6 ఇశ్రాయేలు రాజైన యెహోవా,+
అతని విమోచకుడూ,+ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:
‘నేనే మొదటివాణ్ణి, నేనే చివరివాణ్ణి.+
నేను తప్ప వేరే దేవుడు లేడు.+
7 నాలాంటి వాళ్లు ఎవరున్నారు?+
ఉంటే, అతను బిగ్గరగా మాట్లాడాలి, దాన్ని నాకు నిరూపించాలి!+
పురాతన కాలంలోని ప్రజల్ని స్థాపించినప్పటి నుండి నేను చేసినట్టు,
జరగబోతున్న సంగతుల్ని,
అలాగే ఇంకా జరగనివాటిని వాళ్లు చెప్పాలి.