లు వినండి. ఆ సంగీతాన్ని మీరు ఎంత ఎక్కువగా వింటే, దాన్ని గుర్తుపెట్టుకోవడం అంత తేలికగా ఉంటుంది.
• పదాలను చదివి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి.
• సంగీతంతో పాటు పాడండి. మీకు బాగా వచ్చేవరకు అలా చేయండి.
• మీ కుటుంబంలోని వాళ్లకు సరిగ్గా పాడడం వచ్చేవరకు కుటుంబ ఆరాధనలో ఈ కొత్త పాటలను ప్రాక్టీసు చేయండి.
5 రానున్న నెలల్లో సేవాకూటాన్ని కొత్త పాటతో ముగించాలని పట్టికలో ఉంటే, ఆ పాట పియానో రికార్డింగ్‌ను సంఘమంతా ఒకసారి వింటుంది. ఆ తర్వాత మిగతా పాటలను పాడుతున్నట్లే, అందరం కలిసి ఆ పాటను పియానో రికార్డింగ్‌తోపాటు పాడతాం.
6 ఆలోచించండి, యెహోవాను స్తుతించడానికి, సంఘ కూటాల్లో అందరం గొంతుకలిపి పాడడం ఎంత ఆనందంగా ఉంటుందో! కాబట్టి, కూటాల్లో పాట పాడదామని చెప్పినప్పుడు, మనం అనవసరంగా సీట్లలో నుండి లేచి ఇటుఅటు తిరగడం అలవాటుగా చేసుకోకూడదు.
7 పరిశుద్ధమైన మన సంగీతం పట్ల సరైన కృతజ్ఞత చూపించడానికి మరో మార్గం ఉంది. సమావేశాల్లో, ప్రతీసెషన్ మొదలయ్యే ముందు కొంతసేపు సంగీతాన్ని వినిపిస్తారు. సంవత్సరానికి రెండుసార్లు, ప్రపంచ నలుమూలల నుండి నమ్మకమైన సహోదరసహోదరీలు వాళ్ల సొంత ఖర్చులతో న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌కు వెళ్లి, మన ఆరాధనలో ఉపయోగించే మధురమైన సంగీతాన్ని తయారుచేస్తారు. కాబట్టి, సీట్లలో కూర్చొని, వాద్యబృందం తయారుచేసిన సంగీతం వినమని ఛైర్మన్‌మనకు చెప్పినప్పుడు, మనం అలాగే చేయాలి. అప్పుడు, తర్వాత చెప్పే విషయాల కోసం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి అది సహాయం చేస్తుంది.—ఎజ్రా 7:10.
8 మనం ఈ రోజు కూటాన్ని, “రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!” అనే కొత్త పాటతో ముగిస్తాం. ఈ మధ్య జరిగిన వార్షిక కూటంలో ఈ పాటను పరిచయం చేశారు. రాజ్యపాలన మొదలై 100 సంవత్సరాలు అయ్యిందని సూచించడానికి ప్రత్యేకంగా కూర్చిన పాట ఇది.
9 కొత్త పాటలు నిజంగా యెహోవా నుండి వచ్చే “సద్విషయములు.” (మత్త. 12:35ఎ) కాబట్టి కొత్త పాటలు నేర్చుకోవాలని నిశ్చయించుకుందాం, అలాగే మన దేవునికి చెందాల్సిన స్తుతిని, ఘనతను ఇస్తూ మన హృదయం నుండి పాడదాం.—కీర్త. 147:1.