కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/93 పేజీ 2
  • మార్చి కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఉపశీర్షికలు
  • మార్చి 1తో ఆరంభమగు వారము
  • మార్చి 8తో ఆరంభమగు వారము
  • మార్చి 15తో ఆరంభమగు వారము
  • మార్చి 22తో ఆరంభమగు వారము
  • మార్చి 29తో ఆరంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1993
km 3/93 పేజీ 2

మార్చి కొరకైన సేవా కూటములు

మార్చి 1తో ఆరంభమగు వారము

పాట 9 (19)

15 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ప్రకటనలు. భూవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆయన సేవకులపై యెహోవా దీవెనలు ఎలా ఉన్నాయో నొక్కిచెప్తూ దైవపరిపాలనా వార్తల నుండి ముఖ్యాంశాలు. సందర్భానుసారంగా స్థానిక సంఘాల అనుభవాలను కూడ చేర్చవచ్చును.

15 నిమి: “‘రమ్ము’ అని చెబుతూ ఉండండి.” ప్రశ్న సమాధానముల చర్చ. నాలుగవ పేరాను చర్చించునప్పుడు, బాగా సిద్ధపడిన ప్రచారకుడు నిరంతరము జీవించగలరు పుస్తకంలోని 18వ అధ్యాయం నుండి కొన్ని విషయాలను ముఖ్యంగా, 150-153 పేజీలలో యేసుకు మరియు ఇతర ప్రవచనాలకు సంబంధించిన దృష్టాంతాలను ఉన్నతపర్చును.

15 నిమి: “పరిచర్యలో సర్వతోముఖ ప్రతిభను కనపర్చుము.” ప్రసంగం, కొంతమేరకు ప్రేక్షకులు పాల్గొనవచ్చు. 3-5 పేరాలు చర్చించునప్పుడు రెండు చిన్న ప్రదర్శనలు యిమడ్చవచ్చును. 4 మరియు 5 పేరాలలోని విషయాన్ని ప్రదర్శించేటప్పుడు శీర్షికలో తెలియజేయబడినట్లు ఇంటింటి సేవలో ఒక చిన్నపిల్లవాడు, ఒక పెద్దవయస్సు ప్రచారకుడు కలిసి ఎలా పని చేయవచ్చునో చూపించండి. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ సేవలో ఆనందాన్ని కనుగొనుట యొక్క అవసరతను గూర్చి నొక్కిచెప్పండి.

పాట 114 (61) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 8తో ఆరంభమగు వారము

పాట 128 (4)

 5 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ కొరకు సహాయ పయినీర్లుగా ముందే అంగీకరింప బడినవారి సంఖ్యను తెలియజేయండి. పయినీరు సేవ చేయాలని ఆలోచిస్తున్న వారిని ధరఖాస్తులు త్వరగా ఇమ్మని ప్రోత్సహించండి.

20 నిమి: “యెహోవాను ఘనపరచుటకు నీవు ఇంకా ఎక్కువ చేయగలవా?” 1 నుండి 10 పేరాల ప్రశ్న సమాధానముల చర్చ.

20 నిమి: మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయుట. బైబిలు విద్యార్థులకు కేవలం పఠనాన్ని చేయటమే కాకుండ ఇంకా ఎక్కువ సహాయాన్ని ఇవ్వవలసిన అవసరతను గూర్చి నొక్కి చెప్తూ ప్రేక్షకులతో చర్చ. (1 థెస్స. 2:8) కూటాలకు హాజరై, పాల్గొనుటకు హృదయపూర్వక ఇష్టం కలుగజేయుటకై అదనపు సమయాన్ని తీసుకోండి. ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశ దినములు, జిల్లా సమావేశాలను గూర్చి వివరించుట ద్వారా సంస్థ యెడల మరియు అంతర్జాతీయ సహోదరత్వం యెడల మెప్పు పెంపొందేలా చేయండి. ప్రతిపఠనం తరువాత, జెహోవాస్‌ విట్‌నెసెస్‌ యునైటెడ్‌లీ డూయింగ్‌ గాడ్స్‌ విల్‌ వరల్డ్‌వైడ్‌ బ్రోషర్‌లో నుండి ఒక భాగాన్ని చర్చిస్తూ, దాని నుండి వారేమి నేర్చుకున్నారో తెలుసుకొనుటకు కొంత సమయాన్ని గడపండి. వారు నేర్చుకునే దాన్ని ఇతరులతో తటస్థంగా ఎలా పంచుకోవచ్చో క్రమేపి తెలియజేయండి. అవర్‌ మినిస్ట్రీ పుస్తకంలోని 98 మరియు 99 పేజీలలో పేర్కొనబడిన అవసరతలకు తగినట్లు ఉండి, బహిరంగ సేవలో పాలుపొందాలని కోరుతుంటే, బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులగుటకు సహాయం చేయవలెను. సమర్పణ మరియు బాప్తిస్మంయెడల మెప్పు పెంపొందేలా సహాయంచేయుటకు పఠనమప్పుడు, ఆ తరువాత విద్యార్థితో సమయం గడపడం ప్రాముఖ్యము. మన సమావేశాల వద్ద జరిగే బాప్తిస్మం యొక్క చిత్రాలను లేక వార్తాపత్రికల శీర్షికలను విద్యార్థులకు చూపించవచ్చును. ప్రదర్శన: తటస్థ సాక్ష్యం విషయంలో ప్రచారకుడు బైబిలు విద్యార్థికి సహాయం చేయును. నిరంతరము జీవించగలరు పుస్తకం నుండి క్షేత్రంలో మాట్లాడదగు అంశాన్ని ఎన్నుకొని ఇలా చెబుతాడు: “ఈ అంశాన్ని మీ బంధువులు లేక పొరుగువారి కొంతమందితో పంచుకోవడం మంచిది. మీకు ముందు తెలియని విషయాన్ని బైబిలు నుండి నేర్చుకున్నామని మీరు వారికి చెప్పవచ్చు.” బాప్తిస్మం తరువాత కూడ బైబిలు విద్యార్థులకు సహాయం చేయుమని, ప్రేమ మరియు శ్రద్ధ చూపించుమని ప్రచారకులను ప్రోత్సహించుము.

పాట 123 (63) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 15తో ఆరంభమగు వారము

పాట 72 (58)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు. విరాళముల కొరకు కృతజ్ఞత. ఈ విభాగంలో క్రింద ఉన్న “సమయానుకూలమైన సమాచారం”ను చూడుము. మార్చి 28న యివ్వబడే ప్రత్యేక ప్రసంగంయొక్క ముఖ్యాంశాన్ని వ్రాసుకొని, ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించుమని అందరిని ప్రోత్సహించండి.

15 నిమి: “ఆసక్తి కనపరచిన వారందరికి సహాయముచేయుట.” ప్రేక్షకుల చర్చతో ప్రసంగము. సమయం అనుకూలించినట్లైతే ఉదహరింపబడిన లేఖనాలను పరిశీలించండి. 3వ పేరాలోని సూచనను ప్రదర్శించుము. మొదటిసారి హాజరగుచున్న వారి ఆసక్తిని వెంబడించుట యొక్క అవసరతను ఉన్నతపరచుము.

20 నిమి: “యెహోవాను ఘనపరచుటకు నీవు ఇంకా ఎక్కువ చేయగలవా?” 11 నుండి 22 పేరాల ప్రశ్నా సమాధానముల చర్చ.

పాట 32 (10) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 22తో ఆరంభమగు వారము

పాట 66 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నా భాగము. ఏప్రిల్‌లో సేవయందు ఎక్కువగా పాల్గొనుటకు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించండి.

20 నిమి: వృద్ధులయెడల శ్రద్ధ వహించుట. ఇద్దరు సహోదరులచే చర్చ మరియు ఇంటర్‌వ్యూలు. “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశములో ఆదివారం ఉదయము అందించబడిన సింపోజియం యొక్క ముఖ్యాంశము “క్రైస్తవ గృహములో ఒకరియెడల ఒకరు శ్రద్ధచూపుకొనుట.” వృద్ధులు కుటుంబానికి మరియు సంఘానికి చేసే విలువైన సహాయాన్ని గూర్చి “వృద్ధులయెడల శ్రద్ధవహించుట ద్వారా” అనే చివరి భాగంలో నొక్కిచెప్పబడింది. (సామె. 16:31) వృద్ధులకు మనమెలా సహాయం చేయగలము? కుటుంబానికి ప్రాథమిక బాధ్యత ఉంది. (1 తిమో. 5:3, 4, 8, 16) సహనం మరియు కనికరం అవసరం. గతంలో తలిదండ్రులు మరియు అమ్మమ్మ తాతలు సంవత్సరాలు చూపిన ప్రేమ, పని, శ్రద్ధలయెడల మెప్పును చూపించే అవకాశం మనుమలకు, ఎదిగిన పిల్లలకు ఉంటుంది. (w87 6/1 13-18) సంఘము కూడ పెద్దవారికి సహాయం చేయవచ్చు. ప్రభుత్వ సహాయం పొందడానికి యోగ్యులగుటకు కొంతమందికి సహాయం అవసరం కావచ్చు. భోజనాలకు, సమావేశాలకు వారిని ఆహ్వానించుట ద్వారా ఆదరణను చూపండి. (రోమా. 12:13) ప్రాంతీయ సేవలో వారికి సహాయం చేయండి. కూటములకు, సమావేశాలకు రావటానికి ప్రయాణ సౌకర్యం కల్పించండి. ఇంటిపనులలో, కొనుగోలు చేయుటలో వారికి సహాయం చేయండి. (w87 6/1 4-7) పెద్దవారి యెడల ఎల్లప్పుడు గౌరవం కనపర్చండి. (1 తిమో. 5:1, 2) మంచి మాదిరిగా ఉన్న ఒకరు లేక ఇద్దరు పెద్దవారిని ఇంటర్‌వ్యూ చేయండి. సంఘం మరియు తమ కుటుంబాలచే చూపబడిన కనికరాన్ని బట్టి వారెలా మేలు పొందారో ఉన్నతపర్చండి.

15 నిమి: ఏప్రిల్‌లో లేదా గతంలో సహాయ పయినీరు సేవ చేసిన ఇద్దరు ముగ్గురు ప్రచారకులను పెద్ద ఇంటర్వ్యూ చేయును. పయినీరు సేవచేయుటకు వారినేమి పురికొల్పింది? ఏప్రిల్‌ కొరకు వారు ఏం ఏర్పాట్లు చేసుకున్నారు? సహాయ పయినీరు సేవ వ్యక్తిగతంగా వారికి ఎలా సహాయం చేసింది? తరువాతి నెలలో సహాయ పయినీరు సేవ చేయుటకు ఏర్పాటు చేసుకునే వారినందరిని ధరఖాస్తులు తీసుకుని, నింపి త్వరగా తిరిగి ఇవ్వమని ప్రోత్సహించండి.

పాట 172 (92) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 29తో ఆరంభమగు వారము

పాట 105 (46)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జ్ఞాపకార్థ ఆచరణకు బైబిలు విద్యార్థులను, ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించమని అందరికీ గుర్తుచేయండి. ముద్రింపబడిన ఆహ్వానపత్రములను సద్వినియోగం చేయండి. ఆహ్వాన పత్రములపై జ్ఞాపకార్థ ఆచరణ యొక్క సమయాన్ని, అది ఆచరింపబడే స్థలం యొక్క చిరునామాను చక్కగా వ్రాయమని ప్రచారకులను ప్రోత్సహించండి.

25 నిమి: “నిత్యజీవ నిరీక్షణనిచ్చు మరణమును ఆచరించుట.” సంఘాధ్యక్షుడు ప్రశ్న సమాధానములతో వివరించును. “జ్ఞాపకార్థ ఆచరణకొరకు సిద్ధపడుటలో” అనే బాక్సులోని సమాచారాన్ని కూడ చేర్చండి. శీర్షికయొక్క ఐదవ పేరాను పరిశీలించిన తరువాత, బైబిలు విద్యార్థిని జ్ఞాపకార్థ దినానికి ఆహ్వానించడాన్ని ప్రదర్శించండి. ప్రచారకుడు ఏప్రిల్‌ 1-6 తారీఖులలో చదవటానికి ఎంపికచేయబడిన బైబిలు లేఖనాల ఏర్పాటునుగూర్చి వివరించి, ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానంటాడు.

10 నిమి: ఏప్రిల్‌లో వాచ్‌టవర్‌ చందాలను అందజేయుట. ఆ నెలలో మాట్లాడే ప్రత్యేకమైన అంశాలను, ఆయా విషయాలను ఉన్నతపర్చుము. ప్రతి సందర్భంలోను పత్రికలలోని విషయాలపైకి దృష్టిని మళ్లించటానికి సంసిద్ధంగా ఉండండి.

పాట 87 (47) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి