కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • es25 పేజీలు 67-77
  • జూలై

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై
  • ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
  • ఉపశీర్షికలు
  • మంగళవారం, జూలై 1
  • బుధవారం, జూలై 2
  • గురువారం, జూలై 3
  • శుక్రవారం, జూలై 4
  • శనివారం, జూలై 5
  • ఆదివారం, జూలై 6
  • సోమవారం, జూలై 7
  • మంగళవారం, జూలై 8
  • బుధవారం, జూలై 9
  • గురువారం, జూలై 10
  • శుక్రవారం, జూలై 11
  • శనివారం, జూలై 12
  • ఆదివారం, జూలై 13
  • సోమవారం, జూలై 14
  • మంగళవారం, జూలై 15
  • బుధవారం, జూలై 16
  • గురువారం, జూలై 17
  • శుక్రవారం, జూలై 18
  • శనివారం, జూలై 19
  • ఆదివారం, జూలై 20
  • సోమవారం, జూలై 21
  • మంగళవారం, జూలై 22
  • బుధవారం, జూలై 23
  • గురువారం, జూలై 24
  • శుక్రవారం, జూలై 25
  • శనివారం, జూలై 26
  • ఆదివారం, జూలై 27
  • సోమవారం, జూలై 28
  • మంగళవారం, జూలై 29
  • బుధవారం, జూలై 30
  • గురువారం, జూలై 31
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
es25 పేజీలు 67-77

జూలై

మంగళవారం, జూలై 1

“ఆయన మంచిపనులు చేస్తూ, . . . వాళ్లను బాగుచేస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడు.”— అపొ. 10:38.

యేసు తన మాటల్లో, పనుల్లో, ఆఖరికి ఆయన చేసిన అద్భుతాల్లో కూడా తన తండ్రి ఎలా ఆలోచిస్తాడో, ఆయనకు ఎలా అనిపిస్తుందో అచ్చుగుద్దినట్టు చూపించాడు. (యోహా. 14:9) అయితే, యేసు చేసిన అద్భుతాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యేసు, ఆయన తండ్రి మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే సమస్యలతో నలిగిపోతున్న ప్రజలకు ఉపశమనం ఇవ్వడానికి ఆయన అద్భుతాలు చేసే తన శక్తిని ఉపయోగించాడు. ఒక సందర్భంలో, ఇద్దరు గుడ్డివాళ్లు తమను బాగుచేయమని యేసును అడిగారు. (మత్త. 20:30-34) అప్పుడు ఆయన వాళ్లమీద “జాలిపడి” బాగుచేశాడు. ఇక్కడ “జాలిపడ్డాడు” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం, కడుపు తరుక్కుపోవడాన్ని సూచిస్తుంది. లోలోపల నుండి కలిగిన ఆ కనికరం వల్ల యేసు ఎంతోమంది ప్రజలకు ఆహారం పెట్టాడు, కుష్ఠువాళ్లను బాగుచేశాడు. ఆ విధంగా ఆయన ప్రేమ చూపించాడు. (మత్త. 15:32; మార్కు 1:41) “కనికరంగల” యెహోవా, ఆయన కుమారుడు మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారని, మన బాధను వాళ్ల బాధగా చూస్తున్నారనే నమ్మకంతో ఉండవచ్చు. (లూకా 1:78; 1 పేతు. 5:7) కాబట్టి ప్రజల్ని పట్టిపీడిస్తున్న సమస్యల్ని తీసివేయడానికి వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. w23.04 3 ¶4-5

బుధవారం, జూలై 2

“యెహోవాను ప్రేమించే వాళ్లారా, చెడును అసహ్యించుకోండి. తన విశ్వసనీయుల ప్రాణాల్ని ఆయన కాపాడుతున్నాడు; దుష్టుల చేతి నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్త. 97:10.

సాతాను లోకంలో పేరుగాంచిన ఆలోచనలు, సిద్ధాంతాలు మన మనసుల్ని కప్పేయకూడదంటే మనం వాటిని చదవకూడదు, వినకూడదు. దానికి బదులుగా బైబిల్ని చదువుతూ, అధ్యయనం చేస్తూ మన మనసును మంచి ఆలోచనలతో నింపుకోవచ్చు. మీటింగ్స్‌కి వెళ్లడం, ప్రీచింగ్‌ చేయడంవల్ల మన ఆలోచనలకు కంచె వేసుకోవచ్చు. ఫలితంగా, మనం తట్టుకోగలిగే వాటికన్నా ఎక్కువ పరీక్షల్ని రానివ్వనని యెహోవా మాటిస్తున్నాడు. (1 కొరిం. 10:12, 13) ఈ కష్టమైన చివరిరోజుల్లో యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ముందెప్పటికన్నా ఎక్కువసార్లు మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థనలో ‘ఆయన ముందు మన హృదయాల్ని ​కుమ్మరించాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 62:8) యెహోవాను స్తుతించండి, ఆయన చేసినవాటన్నిటికీ థ్యాంక్స్‌ చెప్పండి. ప్రీచింగ్‌ చేయడానికి కావల్సిన ధైర్యం ఇవ్వమని అడగండి. మీ సమస్యలకు ఎదురీదడానికి, తప్పుడు కోరికల్ని తిప్పికొట్టడానికి సహాయం చేయమని వేడుకోండి. ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించకుండా చేసే దేన్నీ లేదా ఎవర్నీ అనుమతించకండి. w23.05 7 ¶17-18

గురువారం, జూలై 3

“మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం . . . , ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం.”—హెబ్రీ. 10:24, 25.

మనం మీటింగ్స్‌కి ఎందుకు వస్తాం? మొదటిగా, యెహోవాను స్తుతించడానికి వస్తాం. (కీర్త. 26:12; 111:1) రెండోది, ఈ కష్టసమయాల్లో ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి మీటింగ్స్‌కి వస్తాం. (1 థెస్స. 5:11) అయితే, మనం కామెంట్స్‌ చెప్పినప్పుడు ఆ రెండు పనులు చేస్తాం. అయితే, కామెంట్స్‌ చెప్తున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉదాహరణకు, కొంతమందికి కామెంట్స్‌ చెప్పాలంటే భయంభయంగా, గుండె దడగా అనిపించవచ్చు. ఇంకొంతమందికి కామెంట్స్‌ చెప్పాలని ఉత్సాహంగా ఉన్నా, వాళ్లని ఎక్కువసార్లు అడగట్లేదు అని అనిపించవచ్చు. ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడవచ్చు? అపొస్తలుడైన పౌలు మనం ‘ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం’ మీద మనసుపెట్టాలని చెప్పాడు. విశ్వాసంతో మనం చెప్పే చిన్న కామెంట్‌ అయినా, తోటివాళ్లను ప్రోత్సహిస్తుందని గుర్తు పెట్టుకున్నప్పుడు కామెంట్స్‌ చెప్పడానికి ముందుకొస్తాం. అలాగే ఒకవేళ మనల్ని ఎక్కువ అడగకపోయినా కామెంట్స్‌ చెప్పే అవకాశం సంఘంలో వేరేవాళ్లకు దొరుకుతుంది అనే సంతోషంతో మనం ఉండవచ్చు.— 1 పేతు. 3: 8. w23.04 20 ¶1-3

శుక్రవారం, జూలై 4

‘యెరూషలేముకు వెళ్లి యెహోవా మందిరాన్ని తిరిగి కట్టండి.’—ఎజ్రా 1:3.

దాదాపు 70 ఏళ్లుగా బబులోనులో బందీలుగా ఉన్న యూదులు, తమ స్వదేశమైన ఇశ్రాయేలుకు తిరిగెళ్లొచ్చు అనే ఆజ్ఞను రాజు జారీచేశాడు. (ఎజ్రా 1:2-4) దీనికి కారణం యెహోవా మాత్రమే. ఎందుకంటే, బందీలను విడుదల చేసినట్టు బబులోను చరిత్రలోనే లేదు. (యెష. 14:4, 17) కానీ కొత్త రాజు బబులోనును చేజిక్కిచ్చుకున్న తర్వాత, యూదులు తమ స్వదేశానికి తిరిగెళ్లొచ్చని చెప్పాడు. యూదులు, ముఖ్యంగా కుటుంబ పెద్దలు బబులోనును విడిచివెళ్లాలా లేదా అక్కడే ఉండాలా అని నిర్ణయించుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడం అంత తేలికేమీ కాదు. ముసలివాళ్లు అంత దూరం ప్రయాణించడానికి ఓపిక, శక్తి లేక ఆగిపోయి ఉంటారు. కొంతమంది యూదులేమో, అక్కడే పుట్టిపెరిగారు కాబట్టి అదే వాళ్ల సొంత దేశం అయిపోయింది. వాళ్ల దృష్టిలో ఇశ్రాయేలు అంటే వాళ్ల తాతముత్తాతలది. ఇంకొంతమంది యూదులకు, వ్యాపారంలో బాగా చేయి తిరగడంతో ఆస్తిపాస్తుల్ని వెనకేసుకుని ఉంటారు, సౌకర్యవంతమైన ఇళ్లు కట్టుకుని ఉంటారు. కాబట్టి వాటన్నిటిని వదిలేసి తెలియని దేశానికి వెళ్లాలంటే వాళ్లకు మనసు రాలేదు. w23.05 14 ¶1-2

శనివారం, జూలై 5

“మీరు . . . సిద్ధంగా ఉండండి.”—మత్త. 24:44.

సహనాన్ని, కనికరాన్ని, ప్రేమను పెంచుకుంటూ ఉండమని బైబిలు చెప్తుంది. లూకా 21:19 ఇలా చెప్తుంది: “మీ సహనం వల్ల మీరు మీ ప్రాణాలు రక్షించుకుంటారు.” కొలొస్సయులు 3:12 ఇలా చెప్తుంది: “కనికరాన్ని, . . . అలవర్చుకోండి.” 1 థెస్సలొనీకయులు 4:9, 10 ఇలా చెప్తుంది: “మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు. . . . అయితే సహోదరులారా, ఇంకా పూర్తిస్థాయిలో అలా ప్రేమ చూపిస్తూ ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం.” ఈ మాటలన్నీ సహనం, కనికరం, ప్రేమ అనే లక్షణాల్ని ముందు నుంచే చూపిస్తున్న క్రైస్తవులకు చెప్పబడ్డాయి. ఎందుకంటే వాళ్లు ఆ లక్షణాల్ని ఇంకా పెంచుకుంటూనే ఉండాలి. మనం కూడా వాళ్లలాగే చేయాలి. దానికోసం మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఈ లక్షణాల్ని ఎలా చూపించారో, వాళ్లలాగే మీరు ఆ లక్షణాల్ని ఎలా చూపించవచ్చో, అలా మహాశ్రమకు సిద్ధంగా ఉన్నారని ఎలా నిరూపించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అలా మహాశ్రమ మొదలవ్వడానికి ముందే సహనాన్ని చూపించడం మీకు అలవాటు అయ్యుంటుంది కాబట్టి, ఆ లక్షణాల్ని ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉండాలని నిర్ణయించుకుంటారు. w23.07 3 ¶4, 8

ఆదివారం, జూలై 6

‘ఒక రాజమార్గం . . . పవిత్ర మార్గం ఉంటుంది.’—యెష. 35:8.

మనం అభిషిక్తులమైనా లేదా వేరే గొర్రెలమైనా ఆ ‘పవిత్ర మార్గంలోనే’ ఉండాలి. ఎందుకంటే అది మనల్ని ఆధ్యాత్మిక పరదైసు గుండా కొత్తలోకంలో పొందే ఆశీర్వాదాలవైపు నడిపిస్తుంది. (యోహా. 10:16) 1919 నుండి లక్షలమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనును విడిచిపెట్టి, ఆ దారిలో ప్రయాణించడం మొదలుపెట్టారు. యూదులు బబులోనును విడిచి వస్తున్నప్పుడు దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా యెహోవా చూసుకున్నాడు. (యెష. 57:14) మరి ఈరోజుల్లో “పవిత్ర మార్గం” సంగతేంటి? 1919 కన్నా చాలా సంవత్సరాల ముందే, మహాబబులోను నుండి బయటికి వచ్చే దారిని చదును చేయడానికి యెహోవా దైవభక్తిగల పురుషుల్ని ఉపయోగించుకున్నాడు. (యెషయా 40:3 తో పోల్చండి.) వాళ్లు ఆ దారిని చదును చేయడానికి అవసరమైన పనులు అంటే సత్యం వైపుకు వెళ్లే దారిని సిద్ధం చేశారు. దానివల్ల సరైన హృదయస్థితి గలవాళ్లు మహాబబులోనును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక పరదైసులో అడుగుపెట్టగలిగారు. అలా గాడిలో పడిన సత్యారాధనవల్ల వాళ్లు యెహోవాను ఆరాధించగలిగారు. w23.05 15-16 ¶8-9

సోమవారం, జూలై 7

“సంతోషంతో యెహోవాను సేవించండి. ఆనందంతో కేకలు వేస్తూ ఆయన సన్నిధిలోకి రండి.”—కీర్త. 100:2.

మనం ఆనందంగా, ఇష్టంగా తన సేవ చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. (2 కొరిం. 9:7) అయితే, మనలో ఆ తపన లేకపోయినా మన లక్ష్యం వైపు అడుగులు వేయగలమా? పౌలు ఉదాహరణను గమనించండి. ఆయన ఇలా అంటున్నాడు: “నా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను, దాన్ని బానిసగా చేసుకుంటున్నాను.” (1 కొరిం. 9:25-27) యెహోవా కోరుకునేది చేయాలనే తపన కొన్నిసార్లు పౌలులో లేకపోయినా, దాన్ని చేయడానికి ఆయన పోరాడాడు. మరి ఆయన చేసినదాన్ని యెహోవా అంగీకరించాడా? సందేహమే లేదు. పౌలు చేసిన ప్రతీ ప్రయత్నాన్ని యెహోవా దీవించాడు. (2 తిమో. 4:7, 8) మనకు లక్ష్యం చేరుకోవాలనే తపన లేకపోయినా, దానివైపు అడుగులు వేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. మనం చేసే పని కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా, ఆయన మీద ప్రేమతో చేస్తున్నామని యెహోవాకు తెలుసు కాబట్టి సంతోషిస్తాడు. పౌలును దీవించినట్టే, మనం చేసే ప్రయత్నాన్ని కూడా యెహోవా దీవిస్తాడు. (కీర్త. 126:5) యెహోవా ఇచ్చే దీవెనల్ని రుచి చూశాక మనలో తపన మొదలవ్వవచ్చు. w23.05 29 ¶9-10

మంగళవారం, జూలై 8

“యెహోవా రోజు . . . వస్తుంది.”—1 థెస్స. 5:2.

యెహోవా రోజును తప్పించుకోని వాళ్లను అపొస్తలుడైన పౌలు నిద్రపోయేవాళ్లతో పోల్చాడు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గానీ, కాలం గడుస్తుందన్న సంగతి గానీ వాళ్లకు తెలీదు. అందుకే, ఏవైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వాళ్లకు తెలీదు లేదా వాళ్లు వాటికి స్పందించలేరు. ఈరోజుల్లో చాలామంది దేవునికి సంబంధించిన విషయాల్లో నిద్రపోతున్నారు. (రోమా. 11:8) మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామనే, మహాశ్రమ చాలా త్వరలో వస్తుందనే రుజువుల్ని వాళ్లు నమ్మట్లేదు. (2 పేతు. 3:3, 4) అయితే మనం మాత్రం ఒక్కోరోజు గడిచేకొద్దీ, యెహోవా తీర్పు రోజు దూరం తగ్గుతుందని నమ్ముతూ మెలకువగా ఉండడం చాలాచాలా ముఖ్యం. (1 థెస్స. 5:6) కాబట్టి మనం ప్రశాంతంగా, నిలకడగా ఉండాలి. ఎందుకు? ఈ లోక రాజకీయాల్లో లేదా సమాజంలో జరుగుతున్న విషయాల్లో తలదూర్చకుండా ఉండడానికి అలా ఉండాలి. కానీ, యెహోవా రోజు దగ్గరపడేకొద్దీ ఎవరో ఒకరి పక్షాన ఉండమనే ఒత్తిడి ఎక్కువ అవ్వొచ్చు. అయితే, అప్పుడు మనం ఎలా స్పందిస్తాం అన్న దానిగురించి ఇప్పుడే కంగారుపడాల్సిన అవసరంలేదు. యెహోవా పవిత్రశక్తి సహాయంతో మనం ప్రశాంతంగా, నిలకడగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.—లూకా 12:11, 12. w23.06 10 ¶6-7

బుధవారం, జూలై 9

“సర్వోన్నత ప్రభువా, యెహోవా, దయచేసి నన్ను గుర్తుచేసుకో . . . నన్ను శక్తిమంతుణ్ణి చేయి.”—న్యాయా. 16:28.

సమ్సోను అనే పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? అతనికి ఉన్న కండ బలం మీకు గుర్తుకురావచ్చు. నిజమే అతనికి చాలా బలం ఉండేది. కానీ సమ్సోను తీసుకున్న ఒక్క చెడు నిర్ణయం చెప్పలేనన్ని కష్టాల్ని తెచ్చిపెట్టింది. అయినా యెహోవా అతని తప్పుల్ని చూడలేదు గానీ అతని విశ్వాసాన్నే చూశాడు. అందుకే, మనకోసం అతని గురించి బైబిల్లో రాయించాడు. సమ్సోను ఎన్నో గొప్పగొప్ప పనులు చేసి, తన ప్రజలైన ఇశ్రాయేలుకు సహాయం చేసేలా యెహోవా అతన్ని ఉపయోగించుకున్నాడు. సమ్సోను చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత కూడా, అచంచల విశ్వాసం చూపించినవాళ్ల చిట్టాలో అపొస్తలుడైన పౌలు అతని పేరును చేర్చేలా యెహోవా చేశాడు. (హెబ్రీ. 11:32-34) సమ్సోను గురించి చదివినప్పుడు మనకు అతనిలా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే, అతను ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవా వైపు చూశాడు. మనం సమ్సోను నుండి ఎంతో నేర్చుకోవచ్చు, అతనిలా ఎలా ఉండవచ్చో ఆలోచించవచ్చు. w23.09 2 ¶1-2

గురువారం, జూలై 10

“మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.”—ఫిలి. 4:6.

మనం తరచూ మనసులో ఉన్నదంతా యెహోవాకు ప్రార్థనలో చెప్పినప్పుడు సహనాన్ని పెంచుకోగలుగుతాం. (1 థెస్స. 5:17) ఇప్పుడైతే మీకు తుఫానులాంటి కష్టాలు ఉండకపోవచ్చు. కానీ మీరు డీలా పడినప్పుడు, ఏదైనా విషయం మిమ్మల్ని తికమక పెట్టినప్పుడు లేదా ఏం చేయాలో దిక్కుతోచనప్పుడు సహాయం కోసం యెహోవావైపు చూస్తారా? ఇప్పుడు రోజువారీ చిన్నచిన్న కష్టాల్లో సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తే, భవిష్యత్తులో పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని అడగడానికి వెనకాడరు. అంతేకాదు మీకు సరిగ్గా ఎప్పుడు, ఎలా సహాయం చేయాలో యెహోవాకు ఖచ్చితంగా తెలుసనే ధీమాతో ఉంటారు. (కీర్త. 27:1, 3) ఇప్పుడు మనం కష్టాల్ని సహిస్తే మహాశ్రమను కూడా సహించవచ్చు. (రోమా. 5:3) అలాగని ఎందుకు చెప్పవచ్చు? కష్టాల్ని సహించిన ప్రతీసారి, తర్వాత వచ్చే కష్టానికి ధీటుగా నిలబడడానికి అది సహాయం చేసిందని చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌ చెప్తున్నారు. సహనం వాళ్లను మెరుగులుదిద్దింది. వాళ్లకు సహాయం చేయడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనే విశ్వాసాన్ని బలపర్చింది. ఆ విశ్వాసమే, తర్వాత వచ్చే కష్టాన్ని సహించడానికి సహాయం చేసింది.—యాకో. 1:2-4. w23.07 3 ¶7-8

శుక్రవారం, జూలై 11

“నేను నీ విన్నపాన్ని అంగీకరిస్తాను.”—ఆది. 19:21.

యెహోవాకున్న వినయం, కనికరం వల్ల సహేతుకత చూపించాడు. ఉదాహరణకు, సొదొమలోని చెడ్డ ప్రజల్ని నాశనం చేయబోతున్నప్పుడు ఆయన వినయం కనిపించింది. లోతును పర్వత ప్రాంతానికి పారిపొమ్మని యెహోవా దేవదూతల ద్వారా చెప్పాడు. కానీ లోతు అక్కడికి వెళ్లడానికి భయపడి ఆయన, ఆయన కుటుంబం సోయరులో తలదాచుకుంటామని అడిగారు. నిజానికి, యెహోవా నాశనం చేయాలనుకున్న పట్టణాల్లో సోయరు కూడా ఉంది. మారు మాట్లాడకుండా నేను చెప్పింది చేయి అని యెహోవా పట్టుబట్టవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా లోతు అడిగిన దానికి ఒప్పుకుని, సోయరు పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేశాడు. (ఆది. 19:18-22) వందల సంవత్సరాల తర్వాత యెహోవా నీనెవె పట్టణంలో ఉన్న ప్రజలపట్ల కనికరాన్ని చూపించాడు. అక్కడున్న చెడ్డ ప్రజలందర్నీ నాశనం చేస్తానని యెహోవా యోనా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. కానీ నీనెవె పట్టణంలో ఉన్నవాళ్లు పశ్చాత్తాపం చూపించినప్పుడు, యెహోవా వాళ్ల మీద కనికరపడి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేశాడు.—యోనా 3:1, 10; 4:10, 11. w23.07 21 ¶5

శనివారం, జూలై 12

‘వాళ్లు యెహోయాషును చంపారు. కానీ అతన్ని రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు.’—2 దిన. 24:25.

యెహోయాషు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యెహోయాషు ఒక కర్ర సహాయంతో మాత్రమే నిలబడివున్న బలహీనమైన చెట్టులా ఉన్నాడు. యెహోయాదా అనే ఆ కర్ర పోయిన తర్వాత, మతభ్రష్టత్వం అనే గాలులు వచ్చినప్పుడు ఆయన నేలకు ఒరిగాడు. దేవుని మీద భయం, కేవలం తోటి క్రైస్తవుల లేదా కుటుంబ సభ్యుల మంచి ఆదర్శం మీద మాత్రమే ఆధారపడి ఉండకూడదని చెప్పడానికి ఇదెంత శక్తివంతమైన ఉదాహరణో కదా! మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే, మనంతట మనమే దేవుని మీద భయభక్తుల్ని పెంచుకోవాలి. దానికోసం, క్రమంగా అధ్యయనం చేయాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. (యిర్మీ. 17:7, 8; కొలొ. 2:6, 7) యెహోవా మన నుండి మరీ ఎక్కువ ఆశించట్లేదు. ఆయన మన నుండి ఏం కోరుతున్నాడో ప్రసంగి 12:13 లో ఇలా ఉంది: “సత్యదేవునికి భయపడి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి; మనుషులు చేయాల్సిందల్లా ఇదే.” మనం దేవునికి భయపడితే, భవిష్యత్తులో వచ్చే ఏ పరీక్షనైనా ఎదుర్కోగలుగుతాం. అలాగే యెహోవాకు నమ్మకంగా ఉండగలుగుతాం. యెహోవాతో ఉన్న మన స్నేహబంధాన్ని ఏదీ తెంచేయలేదు. w23.06 19 ¶17-19

ఆదివారం, జూలై 13

“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.”—ప్రక. 21:5.

యెహోవా ఇచ్చిన గ్యారంటీ 5వ వచనంలో “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు” అనే మాటలతో మొదలౌతుంది. (ప్రక. 21:5ఎ) ప్రకటన గ్రంథంలో యెహోవా స్వయంగా మూడుసార్లు మాట్లాడాడు. అందులో ఇదొక సందర్భం. ఈ భరోసాను ఒక శక్తివంతమైన దేవదూత ద్వారా గానీ లేదా పునరుత్థానమైన యేసు ద్వారా గానీ ఇవ్వలేదు. యెహోవాయే స్వయంగా ఇచ్చాడు! ఈ విషయం, ఆ తర్వాతి వచనాల్లోని మాటల్ని మనం నమ్మడానికి సహాయం చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే యెహోవా “అబద్ధమాడలేని” దేవుడు. (తీతు 1:2) కాబట్టి ప్రకటన 21:5, 6 లో మనం చదివిన మాటలు ఖచ్చితంగా నిజమౌతాయి! “ఇదిగో!” అనే పదం గురించి పరిశీలించండి. “ఇదిగో!” అని అనువదించబడిన గ్రీకు పదం ప్రకటన పుస్తకంలో చాలాసార్లు ఉపయోగించారు. ఇంతకీ ఆ పదం తర్వాత ఏ మాటలున్నాయి? దేవుడు చెప్పిన ఈ మాటలు ఉన్నాయి: “నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” నిజమే, యెహోవా భవిష్యత్తులో చేయబోయే మార్పుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాటలు నిజమౌతాయని యెహోవా ఎంత నమ్మకంతో ఉన్నాడంటే, అవి ఇప్పటికే జరిగిపోయినట్టుగా ఆయన మాట్లాడాడు.—యెష. 46:10. w23.11 3-4 ¶7-8

సోమవారం, జూలై 14

“అతను బయటికి వెళ్లి, కుమిలికుమిలి ఏడ్చాడు.”—మత్త. 26:75.

పేతురు తన బలహీనతలతో పోరాడుతూనే ఉన్నాడు. కొన్ని ఉదాహరణల్ని గమనించండి. తను బాధలుపడి చనిపోవాలనే బైబిలు ప్రవచనాన్ని యేసు చెప్తున్నప్పుడు, అలా జరగకూడదని పేతురు అన్నాడు. (మార్కు 8:31-33) అంతేకాదు, పేతురు అలాగే మిగతా అపొస్తలులు చాలాసార్లు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. (మార్కు 9:33, 34) యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి, పేతురు ఆవేశంతో ఒకతని చెవి నరికేశాడు. (యోహా. 18:10) అదేరోజు రాత్రి పేతురు భయంతో మూడుసార్లు తన స్నేహితుడైన యేసు ఎవరో తెలీదని చెప్పాడు. (మార్కు 14:66-72) కానీ ఆ తర్వాత పేతురు వెక్కివెక్కి ఏడ్చాడు. తన మనసు విరిచేసినా, యేసు పేతురును వదిలేయలేదు. యేసు పునరుత్థానమైన తర్వాత, తన మీద ఇంకా ప్రేమ ఉందని చెప్పుకునే అవకాశాన్ని పేతురుకు ఇచ్చాడు. అంతేకాదు, తన మందను వినయంగా కాయమని యేసు అతనికి చెప్పాడు. (యోహా. 21:15-17) దానికి అతను వెంటనే ఒప్పుకున్నాడు. అందుకే, యెరూషలేములో పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి అభిషేకించిన వాళ్లలో పేతురు కూడా ఉన్నాడు. w23.09 22 ¶6-7

మంగళవారం, జూలై 15

“నా చిన్న గొర్రెల్ని కాయి.”—యోహా. 21:16.

“దేవుని మందను కాయండి” అని పేతురు తన తోటి పెద్దల్ని ప్రోత్సహిస్తున్నాడు. (1 పేతు. 5:1-4) ఒకవేళ మీరు సంఘపెద్ద అయితే, మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ అంటే మీకు శ్రద్ధ ఉందని, కాపరిగా ఉంటూ వాళ్ల బాగోగులు చూసుకోవడానికి ఇష్టపడుతున్నారని మాకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఆ పని చేసేంత టైం లేదని, లేదా దానికి రవ్వంత శక్తి కూడా లేదని మీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయవచ్చు? మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. పేతురు ఇలా రాశాడు: “ఎవరైనా పరిచారం చేస్తే, అతను దేవుడిచ్చే బలం మీద ఆధారపడుతున్నట్టు ఆ పని చేయాలి.” (1 పేతు. 4:11) అయితే, మీ సంఘంలో బ్రదర్స్‌, సిస్టర్స్‌కి వచ్చే సమస్యలు ఈ లోకంలో పూర్తిగా పరిష్కారం అవ్వకపోవచ్చు. కానీ “ముఖ్య కాపరి” అయిన యేసుక్రీస్తు, మీరు చేయగలిగే దానికి మించి వాళ్లకు సహాయం చేయగలడని గుర్తుంచుకోండి. అలా ఆయన కొత్త లోకంలోనే కాదు, ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. కాబట్టి సంఘపెద్దలు వాళ్ల బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ప్రేమించాలి, వాళ్లకు కాపరిగా ఉంటూ వాళ్ల బాగోగులు చూసుకోవాలి, “మందకు ఆదర్శంగా ఉండాలి.” దేవుడు వాళ్లనుండి ఆశించేది ఇది మాత్రమే! w23.09 29-30 ¶13-14

బుధవారం, జూలై 16

“జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని యెహోవాకు తెలుసు.”—1 కొరిం. 3:20.

మనం లోకపు తెలివి ప్రకారం ఆలోచించకూడదు. మనం విషయాల్ని మనుషుల వైపు నుండి ఆలోచిస్తే యెహోవాను, ఆయన ప్రమాణాల్ని పక్కన పెట్టేసే ప్రమాదం ఉంది. (1 కొరిం. 3:19) సాధారణంగా “ఈ లోకపు తెలివి” వల్ల మనం యెహోవా ప్రమాణాల్ని వదిలేసి, మనకు నచ్చినవే చేయడం మొదలుపెడతాం. పెర్గము, తుయతైరలోని కొంతమంది క్రైస్తవులు విగ్రహారాధన, అనైతికత విషయంలో చుట్టూవున్న ప్రజల ఆలోచనను వంటపట్టిచ్చుకున్నారు. వాళ్లు లైంగిక అనైతికతను చూసీచూడనట్టు వదిలేయడంతో, ఆ రెండు సంఘాల వాళ్లను యేసు గట్టిగా హెచ్చరించాడు. (ప్రక. 2:14, 20) ఈరోజుల్లో, మనచుట్టూ ఉన్నవాళ్లలా ఆలోచించాలనే ఒత్తిడి మనకు రావచ్చు. కుటుంబ సభ్యులు లేదా ఇరుగుపొరుగువాళ్లు మనం మరీ నిష్ఠగా ఉంటున్నామనీ, అప్పుడప్పుడు యెహోవా ప్రమాణాలు మీరడంలో తప్పేం లేదనీ అనొచ్చు. ఉదాహరణకు, బైబిల్లో ఉన్న ఉన్నత నైతిక ప్రమాణాలు పాతకాలం నాటివని, మన సొంత కోరికల్ని తీర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. కొన్నిసార్లు యెహోవా ఇచ్చే నిర్దేశం అంత స్పష్టంగా లేదని అనిపించవచ్చు. ఆఖరికి “లేఖనాల్లో రాసివున్న వాటిని” మీరాలని కూడా మనకు అనిపించవచ్చు.—1 కొరిం. 4:6. w23.07 16 ¶10-11

గురువారం, జూలై 17

“నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామె. 17:17.

యేసు తల్లియైన మరియకు ధైర్యం అవసరమైంది. ఆమెకు పెళ్లి కాలేదు; కానీ గర్భవతి కాబోతుంది. పైగా ఆమెకు పిల్లల్ని పెంచిన అనుభవమేమీ లేదు, కానీ మెస్సీయను పెంచాలి. అన్నిటికి మించి తను గర్భవతినని మరియ తనకు కాబోయే భర్తయైన యోసేపుకు చెప్పాలి. (లూకా 1:26-33) మరియ ఎలా ధైర్యం కూడగట్టుకోగలిగింది? ఆమె వేరేవాళ్ల సహాయం అడిగింది. ఉదాహరణకు, తన నియామకానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వమని ఆమె గబ్రియేలు దూతను అడిగింది. (లూకా 1:34) ఆ తర్వాత కొంతకాలానికే, ఆమె “పర్వత ప్రాంతంలో ఉన్న యూదయలోని” తన బంధువు ఎలీసబెతును కలవడానికి సుదూర ప్రయాణం చేసి వెళ్లింది. పవిత్రశక్తి ప్రేరణతో మరియను మెచ్చుకుంటూ ఆమెకు పుట్టబోయే కొడుకు గురించి ఎలీసబెతు ఒక ప్రవచనం చెప్పింది. (లూకా 1:39-45) ఆ తర్వాత, యెహోవా “తన బాహువుతో శక్తివంతమైన పనులు చేశాడు” అని మరియ అంది. (లూకా 1:46-51) యెహోవా గబ్రియేలు దూత ద్వారా, ఎలీసబెతు ద్వారా మరియకు కావల్సిన బలాన్నిచ్చాడు. w23.10 14-15 ¶10-12

శుక్రవారం, జూలై 18

‘ఆయన తన తండ్రైన దేవునికి మనల్ని రాజ్యంగా, యాజకులుగా చేశాడు.’—ప్రక. 1:6.

క్రీస్తు శిష్యుల్లో కొంతమంది, పవిత్రశక్తి ద్వారా అభిషేకించబడ్డారు. వాళ్లకు యెహోవాతో ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఈ 1,44,000 మంది యేసుతోపాటు పరలోకంలో యాజకులుగా సేవచేస్తారు. (ప్రక. 14:1) గుడారంలోని పవిత్ర స్థలం 1,44,000 మంది భూమ్మీద ఉన్నప్పుడే దేవుని కుమారులుగా దత్తత తీసుకోబడడాన్ని సూచిస్తుంది. (రోమా. 8:15-17) అతి పవిత్ర స్థలం, యెహోవా నివసించే పరలోకాన్ని సూచిస్తుంది. పవిత్ర స్థలానికి, అతి పవిత్ర స్థలానికి మధ్య ఉండే “తెర,” యేసు మానవ శరీరాన్ని సూచిస్తుంది. ఆ “తెర,” గొప్ప ప్రధానయాజకుడిగా పరలోకానికి వెళ్లి ఆధ్యాత్మిక ఆలయంలో సేవ చేయకుండా యేసుకు అడ్డుగా ఉండేది. మనుషుల కోసం యేసు తన మానవ శరీరాన్ని బలివ్వడం ద్వారా అభిషిక్త క్రైస్తవులందరూ పరలోకం వెళ్లడానికి మార్గం తెరిచాడు. అభిషిక్త క్రైస్తవులు కూడా పరలోక బహుమానాన్ని పొందాలంటే తమ మానవ శరీరంతో చనిపోవాలి.—హెబ్రీ. 10:19, 20; 1 కొరిం. 15:50. w23.10 28 ¶13

శనివారం, జూలై 19

“గిద్యోను . . . గురించి చెప్పుకుంటూపోతే సమయం చాలదు.”—హెబ్రీ. 11:32.

ఎఫ్రాయిమువాళ్లు గిద్యోనును తప్పుపట్టినప్పుడు, గిద్యోను వాళ్లమీద కోప్పడలేదు. (న్యాయా. 8:1-3) బదులుగా వాళ్లు చెప్తున్నప్పుడు విని, వాళ్లతో దయగా మాట్లాడడం ద్వారా గిద్యోను వినయం ఉందని చూపించాడు. అలా, కోపంతో రగిలిపోతున్న వాళ్లను శాంతపర్చాడు. అదేవిధంగా, వినయం ఉన్న సంఘపెద్దలు గిద్యోనును అనుకరిస్తూ ఎవరైనా తమను తప్పుపట్టినప్పుడు శ్రద్ధగా విని, దయగా మాట్లాడతారు. (యాకో. 3:13) ఫలితంగా, సంఘమంతా శాంతిగా ఉంటుంది. మిద్యానీయులపై గెలిచిన తర్వాత ప్రజలు గిద్యోనును పొగడ్తలతో ముంచెత్తారు. కానీ, ఆయన ఆ ఘనతంతా యెహోవాకు ఇచ్చాడు. (న్యాయా. 8:22, 23) సంఘపెద్దలు గిద్యోనును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? వాళ్లు సాధించిన వాటికి యెహోవాకు ఘనత ఇవ్వడం ద్వారా గిద్యోనును అనుకరించవచ్చు. (1 కొరిం. 4:6, 7) ఉదాహరణకు, ఒక సంఘపెద్ద మంచి ప్రసంగం ఇచ్చినప్పుడు ప్రజల దృష్టి దేవుని వాక్యం వైపు, సంస్థ ఇస్తున్న శిక్షణ వైపు మళ్లేలా చూసుకోవచ్చు. ఇతరుల దృష్టి అనవసరంగా తమ మీదికి మళ్లుతుందా అని సంఘపెద్దలు ఎప్పటికప్పుడు ఆలోచించుకోవడం మంచిది. w23.06 4 ¶7-8

ఆదివారం, జూలై 20

“నా ఆలోచనలు మీ ఆలోచనల లాంటివి కావు.”—యెష. 55:8.

మనం ప్రార్థనలో అడిగిన దానికి జవాబు రాకపోతే, ఈ ప్రశ్న వేసుకోవచ్చు, ‘నేను సరైన విషయం గురించే ప్రార్థిస్తున్నానా?’ సాధారణంగా, మనకేది మంచిదో మనకు తెలుసని మనకు అనిపించవచ్చు. కానీ మనం అడిగే విషయం ప్రస్తుతానికి బాగానే ఉండవచ్చు గానీ, రాబోయే రోజుల్లో అది మనకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. మనం ఏదైనా ఒక సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు మనం అడిగే దానికన్నా ఇంకా మెరుగైన పరిష్కారం ఉండివుండవచ్చు. అంతేకాదు, మనం అడిగేది యెహోవా ఇష్టానికి విరుద్ధంగా కూడా ఉండివుండవచ్చు. (1 యోహా. 5:14) ఉదాహరణకు, వాళ్లబ్బాయి సత్యంలో ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడిగిన తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. అది సరైన కోరికే అని మనకు అనిపించవచ్చు. కానీ, తనను ఆరాధించమని యెహోవా ఎవ్వర్నీ బలవంతపెట్టడు. మనమైనా సరే, మన పిల్లలైనా సరే యెహోవాను ఆరాధించాలని సొంతగా నిర్ణయించుకోవాలి. (ద్వితీ. 10:12, 13; 30:19, 20) కాబట్టి ఆ తల్లిదండ్రులు, వాళ్లబ్బాయి హృదయాన్ని చేరుకొని ఆ అబ్బాయే స్వయంగా యెహోవాను ప్రేమించి, ఆయనకు స్నేహితుడు అవ్వాలనే కోరికను పెంచుకునేలా సహాయం చేయాలని అడిగి ఉంటే ఇంకా బాగుండేది.—సామె. 22:6; ఎఫె. 6:4. w23.11 21 ¶5; 23 ¶12

సోమవారం, జూలై 21

“ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండండి.” —1 థెస్స. 4:18.

“ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండండి” అని పౌలు అన్నాడు. అయితే ఒకవ్యక్తిని ఓదారిస్తే, అతన్ని ప్రేమిస్తున్నట్టు ఎలా అవుతుంది? ఒక బైబిలు రెఫరెన్స్‌ చెప్తున్నట్టు, పౌలు ఇక్కడ “ఓదార్చడం” అని ఉపయోగించిన పదం “ఒకవ్యక్తిని కష్టాలు చుట్టుముట్టినప్పుడు అతని పక్కనే ఉండి భుజం తట్టడం” అనే అర్థాన్నిస్తుంది. కాబట్టి కష్టాల్లో కూరుకుపోయిన మన తోటి బ్రదర్‌ని లేదా సిస్టర్‌ని ఓదారిస్తే, వాళ్లను ఆ కష్టాల నుండి పైకెత్తి, జీవమార్గంలో అడుగులు వేయించిన వాళ్లమౌతాం. బ్రదర్స్‌సిస్టర్స్‌ కన్నీళ్లు తుడిచిన ప్రతీసారి వాళ్ల మీద మనకున్న ప్రేమ చూపించినట్టే! (2 కొరిం. 7:6, 7, 13) కనికరం, ఓదార్పు అనే లక్షణాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎలా? ఒక వ్యక్తి వేరేవాళ్లను ఓదార్చాలంటే ముందు అతనిలో కనికరం ఉండాలి. కాబట్టి మనలో కనికరం ఉంటేనే వేరేవాళ్లను ఓదారుస్తాం. యెహోవా కూడా అంతే. పౌలు యెహోవా గురించి ఇలా అంటున్నాడు: “ఆయన ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు.”—2 కొరిం. 1:3. w23.11 9-10 ¶8-10

మంగళవారం, జూలై 22

“శ్రమలు వచ్చినప్పుడు . . . ఆనందిద్దాం.”—రోమా. 5:3.

క్రీస్తు అనుచరులందరూ శ్రమలు వస్తాయని ఎదురుచూడవచ్చు. అపొస్తలుడైన పౌలు ఉదాహరణే తీసుకోండి. ఆయన థెస్సలొనీకయులకు ఇలా చెప్పాడు: “మేము మీ దగ్గర ఉన్నప్పుడు, మనకు శ్రమలు వస్తాయని ముందుగానే మీతో చెప్తూ వచ్చాం. ఇప్పుడు జరిగింది అదేనని మీకు తెలుసు.” (1 థెస్స. 3:4) అలాగే కొరింథీయులకు ఇలా రాశాడు: “సహోదరులారా, . . . మాకు ఎదురైన శ్రమ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం. మేము . . . ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాం.” (2 కొరిం. 1:8; 11:23-27) ఈ రోజుల్లో క్రైస్తవులందరికీ ఏదోక రకమైన శ్రమలు రావచ్చు. (2 తిమో. 3:12) క్రీస్తు మీద విశ్వాసం ఉంచి, ఆయన్ని అనుసరిస్తున్నందుకు మీ స్నేహితులు, బంధువులు మీతో క్రూరంగా ప్రవర్తించి ఉండొచ్చు, లేదా ఉద్యోగ స్థలంలో నిజాయితీగా ఉన్నందుకు ఇబ్బంది ఎదురై ఉండొచ్చు. (హెబ్రీ. 13:18) మీ నిరీక్షణ గురించి ఇతరులతో చెప్పినప్పుడు ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఎదురై ఉండొచ్చు. అయితే, మనకు ఎలాంటి శ్రమ ఎదురైనా సంతోషంగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. w23.12 10-11 ¶9-10

బుధవారం, జూలై 23

“మీరు నా మీదికి పెద్ద కష్టం తెచ్చిపెట్టారు.”—ఆది. 34:30.

యాకోబుకు చాలా కష్టాలు వచ్చాయి. యాకోబు ఇద్దరు కొడుకులు షిమ్యోను, లేవి తమ కుటుంబానికి తలవంపులు, యెహోవా పేరుకు మచ్చ తీసుకొచ్చారు. దానికితోడు యాకోబు ప్రాణంగా ప్రేమించిన రాహేలు తమ రెండో బిడ్డను కని ప్రాణం విడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి తీవ్రమైన కరువు కాటేయడంతో, యాకోబు తన ముసలితనంలో ఐగుప్తుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. (ఆది. 35:16-19; 37:28; 45:9-11, 28) యాకోబుకు అన్ని కష్టాలు వచ్చినా యెహోవా మీద, ఆయన ఇచ్చిన మాటమీద తన విశ్వాసం చెక్కుచెదరలేదు. అందుకే యెహోవా కూడా తన ఆమోదం యాకోబు మీద ఉందని చూపించాడు. ఎలాగంటే, యెహోవా ఆస్తి ఇచ్చి యాకోబును దీవించాడు. అంతేకాదు చనిపోయాడు, ఇక రాడు అనుకున్న యోసేపును మళ్లీ కలిసినప్పుడు యాకోబు యెహోవాకు ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పుంటాడో ఒకసారి ఆలోచించండి. యాకోబుకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉండింది కాబట్టి తనకు వచ్చిన కష్టాల్ని ఇష్టంగా సహించాడు. (ఆది. 30:43; 32:9, 10; 46:28-30) మనకు కూడా యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటే మన జీవితం ఊహించని మలుపులు తిరిగినా, వాటన్నిటిని సునాయాసంగా దాటేస్తాం. w23.04 15 ¶6-7

గురువారం, జూలై 24

“యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ ఉండదు.”—కీర్త. 23:1.

యెహోవా చూపించే ప్రేమాప్యాయతల మీద దావీదుకు ఎంత నమ్మకం ఉందో 23వ కీర్తనలో ఒక పాట రూపంలో రాశాడు. తనకు, తన కాపరియైన యెహోవాకు ఉన్న విడదీయలేని బంధాన్ని దావీదు వర్ణించాడు. యెహోవా నడిపించినట్టు నడవడం వల్ల దావీదుకు సురక్షితంగా అనిపించింది. ఆయన ప్రతీ పనిలో యెహోవా మీద ఆధారపడ్డాడు. యెహోవా తనను అనుక్షణం ప్రేమిస్తూనే ఉంటాడని దావీదుకు తెలుసు. అంత నమ్మకం దావీదుకు ఎలా వచ్చింది? యెహోవా తనకు కావల్సినవన్నీ ఎప్పటికీ ఇస్తూనే ఉన్నాడని దావీదుకు అనిపించింది కాబట్టే ఆ మాట అనగలిగాడు. అంతేకాదు యెహోవా తన స్నేహితుడని, తనను చూసి సంతోషిస్తాడని దావీదుకు తెలుసు. అందుకే భవిష్యత్తులో ఏం జరిగినా సరే, యెహోవా తనను చూసుకుంటాడని ఆయన గట్టిగా నమ్మాడు. యెహోవా చూపించే ప్రేమాప్యాయతలు దావీదుకున్న ఆందోళనకు మించినవి. అందుకే ఆయన సంతోషంగా, సంతృప్తిగా ఉండగలిగాడు.—కీర్త. 16:11. w24.01 29 ¶12-13

శుక్రవారం, జూలై 25

“ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”—మత్త. 28:20.

రెండో ప్రపంచ యుద్ధం నుండి యెహోవా ప్రజలు చాలా దేశాల్లో ప్రశాంతంగా, స్వేచ్ఛగా పరిచర్య చేసుకున్నారు. నిజానికి మన పని అంతకంతకు విస్తరించింది. ఈరోజుల్లో పరిపాలక సభ సభ్యులు నడిపింపు కోసం క్రీస్తు వైపు చూస్తున్నారు. పరలోకంలో విషయాల్ని ఎలా చూస్తారు అనే దాన్నిబట్టి వాళ్లు సహోదరులకు నిర్దేశాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ తర్వాత, ప్రాంతీయ పర్యవేక్షకుల్ని అలాగే పెద్దల్ని ఉపయోగించుకొని ఆ నిర్దేశాల్ని సంఘాలకు పంపిస్తున్నారు. అభిషేకించబడిన పెద్దలు క్రీస్తు “కుడిచేతిలో” ఉన్నారు. (ప్రక. 2:1) అయితే ఈ పెద్దలు అపరిపూర్ణులు, కాబట్టి కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. మోషే, యెహోషువ, అపొస్తలులు కూడా కొన్నిసార్లు తప్పులు చేశారు. (సంఖ్యా. 20:12; యెహో. 9:14, 15; రోమా. 3:23) అయినప్పటికీ, నమ్మకమైన దాసున్ని అలాగే నియమించబడిన ఈ పెద్దల్ని యేసుక్రీస్తు చాలా శ్రద్ధగా నడిపిస్తున్నాడు, ఇక ముందు కూడా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి, నాయకత్వం వహించడానికి నియమించబడిన ఈ సహోదరులు అందించే నిర్దేశంపై మనం పూర్తి భరోసా ఉంచవచ్చు. w24.02 23-24 ¶13-14

శనివారం, జూలై 26

“దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించండి.”—ఎఫె. 5:1.

యెహోవా గురించి ఇతరులకు చెప్పినప్పుడు ఆయన మీద మనకు ఎంత ప్రేమ, కృతజ్ఞత ఉన్నాయో చూపిస్తాం. దాన్నిబట్టి యెహోవా కూడా సంతోషిస్తాడు. మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు ప్రజలు యెహోవాకు దగ్గరవ్వాలి, మనలాగే వాళ్లు కూడా యెహోవాను ఒక ప్రేమగల తండ్రిలా చూడాలి అన్నదే మన ముఖ్య ఉద్దేశం! (యాకో. 4:8) బైబిల్లో యెహోవా గురించి, ఆయనకున్న ప్రేమ, న్యాయం, తెలివి, శక్తి, అలాగే ఎన్నో ఇతర అద్భుతమైన లక్షణాల గురించి ఉంది. వాటి గురించి ప్రజలకు చెప్పడం మనకు చాలా ఇష్టం. అంతేకాదు, యెహోవాను అనుకరించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని సంతోషపెడతాం. అలా చేసినప్పుడు, మనం గుంపులో కొట్టుకుపోకుండా ఈ చెడ్డ లోకానికి వేరుగా ఉన్నామని ప్రజలు గమనిస్తారు. మనం ఎందుకు అలా ఉన్నామని వాళ్లు ఆశ్చర్యపోవచ్చు కూడా. (మత్త. 5:14-16) మనం రోజూ ఇరుగుపొరుగు వాళ్లను కలిసినప్పుడు, అలా ఎందుకు వేరుగా ఉన్నామో వాళ్లకు వివరించవచ్చు. ఫలితంగా, మంచి మనసు ఉన్నవాళ్లు దేవునికి దగ్గరౌతారు. ఇవన్నీ చేసి, మనం యెహోవాను స్తుతించినప్పుడు ఆయన హృదయాన్ని సంతోషపెడతాం.—1 తిమో. 2:3, 4. w24.02 10 ¶7

ఆదివారం, జూలై 27

‘అతను ప్రోత్సహించగలగాలి, గద్దించగలగాలి.’—తీతు 1:9.

పరిణతిగల క్రైస్తవునిగా అవ్వడానికి, మీకు ఉపయోగపడే నైపుణ్యాల్ని పెంచుకోండి. అలా చేస్తే సంఘంలో బాధ్యతల్ని చేపట్టగలుగుతారు. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని, మిమ్మల్ని మీరు పోషించుకోగలుగుతారు. అలాగే మీ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. అంతేకాదు, ఇతరులతో మంచి స్నేహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, చదవడం-రాయడం బాగా నేర్చుకోండి. సంతోషంగా ఉండే వ్యక్తి, తన పనులన్నిటిలో సఫలమయ్యే వ్యక్తి ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానిస్తాడని బైబిలు చెప్తుంది. (కీర్త. 1:1-3) అతను రోజూ బైబిలు చదవడం వల్ల యెహోవా ఆలోచనలు తెలుసుకుంటాడు. చదివిన లేఖనాల్ని ఎలా పాటించాలో స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. (సామె. 1:3, 4) బైబిలు ఉపయోగిస్తూ బోధించే, సలహాలిచ్చే సామర్థ్యం ఉన్న సహోదరులు మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఎంతో అవసరం. మీకు చదవడం, రాయడం బాగా వస్తే మీ ప్రసంగాల్లో, కామెంట్స్‌లో ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని, బలపర్చే విషయాల్ని చెప్పగలుగుతారు. అంతేకాదు, మీ విశ్వాసాన్ని బలపర్చే, ఇతరుల్ని ప్రోత్సహించే మంచి నోట్స్‌ రాసుకోగలుగుతారు. w23.12 26-27 ¶9-11

సోమవారం, జూలై 28

“మీతో ఐక్యంగా ఉన్న దేవుడు, లోకంతో ఐక్యంగా ఉన్న అపవాది కన్నా బలవంతుడు.”—1 యోహా. 4:4.

మీకు భయమేసినప్పుడు, భవిష్యత్తులో సాతాను నామరూపాల్లేకుండా పోయినప్పుడు యెహోవా ఏం చేస్తాడో ఆలోచించండి. 2014 ప్రాదేశిక సమావేశంలో ఒక చక్కని డెమో వచ్చింది. అందులో ఒక తండ్రి, 2 తిమోతి 3:1-5 వచనాలు కొత్తలోకం గురించి చెప్తే ఎలా ఉంటుందో తన కుటుంబానికి చదివి వినిపించాడు. ఆయన ఇలా చదివాడు: “కొత్తలోకంలో సంతోషకరమైన కాలాలు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: ఇతరుల్ని ప్రేమించేవాళ్లు, సత్యాన్ని ప్రేమించేవాళ్లు, అణకువ గలవాళ్లు, వినయం గలవాళ్లు, దేవుణ్ణి మహిమపర్చేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడేవాళ్లు, కృతజ్ఞత చూపించేవాళ్లు, విశ్వసనీయులు, మమకారం ఉన్నవాళ్లు, ఇతరులతో సమ్మతించేవాళ్లు, ఇతరుల గురించి ఎప్పుడూ మంచే మాట్లాడేవాళ్లు, ఆత్మనిగ్రహం చూపించేవాళ్లు, సౌమ్యులు, మంచిని ప్రేమించేవాళ్లు, నమ్మకస్థులు, లోబడడానికి సిద్ధంగా ఉండేవాళ్లు, తమనుతాము తగ్గించుకునేవాళ్లు, సుఖాల్ని కాకుండా దేవుణ్ణి ప్రేమించేవాళ్లు, నిజమైన భక్తి చూపించేవాళ్లు. అలాంటివాళ్లను నువ్వు అంటిపెట్టుకొని ఉండు.” మీరు కొత్తలోకంలో జీవితం గురించి మీ కుటుంబంతో లేదా బ్రదర్స్‌సిస్టర్స్‌తో మాట్లాడుతుంటారా? w24.01 6 ¶13-14

మంగళవారం, జూలై 29

“నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”—లూకా 3:22.

యెహోవా మనల్ని ఒక గుంపుగా చూసి సంతోషిస్తాడని తెలుసుకోవడం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా! బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు.” (కీర్త. 149:4) అయితే, కొన్నిసార్లు కొంతమంది ఎంత డీలా పడిపోతారంటే ‘యెహోవా నన్ను చూసి అసలు సంతోషిస్తున్నాడా?’ అని అనుకుంటారు. బైబిల్లో కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకులు కూడా అలాంటి ఆలోచనలతో సతమతమయ్యారు. (1 సమూ. 1:6-10; యోబు 29:2, 4; కీర్త. 51:11) అపరిపూర్ణ మనుషులు కూడా యెహోవాను సంతోషపెట్టగలరని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. ఎలా? మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం తీసుకోవాలి. (యోహా. 3:16) అలా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపాల విషయంలో పశ్చాత్తాపం చూపించామని, యెహోవా ఇష్టం చేస్తామనే మాటిచ్చామని అందరికీ చూపిస్తాం. (అపొ. 2:38; 3:19) మనం తనతో స్నేహం ఏర్పరచుకోవడానికి ఈ పనులన్నీ చేయడం చూసి యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు. మనం సమర్పించుకున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేసినంత కాలం, యెహోవా మనల్ని చూసి సంతోషిస్తూనే ఉంటాడు, తన స్నేహితుల చిట్టాలోకి చేర్చుకుంటాడు.—కీర్త. 25:14. w24.03 26 ¶1-2

బుధవారం, జూలై 30

“చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.”—అపొ. 4:20.

ఒకవేళ అధికారులు మనల్ని ప్రీచింగ్‌ చేయొద్దని చెప్పినా, శిష్యుల్లాగే మనం ఆ పనిని ఆపం. మనం ప్రీచింగ్‌ చేయడానికి కావల్సిన సహాయం యెహోవా తప్పకుండా చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. కాబట్టి ధైర్యం, తెలివి, కష్టాల్ని గట్టెక్కడానికి సహాయం అడుగుతూ యెహోవాకు ప్రార్థించండి. మనలో చాలామందిమి శారీరక లేదా మానసిక సమస్యలతో పోరాడుతున్నాం. మనం బాగా ప్రేమించేవాళ్లు చనిపోయి ఉండవచ్చు. కుటుంబంలో ఒక కష్టమైన పరిస్థితి ఉండవచ్చు. వ్యతిరేకత లేదా ఇంకేదైనా సమస్యతో మనం ఎదురీదుతూ ఉండవచ్చు. అంతేకాదు, ఉన్న సమస్యలు చాలదన్నట్టు మహమ్మారులు, యుద్ధాలు మనల్ని ఇంకా కష్టాల ఊబిలోకి నెట్టేశాయి. కాబట్టి మీ మనసులో ఉన్నవన్నీ యెహోవాకు చెప్పండి. ఒక ప్రాణ స్నేహితునికి మీ సమస్యను చెప్పుకున్నట్టే యెహోవాకు చెప్పుకోండి. యెహోవా మీ “తరఫున చర్య తీసుకుంటాడు” అనే భరోసాతో ఉండండి. (కీర్త. 37:3, 5) పట్టుదలగా ప్రార్థన చేయడంవల్ల మనం కష్టాల్ని తట్టుకోగలుగుతాం. (రోమా. 12:12) తన సేవకులు పడే ప్రతీ కష్టాన్ని యెహోవా చూస్తున్నాడు, “వాళ్లు పెట్టే మొరలు” ఆయన వింటున్నాడు.—కీర్త. 145:18, 19. w23.05 5-6 ¶12-15

గురువారం, జూలై 31

“ప్రభువుకు ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండండి.”—ఎఫె. 5:10.

మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు “యెహోవా ఇష్టం ఏమిటో” అర్థంచేసుకోవాలి, ఆ తర్వాత దాని ప్రకారం పనిచేయాలి. (ఎఫె. 5:17) మన పరిస్థితికి సరిగ్గా సరిపోయే బైబిలు సూత్రాల్ని తెలుసుకుంటున్నామంటే, నిజానికి యెహోవా ఆలోచనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే. ఆ తర్వాత, ఆ సూత్రాల్ని పాటించినప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన శత్రువైన సాతాను చాలా ‘దుష్టుడు.’ యెహోవా సేవ చేయడానికి సమయం ఉండనంతగా ఈ లోకంలో మునిగిపోవాలని అతను కోరుకుంటున్నాడు. (1 యోహా. 5:19) అందుకే ఒక క్రైస్తవుడు యెహోవా సేవ కన్నా చదువులకు, ఉద్యోగాలకు, డబ్బు సంపాదనకే మొదటిస్థానం ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే, ఈ లోక ఆలోచనలు మనలో ఇంకినట్టే. నిజమే, అవన్నీ చేయడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ మన జీవితంలో అవే అన్నిటికంటే ముఖ్యమైనవి కాకూడదు! w24.03 24 ¶16-17

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి