కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూన్‌ పేజీ 7
  • మంచి చెడుల విషయంలో యెహోవా ప్రమాణాలను ఉన్నతపర్చండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి చెడుల విషయంలో యెహోవా ప్రమాణాలను ఉన్నతపర్చండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—1998
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2008
  • మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూన్‌ పేజీ 7

మన క్రైస్తవ జీవితం

మంచి చెడుల విషయంలో యెహోవా ప్రమాణాలను ఉన్నతపర్చండి

యెహోవా దేవుడు మనుషులకు నీతి నియమాలను పెడతాడు. ఉదాహరణకు పెళ్లి ఒక పురుషుడికి, స్త్రీకి మధ్య శాశ్వతంగా ఉండాల్సిన బంధం అనే నియమాన్ని ఆయన పెట్టాడు. (మత్త 19:4-6, 9) ఆయన అన్ని రకాల లైంగిక తప్పులను ఖండిస్తాడు. (1 కొరిం 6:9, 10) బట్టలు వేసుకోవడం, తల దువ్వుకోవడం లాంటి విషయాల్లో కూడా ఆయన ప్రజలకు ప్రత్యేకమైన నియమాలు ఇస్తాడు.—ద్వితీ 22:5; 1 తిమో 2:9, 10.

ఈ రోజుల్లో చాలామంది యెహోవా ప్రమాణాలను తిరస్కరిస్తున్నారు. (రోమా 1:18-32) తయారయ్యే విధానం, హెయిర్‌ స్టైల్‌, బట్టలు, ప్రవర్తన వంటి విషయాల్లో అందరూ ఎలా ఉంటే అలా ఉండాలని అనుకుంటున్నారు. చాలామంది వాళ్లు చేసే తప్పుల్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలా కాకుండా వేరుగా ఉండేవాళ్లను విమర్శిస్తుంటారు.—1 పేతు 4:3, 4.

యెహోవాసాక్షులుగా మనం దేవుని నైతిక ప్రమాణాలకు ధైర్యంగా కట్టుబడి ఉండాలి. (రోమా 12:9) ఎలా? ఆయనకు ఇష్టమైనదేదో తెలిపే విషయంలో నేర్పుగా ఉండాలి. అదే సమయంలో మన జీవితంలో ఆయన ఉన్నత ప్రమాణాలను చూపించాలి. ఉదాహరణకు ఏ డ్రస్‌ వేసుకోవాలో చూసుకుంటున్నప్పుడు లేదా రెడీ అవుతున్నప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను తీసుకునే నిర్ణయాలు లోకానికి తగ్గట్లుగా ఉన్నాయా లేదా యెహోవా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా? నేను వేసుకునే బట్టలు తయారయ్యే విధానం నన్ను దేవునికి భయపడే క్రైస్తవునిగా చూపిస్తున్నాయా?’ ఏదైనా సినిమా కానీ ప్రోగ్రామ్‌ గానీ చూడాలనుకున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘దీనిని చూస్తే యెహోవా ఒప్పుకుంటాడా? అందులో ఉన్న నైతిక ప్రమాణాలు ఎవరికి తగ్గట్లుగా ఉన్నాయి? నేను ఎంచుకునే వినోద కార్యక్రమాలు నీతిగా ఉండడానికి అడ్డుపడుతున్నాయా? (కీర్త 101:3) ఆ వినోదం నా కుటుంబ సభ్యులకు గానీ ఇతరులకు గానీ అభ్యంతరాన్ని లేదా ఇబ్బందిని కలిగిస్తుందా?’—1 కొరిం 10:31-33.

యెహోవా నియమాలకు కట్టుబడి ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? యేసుక్రీస్తు త్వరలో దేశాలన్నిటినీ చెడ్డవాళ్లందరినీ నాశనం చేస్తాడు. (యెహె 9:4-7) దేవుని చిత్తం చేసేవాళ్లు మాత్రమే మిగిలి ఉంటారు. (1 యోహా 2:15-17) కాబట్టి మనం యెహోవా పెట్టిన నైతిక ప్రమాణాల వైపు స్థిరంగా ఉందాం, అప్పుడు మన మంచి ప్రవర్తనను చూసేవాళ్లందరూ దేవున్ని మహిమ పరుస్తారు.—1 పేతు 2:11, 12.

ఒకామె ఏమి వేసుకోవాలో నిర్ణయించుకుంటుంది

నేను వేసుకునే బట్టలు, నా జుట్టు, నేను తయారయ్యే విధానం నాకున్న నైతిక ప్రమాణాలు గురించి ఏమి చెప్తుంది?

యెహోవా స్నేహితులవ్వండి—ఒక పురుషుడు, ఒక స్త్రీ వీడియో చూసి, ఆ తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చూడండి:

  • యెహోవా నియమాలకు తగ్గట్లుగా జీవించడం ఎందుకు తెలివైన పని?

  • తల్లిదండ్రులు పిల్లలకు యెహోవా ప్రమాణాలను నేర్పించడం చిన్నప్పటి నుండే ఎందుకు మొదలుపెట్టాలి?

  • దేవుని మంచితనం నుండి ప్రయోజనం పొందేలా పెద్దవాళ్లైనా, చిన్నవాళ్లైనా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?

ఎవరైనా ఇలా అంటే మీరు ఏమి చెప్తారు?

  • “హోమోసెక్షువాలిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి?”

  • “హోమోసెక్షువాలిటీ గురించి బైబిలు అభిప్రాయం ఈ కాలానికి సరిపోదు.”

  • “హోమోసెక్షువల్స్‌ వాళ్ల ప్రవర్తనను మార్చుకోలేరు; వాళ్లు పుట్టడమే అలా పుట్టారు.”

(yp1-E 23వ అధ్యా.; yp2-E 28వ అధ్యా.; g16 No.3 7-9 పేజీలు)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి