కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g21 No. 1 పేజీలు 6-7
  • అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలి?
  • తేజరిల్లు!—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్షమించడానికి సిద్ధంగా ఉండండి
  • వినయంగా ఉండండి, అందర్నీ గౌరవించండి
  • పక్షపాతం చూపించకండి
  • సౌమ్యంగా ఉండండి
  • ఇచ్చే మనసు అలవర్చుకోండి, కృతజ్ఞత చూపించండి
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇచ్చే గుణం చూపించండి
    తేజరిల్లు!—2025
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
తేజరిల్లు!—2021
g21 No. 1 పేజీలు 6-7
ఒక జంట ఇంటికొచ్చిన అతిథులకు భోజనం పెడుతోంది.

అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలి?

సృష్టికర్త ఇచ్చిన తెలివైన సలహాల్ని పాటిస్తే మనం కుటుంబ సభ్యులతో, తోటి ఉద్యోగులతో, స్నేహితులతో ఇలా అందరితో మంచి సంబంధాలు కలిగివుంటాం. వాటిని పాటించి ఇప్పటికే చాలామంది ప్రయోజనం పొందారు. అలాంటి కొన్ని సలహాలు ఏంటో చూద్దామా.

క్షమించడానికి సిద్ధంగా ఉండండి

“మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి.”—కొలొస్సయులు 3:13.

పొరపాట్లు అందరం చేస్తాం. కొన్నిసార్లు మనం అవతలివాళ్లను బాధపెడతాం, ఇంకొన్నిసార్లు వాళ్లు మనల్ని బాధపెడతారు. ఏదేమైనా, అందరం ఒకరినొకరం క్షమించుకోవాలి. మనల్ని బాధపెట్టినవాళ్లను క్షమించినప్పుడే, వాళ్ల మీదున్న కోపాన్ని కూడా వదిలేయాలి. అంతేకాదు, ‘తిరిగి వాళ్లకు చెడు చేయడానికి,’ వాళ్ల పొరపాట్లను, లోపాలను పదేపదే వేలెత్తి చూపించడానికి ప్రయత్నించకూడదు. (రోమీయులు 12:17) ఒకవేళ మన మనసు బాగా గాయపడి, జరిగినదాన్ని మర్చిపోలేకపోతే అప్పుడేం చేయాలి? ఆ వ్యక్తిని ఒంటరిగా కలిసి మనల్ని బాధపెడుతున్న విషయం గురించి గౌరవంగా మాట్లాడాలి. అలా మాట్లాడేటప్పుడు వాళ్లతో మనకున్న సంబంధాన్ని తిరిగి బాగుచేసుకోవడానికి ప్రయత్నించాలే గానీ, తప్పు ఎవరివైపు ఉందో నిరూపించడానికి ప్రయత్నించకూడదు.—రోమీయులు 12:18.

వినయంగా ఉండండి, అందర్నీ గౌరవించండి

“వినయంతో ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి.”—ఫిలిప్పీయులు 2:3.

వినయంగా ఉండేవాళ్లతో, ఇతరుల్ని గౌరవించేవాళ్లతో, అందరితో మంచిగా ఉండేవాళ్లతోనే మనం స్నేహం చేయాలనుకుంటాం. ఎందుకంటే అలాంటివాళ్లు కావాలని ఎవ్వర్నీ బాధపెట్టరు. కానీ ఎవరైతే మేమే గొప్ప అనుకుంటారో, వాళ్ల మాటే నెగ్గాలని కోరుకుంటారో అలాంటివాళ్లతో ఎవ్వరూ స్నేహం చేయరు. ఒకవేళ స్నేహితులు ఉన్నా ఎక్కువమంది ఉండరు.

పక్షపాతం చూపించకండి

“దేవునికి పక్షపాతం లేదు . . . ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 10:34, 35.

దేవునికి ఏ దేశం వాళ్లయినా, ఏ భాష వాళ్లయినా, ఏ రంగు వాళ్లయినా, ఉన్నవాళ్లయినా, పేదవాళ్లయినా ఒక్కటే; ఆయన దృష్టిలో మనుషులందరూ సమానమే. “ఆయన ఒకే ఒక్క మనిషి నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడు.” (అపొస్తలుల కార్యాలు 17:26) కాబట్టి ఒకవిధంగా, మనుషులందరూ తోబుట్టువులు అవుతారు. మనం అందర్నీ గౌరవిస్తూ, వాళ్లతో మంచిగా ఉంటే వాళ్లూ సంతోషంగా ఉంటారు, మనం కూడా సంతోషంగా ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా, మనల్ని చేసిన సృష్టికర్త సంతోషిస్తాడు.

సౌమ్యంగా ఉండండి

‘సౌమ్యతను అలవర్చుకోండి.’—కొలొస్సయులు 3:12.

మనం సౌమ్యంగా ఉంటే ఎవ్వరైనా మనతో త్వరగా కలిసిపోతారు. మనకు ఏదైనా చెప్పాల్సి వచ్చినా, మనల్ని సరిద్దిదాల్సి వచ్చినా ఇబ్బంది పడకుండా మాట్లాడతారు; ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉంటామని వాళ్లకు తెలుసు. ఒకవేళ ఎవరైనా కోపంగా మాట్లాడినా, మనం సౌమ్యంగా జవాబిస్తే వాళ్ల కోపం తగ్గుతుంది. “సౌమ్యంగా ఇచ్చే జవాబు కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది” అని ఒక జ్ఞాని చెప్పాడు.—సామెతలు 15:1.

ఇచ్చే మనసు అలవర్చుకోండి, కృతజ్ఞత చూపించండి

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.

ఈ కాలం ప్రజల్లో స్వార్థం, అత్యాశ విపరీతంగా పెరిగిపోయాయి. వాళ్ల దగ్గరున్న వాటిని వేరేవాళ్లకు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు. కానీ తీసుకోవడంలో కన్నా, మన దగ్గరున్న వాటిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది. (లూకా 6:38) ఇచ్చే మనసున్నవాళ్లు ఆస్తిపాస్తుల కన్నా మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి, అలాంటివాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అంతేకాదు, ఇతరులు తమకు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్లను మెచ్చుకుంటారు, మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపిస్తారు. (కొలొస్సయులు 3:15) ఒకసారి ఆలోచించండి, మీకు ఎలాంటివాళ్లు నచ్చుతారు? ఇచ్చే మనసున్నవాళ్లా లేక పిసినారులా? కృతజ్ఞత చూపించేవాళ్లా లేక చూపించనివాళ్లా? కాబట్టి మీరు కూడా ఇచ్చే మనసును అలవర్చుకోండి, ఇతరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించండి.—మత్తయి 7:12.

వేరేవాళ్లను చిన్నచూపు చూడడం మానేశాను

“పవిత్ర గ్రంథంలో ఇలా ఉంది: ‘మీ గురించి మీరు ఎలా శ్రద్ధ తీసుకుంటారో, ఇతరుల గురించి కూడా అలాగే శ్రద్ధ తీసుకోండి; మీకు మీరే తెలివిగలవాళ్లని అనుకోకండి.’” (రోమీయులు 12:16) “గర్వం చూపించకుండా ఉండడానికి, ఇతరుల్ని చిన్నచూపు చూడడం మానేయడానికి ఈ సలహా నాకు సహాయం చేసింది. మా జాతే గొప్పది అనుకోవడం, వేరే మతస్థుల్ని తక్కువగా చూడడం మానేశాను. ఇప్పుడు నేను అందరితో మంచిగా మాట్లాడుతున్నాను.”—ఆశ.

ఆశ.

ఎక్కువ తెలుసుకోండి

అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలనే విషయం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, jw.org వెబ్‌సైట్‌లో బైబిలు బోధలు > శాంతి సంతోషం > ఇతరులతో సంబంధాలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి