మన క్రైస్తవ జీవితం
పాటతో యెహోవాను సంతోషంగా కీర్తించండి
పౌలు, సీల జైల్లో ఉన్నప్పుడు పాట ద్వారా యెహోవాను కీర్తించారు. (అపొ 16:25) నిస్సందేహంగా, వాళ్లు పాడడం ద్వారా సహించడానికి కావాల్సిన బలాన్ని పొందారు. నేడు మన సంగతి ఏంటి? మనం ఆరాధనలో ఉపయోగించే పాటలు, JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ఉన్న ఇతర పాటలు మనకి ప్రోత్సాహాన్నిస్తాయి, పరీక్షలు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవి సహాయం చేస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా అవి యెహోవాను కీర్తిస్తాయి. (కీర్త 28:7) మనం కనీసం కొన్ని పాటలనైనా చూడకుండా పాడేలా గుర్తు పెట్టుకోవాలని ప్రోత్సహించబడుతున్నాం. మీరెప్పుడైనా అలా చేయడానికి ప్రయత్నించారా? మన కుటుంబ ఆరాధనలో పాటలు పాడడం నేర్చుకోవచ్చు, వాటిలో పదాల్ని కంఠస్థం చేయవచ్చు.
పాట ద్వారా పిల్లలు యెహోవాను కీర్తిస్తున్నారు, అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
రాజ్య గీతాలు పాడడం మన మీద ఎలాంటి మంచి ప్రభావం చూపిస్తుంది?
ఒక పాటను రికార్డు చేయడానికి ఆడియో/వీడియో విభాగాలు ఎలా సిద్ధపడతాయి?
ఒక పాటను రికార్డు చేయడానికి పిల్లలు, వాళ్ల కుటుంబాలు ఎలా సిద్ధపడతారు?
మీకు ఏ రాజ్య గీతాలంటే బాగా ఇష్టం, ఎందుకు?