లూకా సువార్త
3 తిబెరి కైసరు పరిపాలనలోని 15వ సంవత్సరంలో, యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు; గలిలయ ప్రాంతానికి హేరోదు,*+ ఇతూరయ-త్రకోనీతి ప్రాంతాలకు అతని సహోదరుడు ఫిలిప్పు, అబిలేనే ప్రాంతానికి లుసానియ పరిపాలకులుగా* ఉన్నప్పుడు; 2 అన్న ముఖ్య యాజకుడిగా, కయప ప్రధానయాజకుడిగా ఉన్న రోజుల్లో,+ ఎడారిలో* ఉన్న+ జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది.+
3 కాబట్టి అతను యొర్దాను చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లి, పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోమని ఆ ప్రాంతాలన్నిట్లో ప్రకటిస్తూ ఉన్నాడు.+ 4 ఎందుకంటే, యెషయా ప్రవక్త పుస్తకంలో ఇలా రాసి ఉంది: “ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు: ‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి.+ 5 ప్రతీ లోయను పూడ్చాలి; ప్రతీ పర్వతాన్ని, కొండను చదును చేయాలి. వంకరగా ఉన్న దారులు తిన్నగా అవ్వాలి, గరుకుగా ఉన్న దారులు నున్నగా అవ్వాలి. 6 మనుషులందరూ దేవుని రక్షణను* చూస్తారు.’ ”+
7 కాబట్టి తన దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్న ప్రజలతో అతను ఇలా అనేవాడు: “సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోమని ఎవరు మిమ్మల్ని హెచ్చరించారు?+ 8 కాబట్టి పశ్చాత్తాపపడ్డారని చూపించే పనులు చేయండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని అనుకోకండి. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు. 9 నిజానికి, చెట్లను వేళ్ల దగ్గర నుండి నరకడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో వేయబడుతుంది.”+
10 అప్పుడు ప్రజలు అతన్ని, “మరైతే మేమేం చేయాలి?” అని అడిగేవాళ్లు. 11 దానికి అతను, “రెండు వస్త్రాలు* ఉన్న వ్యక్తి, ఒక్క వస్త్రం కూడా లేని వ్యక్తికి ఒక వస్త్రం ఇవ్వాలి. ఆహారం ఉన్న వ్యక్తి కూడా అలాగే చేయాలి” అని చెప్పేవాడు.+ 12 పన్ను వసూలుచేసే వాళ్లు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి అతని దగ్గరికి వచ్చి,+ “బోధకుడా, మేమేం చేయాలి?” అని అడిగేవాళ్లు. 13 అతను, “వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ పన్ను వసూలు చేయకండి” అని వాళ్లకు చెప్పేవాడు.+ 14 అంతేకాదు సైనికులు కూడా, “మేమేం చేయాలి?” అని అతన్ని అడిగేవాళ్లు. అతను, “ఎవర్నీ దోచుకోకండి, ఎవరి మీదా అన్యాయంగా నేరం మోపకండి.+ మీకు వచ్చే జీతంతో తృప్తిపడండి” అని వాళ్లకు చెప్పేవాడు.
15 అప్పట్లో ప్రజలు క్రీస్తు కోసం ఎదురుచూస్తూ యోహాను గురించి, “బహుశా ఈయనే క్రీస్తు అయ్యుంటాడా?” అని తమ హృదయాల్లో ఆలోచించుకుంటూ ఉన్నారు.+ 16 కాబట్టి యోహాను వాళ్లందరితో ఇలా చెప్పాడు: “నేనైతే మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా కన్నా బలవంతుడు వస్తున్నాడు. ఆయన చెప్పుల తాడు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు.+ ఆయన మీకు పవిత్రశక్తితో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు.+ 17 తూర్పారబట్టే పార* ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్లాన్ని* పూర్తిగా శుభ్రం చేసి గోధుమల్ని గోదాములో సమకూరుస్తాడు, పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.”
18 అంతేకాదు, అతను ఇంకా చాలా విధాల్లో ప్రజల్ని ప్రోత్సహించాడు, వాళ్లకు మంచివార్త ప్రకటిస్తూ వచ్చాడు. 19 అయితే యోహాను గలిలయ పరిపాలకుడైన హేరోదును అతని సహోదరుడి భార్య హేరోదియ విషయంలో, అలాగే అతను చేసిన చెడు పనులన్నిటి విషయంలో గద్దించాడు. 20 దాంతో హేరోదు యోహానును చెరసాలలో వేయించి+ ఇంకో చెడ్డపని చేశాడు.
21 ప్రజలందరూ బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు, యేసు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు.+ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆకాశం తెరుచుకుంది.+ 22 పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదికి దిగివచ్చింది. ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది: “నువ్వు నా ప్రియ కుమారుడివి; నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”*+
23 యేసు+ తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయనకు దాదాపు 30 ఏళ్లు.+ ప్రజలు అనుకున్నదాని ప్రకారం ఆయన
యోసేపు కుమారుడు,+
యోసేపు హేలీ కుమారుడు,
24 హేలీ మత్తతు కుమారుడు,
మత్తతు లేవి కుమారుడు,
లేవి మెల్కీ కుమారుడు,
మెల్కీ యన్న కుమారుడు,
యన్న యోసేపు కుమారుడు,
25 యోసేపు మత్తతీయ కుమారుడు,
మత్తతీయ ఆమోసు కుమారుడు,
ఆమోసు నాహోము కుమారుడు,
నాహోము ఎస్లి కుమారుడు,
ఎస్లి నగ్గయి కుమారుడు,
26 నగ్గయి మయతు కుమారుడు,
మయతు మత్తతీయ కుమారుడు,
మత్తతీయ సిమియ కుమారుడు,
సిమియ యోశేఖు కుమారుడు,
యోశేఖు యోదా కుమారుడు,
27 యోదా యోహన్న కుమారుడు,
యోహన్న రేసా కుమారుడు,
రేసా జెరుబ్బాబెలు+ కుమారుడు,
జెరుబ్బాబెలు షయల్తీయేలు+ కుమారుడు,
షయల్తీయేలు నేరి కుమారుడు,
28 నేరి మెల్కీ కుమారుడు,
మెల్కీ అద్ది కుమారుడు,
అద్ది కోసాము కుమారుడు,
కోసాము ఎల్మదాము కుమారుడు,
ఎల్మదాము ఏరు కుమారుడు,
29 ఏరు యేసు కుమారుడు,
యేసు ఎలీయెజెరు కుమారుడు,
ఎలీయెజెరు యోరీము కుమారుడు,
యోరీము మత్తతు కుమారుడు,
మత్తతు లేవి కుమారుడు,
30 లేవి సుమెయోను కుమారుడు,
సుమెయోను యూదా కుమారుడు,
యూదా యోసేపు కుమారుడు,
యోసేపు యోనాము కుమారుడు,
యోనాము ఎల్యాకీము కుమారుడు,
31 ఎల్యాకీము మెలెయా కుమారుడు,
మెలెయా మెన్నా కుమారుడు,
మెన్నా మత్తతా కుమారుడు,
మత్తతా నాతాను+ కుమారుడు,
నాతాను దావీదు+ కుమారుడు,
యెష్షయి ఓబేదు+ కుమారుడు,
ఓబేదు బోయజు+ కుమారుడు,
బోయజు శల్మాను+ కుమారుడు,
శల్మాను నయస్సోను+ కుమారుడు,
33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు,
అమ్మీనాదాబు అర్నీ* కుమారుడు,
అర్నీ ఎస్రోను కుమారుడు,
ఎస్రోను పెరెసు+ కుమారుడు,
పెరెసు యూదా+ కుమారుడు,
యాకోబు ఇస్సాకు+ కుమారుడు,
ఇస్సాకు అబ్రాహాము+ కుమారుడు,
అబ్రాహాము తెరహు+ కుమారుడు,
తెరహు నాహోరు+ కుమారుడు,
సెరూగు రయూ+ కుమారుడు,
రయూ పెలెగు+ కుమారుడు,
పెలెగు హెబెరు+ కుమారుడు,
హెబెరు షేలహు+ కుమారుడు,
36 షేలహు కేయినాను కుమారుడు,
కేయినాను అర్పక్షదు+ కుమారుడు,
అర్పక్షదు షేము+ కుమారుడు,
షేము నోవహు+ కుమారుడు,
నోవహు లెమెకు+ కుమారుడు,
మెతూషెల హనోకు కుమారుడు,
హనోకు యెరెదు+ కుమారుడు,
యెరెదు మహలలేలు+ కుమారుడు,
మహలలేలు కేయినాను+ కుమారుడు,
ఎనోషు షేతు+ కుమారుడు,
షేతు ఆదాము+ కుమారుడు,
ఆదాము దేవుని కుమారుడు.