మన క్రైస్తవ జీవితం
బైబిలు సాహిత్యాలను తెలివిగా ఉపయోగించండి
యేసు “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అని నేర్పించాడు. (మత్త 10:8) మనం ఆ స్పష్టమైన నియమానికి కట్టుబడి బైబిళ్లను, బైబిలు సాహిత్యాలను ఎవ్వరికీ అమ్మము. (2 కొరిం 2:17) ప్రచురణల్లో దేవుని వాక్యం నుండి తీసుకున్న అమూల్యమైన సత్యాలు ఉంటాయి. ఎంతో శ్రమతో, ఖర్చుతో వాటిని ప్రింట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు పంపిస్తారు. కాబట్టి మనకు ఏమి అవసరమో వాటినే మనం తీసుకోవాలి.
సాహిత్యాన్ని ఇస్తున్నప్పుడు, బహిరంగ పరిచర్యలో ఉన్నా కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. (మత్త. 7:6) ప్రక్కన వెళ్లే వాళ్ల చేతిలో ఊరికే ఒక సాహిత్యాన్ని పెట్టే బదులు, వాళ్లకు ఆసక్తి ఉందో లేదో తెలుసుకునేందుకు వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించండి. కానీ ఒకవేళ ఎవరైనా ఫలానా ప్రచురణ కావాలని అడిగితే మనం వాళ్లకు సంతోషంగా దానిని ఇస్తాం.—సామె 3:27, 28.