మన క్రైస్తవ జీవితం
దైవభక్తికి, శారీరక శిక్షణకు తేడా
శారీరక శిక్షణ వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక శిక్షణ వల్ల వచ్చే ప్రయోజనాలతో పోలిస్తే తక్కువే. (1 తిమో 4:8) కాబట్టి క్రైస్తవులు ఆటలకు తమ జీవితంలో ఏ స్థానం ఇవ్వాలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.
ఆటల గురించి కొన్ని విషయాలు అనే వైట్‌బోర్డ్ యానిమేషన్ వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబివ్వండి:
1. ఆటలాడడం ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం?
2. ఒకానొక ఆట మనకు మంచి చేస్తుందా లేదా అని ఏ మూడు విషయాల్ని బట్టి తెలుసుకోవచ్చు?
3. ఏ ఆటలు చూడాలో, ఆడాలో నిర్ణయించుకోవడానికి కీర్తన 11:5 ఎలా సహాయం చేస్తుంది?
4. ఫిలిప్పీయులు 2:3, సామెతలు 16:18 ప్రకారం, ఆటలు ఆడేటప్పుడు మనం ఎలా ఉండకూడదు?
5. మరీ ఎక్కువసేపు ఆటలు చూడకుండా, ఆడకుండా ఉండడానికి ఫిలిప్పీయులు 1:10 మనకు ఎలా సహాయం చేస్తుంది?