పయినీర్లకు మద్దతు చూపుట
1 పరిచర్యలో ఆసక్తిగా పాల్గొనుటయందు దేవుని ప్రజలు ప్రఖ్యాతిగాంచియున్నారు. అయితే ప్రతి ఒక్కరికి వారిని పయినీరుగా చేయుటకు అనుమతించునట్టి పరిస్థితులు లేకపోయినను, మనము చేయుపనిలో పూర్ణాత్మ గలవారమై యుండుటద్వారా, పయినీరు ఆత్మను (స్పిరిట్‌ను) వృద్ధిచేసికొనుటకు మనము కృషిచేయవలెను. పయినీరు సేవలో ప్రవేశించగలిగిన అనేకమందిని మనము ప్రోత్సహిస్తూ, వారితోపాటు మనము సంతోషించెదము.
2 పయినీరుగా అగుట, అందులో నిలబడుట ఒక పెద్ద పథకముతో కూడిన పని. ప్రకటించుట మరియు బోధించుట పనియొక్క ఎక్కువభాగమును పయినీర్లు మోస్తున్నారు. ఎంతో కృషి, త్యాగము లేకపోతే ఈ పని నెరవేర్చబడదు. ఈ పూర్తికాల సేవకులను ఇతరులు ఎట్లు బలపరచి, వారికి మద్దతునివ్వగలరు?
3 ఏమి చేయవచ్చును: పయినీర్లకు పెద్దల మద్దతు అవసరము. పెద్దలు పయినీర్లతో పనిచేసినప్పుడు ఎంతో ప్రోత్సాహము అందించబడగలదు. అనేకమంది పెద్దలు సంఘములోని ప్రతి పయినీరుతో కనీసము సంవత్సరమునకు ఒక్కసారియైనను పనిచేయుటకు ప్రయత్నిస్తారు. ఈ విధంగా పెద్దలు పయినీర్లు చేయుపనికి వారిని అభినందించగలిగి, వారు ఇంకా అభివృద్ధినొందునట్లు వారికి సహాయపడుదురు. పెద్దలు అందుబాటులోవున్నప్పుడు వారితో పనిచేయునట్లు పయినీర్లు వారి సేవా కాలక్రమ పట్టికలో సర్దుబాట్లు చేసికొనవలసిన అవసరత ఉండవచ్చును. ఇంకా, పెద్దలు గ్రూప్స్‌కు తగినంత ప్రాంతాన్ని అందుబాటులోయుంచునట్లు ఖచ్చితంగా చూచుటకు సిద్ధపడాలి. పయినీర్ల కాలక్రమ పట్టికకు అనుగుణంగా మధ్యాహ్నములందు, సాయంకాలములందు అదనముగా ప్రాంతీయ సేవకొరకైన కూటములను ఏర్పాటుచేయవచ్చును. ఇది ప్రత్యేకంగా ఎక్కువమంది సహాయ పయినీర్లుగా చేయు నెలలో వాస్తవము.—యెషయా 40:11.
4 పరిచర్యలో వారికి సహాయపడుటద్వారా, పట్టుదలతో సంఘ ఏర్పాట్లవిషయంలో శ్రద్ధ వహించుటద్వారా పరిచారకులు పయినీర్లకు సహాయపడుటకు మంచి స్థానమందున్నారు. ప్రాంతీయ సేవా గ్రూపులను వ్యవస్థీకరించుటలో సహోదరులు నాయకత్వము వహించుటను పయినీరు సహోదరీలు మెచ్చుకొందురు. లిటరేచర్ మరియు పత్రికలనుగూర్చి చూసేవారు అవి తగినన్ని అందుబాటులో ఉండులాగున చూడవచ్చును. అటువంటి విషయములనుగూర్చి శ్రద్ధవహించుట పయినీర్లు తమ పరిచర్యలో అవధానమును నిలుపునట్లు చేయగలదు.
5 ప్రతిఒక్కరు సహాయము చేయవచ్చును: ఎక్కువ తరచుగా పయినీర్లతో పనిచేయుటకు తమ్మునుతాము లభ్యపరచుకొనుటద్వారా ప్రచారకులు సహాయము చేయవచ్చును. పయినీర్లు ఇతర ప్రచారకుల సహవాసమును, మద్దతును ఆనందించెదరు. బహుశా వారమునకు ఒకసారి, నెలకు రెండుసార్లు పయినీర్లతో పనిచేయుటకు నీవు ఏర్పాట్లు చేసికొనవచ్చును. వస్తుసంబంధమైనవాటిని పయినీర్లతో పంచుకొనవచ్చును. ఈ విధమైన ఉదార స్వభావమును పయినీర్లు ఎంతగానో మెచ్చుకొందురు.—ఫిలిప్పీ. 4:14-19.
6 కుటుంబములు, పయినీర్లుగా చేయుచున్న వారి కుటుంబ సభ్యులకు సహాయముచేయుటకు ఎంతో చేయవచ్చును. తరచు ఇంటిలోని ఒకరు లేక ఎక్కువమంది పయినీరు చేయులాగున ఇంటిలోని చిన్నచిన్న పనులను సరిదిద్దుకోవచ్చును. ముగ్గురు పిల్లలుగల ఒక సహోదరి వారములో రెండు రోజులు పనిచేయును. ఆమె కుమారులు దుకాణమునకు వెళ్లుపనులు ఇంటిచుట్టుప్రక్కల పనులు చూచుదురు. కుమార్తె శుభ్రముచేయుట, వంటపనులలో సహాయముచేస్తుంది. ఆమె పట్టభద్రురాలైన తరువాతనుండి ఆమె కూడా, ఆమె తల్లితోపాటు దినముమార్చి దినము పనిచేస్తూ పయినీరుగా చేయుటకు మొదలిడింది. కుటుంబములో ఆవిధమైన సహకారముంటే ఎక్కువమంది పయినీరు సేవచేసి కుటుంబమునకు ఆశీర్వాదములు తెచ్చుటకు అది దోహదపడును.
7 పట్టుదలగల పయినీర్లు అనేక విధములుగా సంఘమునకు ఆశీర్వాదకరంగా తయారగుదురు. వారి ఆసక్తి మరియు మాదిరి అనేకులకు సేవలో ఇంకా ఎక్కువచేయునట్లు ప్రోత్సహించును. నిశ్చయముగా, వారికి మద్దతునిచ్చుటకై చేయగలిగినదానిని చేయుటకు మనము ఇష్టపడవలెను. ఐక్యముగాచేసే అట్టి ప్రయత్నములు అందరికి సంతోషమునుతెచ్చి, యెహోవాకు స్తుతి కలుగజేయును.