మన క్రైస్తవ జీవితం
రాజ్యగీతాలు ధైర్యాన్ని ఇస్తాయి
పౌలు, సీల చెరసాలలో ఉండగా పాటలతో దేవున్ని స్తుతించారు. (అపొ 16:25) ఆధునిక కాలాల్లో తోటి విశ్వాసులు, నాజీ జర్మనీలో సాక్సన్‌హౌజన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌లో ఉన్నప్పుడు, సైబీరియాకు బహిష్కరించబడినప్పుడు రాజ్యగీతాలు పాడారు. ఈ ఉదాహరణలు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు క్రైస్తవులకు పాటలు ఎలా ధైర్యాన్ని ఇస్తాయో చూపిస్తాయి.
త్వరలో చాలా భాషల్లోకి సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి అనే కొత్త పాటల పుస్తకం రాబోతుంది. ఆ పుస్తకం మన చేతికి అందగానే, కుటుంబ ఆరాధనలో పాడుకుంటూ ఆ పాటలను మన హృదయాలపై ముద్రించుకోవచ్చు. (ఎఫె 5:19) శ్రమలు వచ్చినప్పుడు ఆ పాటలను గుర్తు చేసుకోవడానికి పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. మన నిరీక్షణను మర్చిపోకుండా ఉంచుకోవడానికి రాజ్యగీతాలు మనకు సహాయం చేస్తాయి. మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అవి మనలో ధైర్యాన్ని నింపుతాయి. మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా, హృదయంలో ఉన్న ఆనందాన్ని బట్టి, పాటల్లో ఉండే మంచి పదాల వల్ల మనం సంతోషంతో గొంతెత్తి పాడతాం. (1 దిన 15:16; కీర్త 33:1-3) కాబట్టి మనమందరం రాజ్యగీతాలను పాడడానికి బాగా కృషి చేద్దాం.
శ్రమల్లో ధైర్యాన్ని ఇచ్చిన ఒక పాట అనే వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
పాటను కూర్చడానికి బ్రదర్ ఫ్రాస్ట్‌ను నడిపించిన పరిస్థితులు ఏంటి?
సాక్సన్‌హౌజన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌లో సహోదరులకు ఆ పాట ఎలా ధైర్యాన్ని ఇచ్చింది?
ప్రతిరోజు ఎదురయ్యే ఏ పరిస్థితుల్లో రాజ్య గీతాలు మీకు శక్తిని ఇస్తాయి?
మీరు ఏ పాటలను గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నారు?