బైబిలు ఏం చెప్తుంది?
చనిపోయాక మనకు ఏమౌతుంది?
కొంతమంది ఇలా అనుకుంటారు: మనం చనిపోయాక ఏదోక విధంగా జీవిస్తూ ఉంటామని అనుకుంటారు. ఇంకొంతమంది, చనిపోయాక ఏమీ ఉండదని అనుకుంటారు. మీరేం నమ్ముతారు?
బైబిలు జవాబు
“చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) మరో మాటలో చెప్పాలంటే, చనిపోయాక మనం ఇక ఎక్కడా ఉండం.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది
- మొదటి మనిషి ఆదాము చనిపోయాక మట్టిలో కలిసిపోయాడు. (ఆదికాండము 2:7; 3:19) ఆయనలానే అందరూ చనిపోయాక మట్టిలో కలిసిపోతారు.—ప్రసంగి 3:19, 20. 
- మనుషులు చనిపోయాక వాళ్లు చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారు. (రోమీయులు 6:7) బ్రతికి ఉండగా చేసిన తప్పులకు చనిపోయాక శిక్ష ఉండదు. 
చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?
మీరేమంటారు?
- అవును 
- కాదు 
- చెప్పలేం 
బైబిల్లో ఏముందంటే . . .
‘పునరుత్థానము కలుగబోవుచున్నది.’—అపొస్తలుల కార్యములు 24:14, 15.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది
- బైబిల్లో చాలాసార్లు మరణాన్ని నిద్రతో పోల్చారు. (యోహాను 11:11-14) మనం నిద్రపోయే వాళ్లను లేపినట్లే దేవుడు చనిపోయినవాళ్లను లేపుతాడు.—యోబు 14:13-15. 
- చనిపోయి తిరిగి బ్రతికిన చాలామంది గురించి బైబిల్లో ఉంది. అవి చదివితే చనిపోయినవాళ్లు ఖచ్చితంగా లేస్తారని నమ్మవచ్చు.—1 రాజులు 17:17-24; లూకా 7:11-17; యోహాను 11:39-44. (w16-E No.1)