కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
ప్రకటన
ఆన్‌లైన్‌ లైబ్రరీ అందుబాటులోకి వచ్చిన కొత్త భాష: Mbum
  • ఈ రోజు

ఆదివారం, జూలై 27

‘అతను ప్రోత్సహించగలగాలి, గద్దించగలగాలి.’—తీతు 1:9.

పరిణతిగల క్రైస్తవునిగా అవ్వడానికి, మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకోండి. అలా చేస్తే సంఘంలో బాధ్యతల్ని చేపట్టగలుగుతారు. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని, మిమ్మల్ని మీరు పోషించుకోగలుగుతారు. అలాగే మీ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. అంతేకాదు, ఇతరులతో మంచి స్నేహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, చదవడం-రాయడం బాగా నేర్చుకోండి. సంతోషంగా ఉండే వ్యక్తి, తన పనులన్నిటిలో సఫలమయ్యే వ్యక్తి ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానిస్తాడని బైబిలు చెప్తుంది. (కీర్త. 1:1-3) అతను రోజూ బైబిలు చదవడం వల్ల యెహోవా ఆలోచనలు తెలుసుకుంటాడు. చదివిన లేఖనాల్ని ఎలా పాటించాలో స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. (సామె. 1:3, 4) బైబిలు ఉపయోగిస్తూ బోధించే, సలహాలిచ్చే సామర్థ్యం ఉన్న సహోదరులు మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఎంతో అవసరం. మీకు చదవడం, రాయడం బాగా వస్తే మీ ప్రసంగాల్లో, కామెంట్స్‌లో ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని, బలపర్చే విషయాల్ని చెప్పగలుగుతారు. అంతేకాదు, మీ విశ్వాసాన్ని బలపర్చే, ఇతరుల్ని ప్రోత్సహించే మంచి నోట్స్‌ రాసుకోగలుగుతారు. w23.12 26-27 ¶9-11

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025

సోమవారం, జూలై 28

“మీతో ఐక్యంగా ఉన్న దేవుడు, లోకంతో ఐక్యంగా ఉన్న అపవాది కన్నా బలవంతుడు.”—1 యోహా. 4:4.

మీకు భయమేసినప్పుడు, భవిష్యత్తులో సాతాను నామరూపాల్లేకుండా పోయినప్పుడు యెహోవా ఏం చేస్తాడో ఆలోచించండి. 2014 ప్రాదేశిక సమావేశంలో ఒక చక్కని డెమో వచ్చింది. అందులో ఒక తండ్రి, 2 తిమోతి 3:1-5 వచనాలు కొత్తలోకం గురించి చెప్తే ఎలా ఉంటుందో తన కుటుంబానికి చదివి వినిపించాడు. ఆయన ఇలా చదివాడు: “కొత్తలోకంలో సంతోషకరమైన కాలాలు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: ఇతరుల్ని ప్రేమించేవాళ్లు, సత్యాన్ని ప్రేమించేవాళ్లు, అణకువ గలవాళ్లు, వినయం గలవాళ్లు, దేవుణ్ణి మహిమపర్చేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడేవాళ్లు, కృతజ్ఞత చూపించేవాళ్లు, విశ్వసనీయులు, మమకారం ఉన్నవాళ్లు, ఇతరులతో సమ్మతించేవాళ్లు, ఇతరుల గురించి ఎప్పుడూ మంచే మాట్లాడేవాళ్లు, ఆత్మనిగ్రహం చూపించేవాళ్లు, సౌమ్యులు, మంచిని ప్రేమించేవాళ్లు, నమ్మకస్థులు, లోబడడానికి సిద్ధంగా ఉండేవాళ్లు, తమనుతాము తగ్గించుకునేవాళ్లు, సుఖాల్ని కాకుండా దేవుణ్ణి ప్రేమించేవాళ్లు, నిజమైన భక్తి చూపించేవాళ్లు. అలాంటివాళ్లను నువ్వు అంటిపెట్టుకొని ఉండు.” మీరు కొత్తలోకంలో జీవితం గురించి మీ కుటుంబంతో లేదా బ్రదర్స్‌సిస్టర్స్‌తో మాట్లాడుతుంటారా? w24.01 6 ¶13-14

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025

మంగళవారం, జూలై 29

“నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”—లూకా 3:22.

యెహోవా మనల్ని ఒక గుంపుగా చూసి సంతోషిస్తాడని తెలుసుకోవడం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా! బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు.” (కీర్త. 149:4) అయితే, కొన్నిసార్లు కొంతమంది ఎంత డీలా పడిపోతారంటే ‘యెహోవా నన్ను చూసి అసలు సంతోషిస్తున్నాడా?’ అని అనుకుంటారు. బైబిల్లో కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకులు కూడా అలాంటి ఆలోచనలతో సతమతమయ్యారు. (1 సమూ. 1:6-10; యోబు 29:2, 4; కీర్త. 51:11) అపరిపూర్ణ మనుషులు కూడా యెహోవాను సంతోషపెట్టగలరని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. ఎలా? మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం తీసుకోవాలి. (యోహా. 3:16) అలా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపాల విషయంలో పశ్చాత్తాపం చూపించామని, యెహోవా ఇష్టం చేస్తామనే మాటిచ్చామని అందరికీ చూపిస్తాం. (అపొ. 2:38; 3:19) మనం తనతో స్నేహం ఏర్పరచుకోవడానికి ఈ పనులన్నీ చేయడం చూసి యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు. మనం సమర్పించుకున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేసినంత కాలం, యెహోవా మనల్ని చూసి సంతోషిస్తూనే ఉంటాడు, తన స్నేహితుల చిట్టాలోకి చేర్చుకుంటాడు.—కీర్త. 25:14. w24.03 26 ¶1-2

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి