గట్టి పునాదిపై కట్టబడుటకు గొర్రెలవంటి ప్రజలకు సహాయం చేయుట
1 ఒక ఇంటిని నిర్మించాలంటే జాగ్రత్తతో కూడిన ప్రణాళిక, శ్రద్ధతోకూడిన ప్రయత్నం అవసరం. ఇల్లు నమూనా వేయబడిన తరువాత, కట్టడపు స్థలాన్ని సిద్ధంచేసి, గట్టి పునాది వేయాలి. అది చివరకు ముగిసే వరకు ఆ పని క్రమేపి రూపుదిద్దుకుంటుంది. అలాగే, గొర్రెలవంటి ప్రజలు కూడా క్రమేపి సత్యాన్ని నేర్చుకొనుటకు మనం సహాయపడాలి. మొదటి దర్శనంలోనే మనం ఆసక్తిని రేకెత్తించటానికి ప్రయత్నిస్తాము. తరువాత మనం పునర్దర్శనాలు చేస్తూ, దేవున్ని గూర్చి, మానవజాతి యెడల ఆయన కలిగివున్న సంకల్పాన్ని గూర్చిన ప్రాథమిక సత్యాలను బోధించడం ద్వారా పునాది వేస్తాము.—లూకా 6:48.
2 పునాది వేయబడక మునుపే, కట్టడపు స్థలాన్ని ఎలా సిద్ధం చేయాలో, అలాగే గృహస్థుని పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలి. అంతకు ముందు ఏ విషయం పరిశీలించబడింది? ఏ లేఖనాలు ఉపయోగింపబడ్డాయి? దానికి ప్రతిచర్య ఎలావుంది? ఏ ప్రచురణ ఇవ్వబడింది? మళ్లీ దర్శించేటప్పుడు, నిర్దిష్టమైన విషయాలు మనస్సులో వుంచుకుని, క్రమంగా పునాది వేయండి. ప్రతి దర్శనంతో గృహస్థుని జ్ఞానం, దేవుని యందు అతని విశ్వాసం పెరుగుతుంది.
3 “నిరంతరము జీవించగలరు” పుస్తకం అందించి ఉంటే, మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “మీరు ఇంటివద్దే ఉన్నందుకు నేనానందిస్తున్నాను. మన ప్రాంతంలో దేవుని యందు ఆసక్తి సన్నగిల్లుతున్న విషయాన్ని క్రితంసారి చర్చించినప్పుడు మనం పరిశీలించినట్లు మీకు గుర్తుండే ఉంటుంది. మానవజాతి యెడల దేవుడు ఆసక్తి కలిగివున్నాడని, ఆయన రాజ్యం ద్వారా నీతిమంతులు ఆశీర్వదింపబడతారని బైబిలు విశదంగా తెలియజేస్తున్నది. [మత్తయి 6:9, 10 ని చదవండి.] ఈ రాజ్యం ద్వారా నీతి, న్యాయం వర్థిల్లుతుంది.” యెషయా 11:3-5 చదివి, నిరంతరము జీవించగలరు పుస్తకంలోని మొదటి అధ్యాయంలోని మొదటి రెండు పేరాలవైపుకు గృహస్థుని దృష్టిని మళ్లించండి. ఆ అంశాన్ని ఎలా పఠించవచ్చో ప్రదర్శించండి.
4 మొదటి దర్శనంలో పీస్పుల్ న్యూ వరల్డ్ కరపత్రాన్ని అందజేసి ఉంటే, మంచి పరిస్థితుల అవసరతను గూర్చి, బైబిలు వాగ్దానాలను గూర్చి, ముందు పరిశీలించిన ముఖ్య విషయాలను పునఃపరిశీలించవచ్చు. నూతన లోకంలో జీవించాలంటే మనం కచ్చితమైన జ్ఞానాన్ని పొందాలన్న విషయాన్ని నొక్కిచెప్పండి. యోహాను 17:3 చదవండి. అలాంటి జ్ఞానాన్ని పొందిన తరువాత, మనం దేవుని చిత్తాన్ని చేయాలని వివరించండి. 1 యోహాను 2:17 చదవండి. కరపత్రంలోని 5వ పేజీలోని కొన్ని ప్రత్యేక విషయాలవైపు గృహస్థుని దృష్టిని మళ్లించండి.
5 మొదటి దర్శనంలో “నిరంతరము జీవించగలరు” పుస్తకాన్ని అందజేసేటప్పుడు కుటుంబ జీవితాన్ని గూర్చిన విషయాన్ని ప్రముఖంగా చెప్పివుంటే, మీరిలా అనవచ్చు:
◼ “నేను క్రితంసారి వచ్చినప్పుడు, మనం కుటుంబ జీవిత విషయాన్ని చర్చించాము. సంతోషభరిత కుటుంబ జీవితాన్ని కలిగివుండాలంటే, బైబిలు నందు ఇవ్వబడిన సూత్రాలను పాటించాలని మనం అంగీకరించాము. వివాహాన్ని విజయవంతం చేసుకొనుటకు ఏమి అవసరమని మీరు భావిస్తున్నారు?” జవాబు చెప్పనివ్వండి. నిరంతరము జీవించగలరు పుస్తకం నందలి 243-6 పేజీలలోని సమాచారాన్నుండి ప్రత్యేకమైన విషయాలను ఉన్నత పర్చండి. ఉపమానాలపై గృహస్థుని అభిప్రాయాన్ని చెప్పమనండి, వీలునుబట్టి ఎంపిక చేసుకొన్న విషయాలను పరిశీలించండి. బైబిలు సూత్రాల ఆచరణాత్మక విలువను నొక్కిచెప్పండి.
6 ఎంజాయ్ ఫామిలీ లైఫ్ కరపత్రాన్ని అందించివుంటే, 4, 5 పేజీలలో తెలియజేయబడిన ముఖ్యమైన బైబిలు సూత్రాలను పునఃపరిశీలించండి. ఆసక్తి రేకెత్తితే, నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందజేయండి. “కుటుంబ జీవితమును విజయవంతము చేసికొనుట” అనే 29వ అధ్యాయాన్ని చూపించి, గృహస్థునితో, అతని కుటుంబముతో దీన్ని ఎలా పరిశీలించవచ్చో చూపించండి.
7 పునర్దర్శనాలు చేయడంలో మనందరము క్రమంగా పాల్గొనాలి. సెప్టెంబరు నెలలో సమర్ధవంతంగా పునర్దర్శనాలు చేయండి.