మా పాఠకుల నుండి
మరణాన్ని సమీపించడం “నేను మరణాన్ని సమీపించడంవల్ల వైద్యులు నేర్చుకున్నారు” (జనవరి 8, 1996) అనే శీర్షిక గురించి నేను వ్రాస్తున్నాను. కొంచెం మోతాదు అల్బుమిన్‌తో మిశ్రమం చేయబడిన ఎరిత్రోపాయటిన్ ఒక రక్త మాంసకృత్తు కాదా?
ఆర్. పి., అమెరికా
కొన్ని సందర్భాల్లో అవును, తక్కువ మోతాదుల్లో అల్బుమిన్ ఉన్న మందులను తీసుకోవాలో వద్దో ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. సవివర చర్చ కొరకు దయచేసి “కావలికోట” యొక్క అక్టోబరు 1, 1994 మరియు జూన్ 1, 1990 (ఆంగ్లం) సంచికలలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.—ఎడిటర్.
పఠననిరాసక్తత “పఠననిరాసక్తతకు వ్యతిరేకంగా జాగ్రత్తపడండి” (ఫిబ్రవరి 8, 1996) అనే శీర్షికను నేను చదివాను, మీరు అందజేసే విజ్ఞానదాయకమైన సమాచారం కొరకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాసేందుకు నేను పురికొల్పబడేంతగా నేను దాన్ని ఆనందించాను. విశ్వ సృష్టికర్త గురించి ఆయన అమూల్యమైన వాక్యమగు బైబిలు ద్వారా తెలుసుకోవడానికి చదవడం మనకు అవకాశాన్ని ఇస్తుంది. అందుకే ఆత్మీయ బలహీనతకు పఠననిరాసక్తతకు మధ్య ఒక సంబంధం ఉంది.
ఆర్. ఆర్., అమెరికా
నేను 28 సంవత్సరాలుగా బాప్తిస్మం పొందిన క్రైస్తవునిగా, సంస్థ ప్రచురణల క్రమ పాఠకునిగా ఉన్నప్పటికీ, నేను చదవడాన్ని వాయిదా వేసేవాడిని, నేను చదవాలనే కోరికను కోల్పోతున్నట్లు భావించాను. మీ శీర్షిక నా సమస్యను గుర్తించింది! ఈ విషయంపై మీ తర్కం, నాకు నేను ప్రయోజనం చేకూర్చుకొనేలా చదవడానికి నన్ను పురికొల్పింది.
ఎ. ఓ., కెనడా
నిరుద్యోగం “నిరుద్యోగం—ఒక పరిష్కారం ఉంది” (ఏప్రిల్ 8, 1996) అనే పరంపర కొరకు ఎంతో కృతజ్ఞతలు. నేను ఉద్యోగం కొరకు వెదుకుతూ, దాన్ని కనుగొనలేకుండా ఉన్న సమయంలో ఈ సమాచారం లభించింది. మీరు పదకొండవ పేజీలో చెప్పినట్లుగా నేను ఇంటివద్ద పని కల్పించుకోవడానికి ప్రయత్నించాను, అది విజయవంతమయ్యింది. మీ గురించి యెహోవాకు కృతజ్ఞతలు!
జె. ఎమ్., ఫ్రెంచ్ గుయానా
ఇటీవల నేనున్న పరిస్థితినే శీర్షికలు వివరించాయి. ఒక శీర్షిక చెప్పినట్లుగా నేను కొన్ని నెలలపాటు “అన్ని రకాలైన పనులను” చేయవలసి వచ్చింది. కాని నేను నిరుత్సాహపడలేదు. నేను అనుకూల దృక్పథం కలిగివుండడానికి ప్రయత్నించాను, చివరగా నేను ఒక స్థిరమైన ఉద్యోగాన్ని కనుగొన్నాను. ఆ సమయంలో, నాకు నా భార్య తోడ్పాటు లభించింది, ఆమె కొనుగోలు చేయడంలో చాలా పొదుపుగా ఉండేది. కష్టతరమైన పరిస్థితుల్లో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడానికి మనకు సహాయం చేసే సమాచారం కొరకు మరలా కృతజ్ఞతలు.
యు. కె., ఇటలీ
ప్రాముఖ్యంగా నాకు “గృహంలోనే పనిని కల్పించుకోవడం” అనే మీ బాక్సు నచ్చింది. నేను ఒక క్రమ పయినీరును పూర్తికాల సువార్తికురాలిని, రెండు సంవత్సరాలుగా నేను లైసెన్సు పొందిన శిశు విహారాన్ని నడిపిస్తున్నాను. నేను పాఠశాలకు ముందు ఆతర్వాత పిల్లలను చూసుకునేదాన్ని, మంచి రాబడి ఉండేది. మధ్యాహ్న సమయంలో ప్రకటించడానికి వెళ్లేందుకు అది నాకు అవకాశమిచ్చేది, నేను ప్రతిరోజు కేవలం నాలుగు గంటలు పనిచేసేదాన్ని. నాణ్యమైన శ్రద్ధ దొరకడం కష్టం గనుక చాలామంది తలిదండ్రులు కృతజ్ఞత కలిగివుండేవారు. యెహోవా సేవ చేయడానికి తమకు సహాయం చేసే ఉద్యోగాన్ని ఇతరులు కూడా కనుగొనగలరని నేను నిరీక్షిస్తున్నాను.
టి. కె. ఎల్., అమెరికా
నిరుద్యోగులు ప్రయివేటుగా గృహోపకరణములకు మెత్తలు చేయడం, మంగలిపని, కాపలాపని మొదలైనవి చేయవచ్చునని మీరు సలహా ఇచ్చారు. కొన్ని పరిస్థితుల్లో వారు తమ సేవలను ఉచితంగా లేక తక్కువ ధరకు ప్రకటన చేయించవచ్చునని కూడా మీరు చెప్పారు. జర్మనీలో ఇది చట్టవ్యతిరేకం కాదా?
ఆర్. టి., జర్మనీ
చట్టాల విషయంలో ఒక దేశానికి మరో దేశానికి తేడా ఉంటుంది, బహుశా కొన్ని దేశాల్లో ఈ సలహాలు చట్టవ్యతిరేకమైనవై ఉండవచ్చు. అందుకే, అలాంటి కార్యక్రమం చేపట్టే ముందు కోశసంబంధ మరియు టాక్సు సంబంధ చట్టాలను తెలుసుకుని, గౌరవించడం అవసరమని 9వ పేజీలో మేము తెలియజేశాము. తాము నివసిస్తున్న దేశ చట్టానికి విధేయత చూపవలసిన బాధ్యత క్రైస్తవులకుంది. (రోమీయులు 13:1)—ఎడిటర్.
నా ప్రియమైన స్నేహితురాలు సమ్మోహనాత్మక శీర్షికైన “నా ప్రియమైన స్నేహితురాలు” (మార్చి 8, 1996) అనే దాని కొరకు నా యథార్థమైన మెప్పును వ్యక్తం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. వయస్సులలో అంత తేడా ఉన్నప్పటికీ అలాంటి చక్కని స్నేహం ఉందని చదవడం ఆహ్లాదాన్ని కలిగించింది. యౌవనులు కేవలం తమ వయస్సు వారినే సన్నిహిత స్నేహితులుగా కలిగి ఉండనవసరం లేదని అది చూపిస్తుంది. అనుభవం, జ్ఞానం, హాస్యం రూపంలో ఎంతో ఇవ్వగలిగే వృద్ధులు అనేకమంది ఉన్నారు.
ఎస్. టి., ఇంగ్లాండు
పిన్నలు పెద్దలు చక్కగా కలిసి ఉండగలరని, పిన్నలు పెద్ద తరంవారి సుసంపన్నమైన అనుభవం నుండి ప్రయోజనం పొందవచ్చునని ఆ శీర్షిక నిరూపించింది. నేను స్వయంగా ఒక వృద్ధ స్నేహితునితో ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా అనేక గంటలు గడిపాను. స్నేహితుల ఒత్తిడి వంటి సమస్యలతో వ్యవహరించడానికి ఆయన నాకు ఎంతో సహాయం చేశాడు.
డబ్ల్యు. ఎస్., ఆస్ట్రియా
ఇప్పటి వరకు నేను పెద్దవారి నుండి నేర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఈ శీర్షిక మూలంగా, అలాంటివారి నుండి నేను ఏ విషయాలు నేర్చుకోవచ్చో నాకిప్పుడు అర్థమైంది. జ్ఞానవంతులైన పెద్దవారికి సన్నిహిత స్నేహితురాలినవ్వాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను.
ఆర్. కె., జపాన్