సంపూర్ణ సాక్ష్యమివ్వడంలో ఆనందాన్ని పొందండి
1 మనమందరమూ మన పనిని చక్కగా చేసినపుడు ఎంతో ఆనందిస్తాము. “ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు” అని జనసమూహములు యేసునుద్దేశించి అన్నట్లు మార్కు 7:37 చెబుతుంది. యెహోవా చిత్తాన్ని చేయడంలో యేసు ఎంతో ఆనందించాడనటంలో ఆశ్చర్యమేమీలేదు! (కీర్తన 40:8 పోల్చండి.) మనం ఈ క్రిందనున్న సలహాలకు ధ్యానమిస్తూ, “ప్రజలకు ప్రకటించి, సంపూర్ణ సాక్ష్యమివ్వండి” అన్న యేసు ఆజ్ఞకు లోబడుతున్నప్పుడు మనం కూడా ఆనందాన్ని కనుగొనగలం. (అపొ. 10:42, NW) జనవరిలో మనం ప్రత్యేక ధరకు లేదా సగం ధరకు పట్టిక వేసినటువంటి 192 పేజీల పాత పుస్తకాలను ప్రతిపాదిస్తున్నాము. మన ప్రాంతంలోని భాషలో అవి లభ్యంకానట్లయిన జ్ఞానము పుస్తకం గానీ కుటుంబ సంతోషం పుస్తకం గానీ ఒక్కొక్కటి రూ. 20కి అందించాలి. సంపూర్ణ సాక్ష్యం ఇవ్వడానికి ఈ ప్రచురణల్ని ఎలా ఉపయోగించవచ్చు?
2 ప్రజలు తరచూ తమ ఆరోగ్య విషయమై చింతిస్తారు కనుక, మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “వైద్యరంగంలో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించినప్పటికీ, అనారోగ్యం వల్ల ఎంతో బాధ పడుతుంటాము. కారణమేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] తెగుళ్లు చివరి దినాల ఒక లక్షణమై ఉంటుందని యేసు చెప్పాడు. (లూకా 21:11) అయితే, అనారోగ్యం ఇక ఉండని కాలాన్ని గూర్చి కూడా బైబిలు వర్ణిస్తుంది. [యెషయా 33:24 చదవండి.] ఈ పుస్తకం ఆ ప్రాథమిక బైబిలు బోధలయందు నిరీక్షణను ఎలా కలిగిస్తుందో చూడండి.” మీరు చూపిస్తున్న పుస్తకంలోని సముచితమైన వ్యాఖ్యానాలను ఉన్నతపర్చి దాన్ని ప్రతిపాదించండి.
3 షాపింగ్ ఏరియాలో అనియత సాక్ష్యం ఇస్తున్నపుడు, మీరు వారిని పలకరించి ఇలా అడుగవచ్చు:
◼ “ఈ రోజుల్లో అంతకంతకు పెరిగే ధరలను బట్టి సంపాదన కనీసావసరాలకు కూడా చాలనట్లు భావిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఆర్థిక భద్రత గల కాలం ఎప్పటికైనా వస్తుందని మీరు అనుకుంటున్నారా?” ప్రతిస్పందించనివ్వండి. అప్పుడు మీరు ప్రతిపాదించబోయే పుస్తకంలో నుండి ఎత్తివ్రాయబడిన తగిన లేఖనాన్ని చూపండి. “ఈనాడు జీవితాన్ని కఠినతరం చేస్తున్న సమస్యలను దేవుడు తన రాజ్యం ద్వారా ఎలా పరిష్కరిస్తాడో ఈ పుస్తకం చూపిస్తుంది” అని చెబుతూ ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. ఆ సంభాషణను బట్టి మీరెంత ఆనందించారో చెప్పి, ఆ తర్వాత, “మనం మరోసారి కలుసుకొని మాట్లాడుకొనే మార్గమేదైనా ఉందంటారా?” అని అడగండి. అలా మీరు ఆ వ్యక్తి ఇంటి చిరునామా గానీ ఫోన్ నెంబరు గానీ పొందవచ్చు.
4 “జ్ఞానము” పుస్తకాన్ని ఉపయోగిస్తూ, ప్రపంచశాంతిని గూర్చిన ఈ అందింపును ప్రయత్నించే అవకాశం ఉండవచ్చు:
◼ “మీ ఉద్దేశంలో ప్రపంచశాంతిని సాధించడం ఎందుకు ఇంత కష్టతరమౌతుందంటారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 188-9 పేజీలలోనున్న చిత్రాన్ని చూపండి.] ఈ చిత్రం ఇలాంటి వివిధ బైబిలు వర్ణనలపై ఆధారపడి ఉంది. [యెషయా 65:21 చదవండి.] దేవుని గూర్చీ, ఆయన సంకల్పాలను గూర్చీ సరైన జ్ఞానము లేకపోవడమే, ఈనాడు ప్రపంచంలో శాంతిసమాధానాలు లేకపోవడానికి కారణం. త్వరలో అలాంటి జ్ఞానముతో ఈ భూమంతా నిండుతుంది. [యెషయా 11:9 చదవండి.] ఈ పుస్తకం మీరు ఇప్పుడు అలాంటి జ్ఞానము పొందడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని తీసుకుని చదవమని ప్రోత్సహిస్తున్నాము” అని ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి.—జ్ఞానము మరియు కుటుంబ సంతోషం పుస్తకాలను అందించే ప్రభావవంతమైన ఇతర మార్గాల కోసం మన రాజ్య పరిచర్య 1997 సెప్టెంబరు, జూన్, మార్చి, 1996 నవంబరు, మరియు జూన్ సంచికల వెనుక పేజీలు చూడండి.
5 ఆసక్తి చూపిన వారిని తిరిగి కలిసినపుడు, మీరు ఇలా ప్రయత్నించడం ద్వారా బైబిలు పఠనాన్ని ప్రారంభించవచ్చు:
◼ “పోయినసారి మనం మాట్లాడుకున్నపుడు మీరు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానాలను చేశారు. [ఆ వ్యక్తి చేసిన ఒక వ్యాఖ్యానాన్ని పేర్కొనండి.] దాని గూర్చి నేను ఆలోచించాను. ఆ విషయంపై నేను చేసిన పరిశోధనా ఫలితాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. [తగిన లేఖనాన్ని చూపించండి.] అతి తక్కువ సమయంలోనే బైబిలు ప్రాథమిక బోధలను పరిశీలించేందుకు కోట్లాదిమందికి సహాయపడిన ఉచిత పఠనకోర్సును మేము ప్రతిపాదిస్తున్నాము. అలాంటి పరిశీలన దేవుని వాగ్దానాల నిర్దిష్ట నెరవేర్పుపై మీ నమ్మకాన్ని బలపరుస్తుంది.” జవాబులు పొందగల కొన్ని ప్రశ్నలను ఉన్నతపర్చండి. ఆ వ్యక్తి బైబిలు పఠనాన్ని నిరాకరించినట్లయిన, వారానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే తీసుకునే 16 వారాలపాటు సాగే ప్రత్యేక శీఘ్ర పఠన కోర్సుకూడా ఉందని వివరించండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ చూపించి, మొదటి పాఠాన్ని తెరచి, పఠనాన్ని ఎలా చేస్తామో చూపించమంటారా అని అడగండి.
6 హ్యాండ్బిల్లుల ఉపయోగాన్ని గుర్తుంచుకోండి: ఈ హ్యాండ్బిల్లులను ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంటివారి ఆసక్తిని రేకెత్తించడానికి ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. లేదా వారు సాహిత్యాన్ని నిరాకరించినపుడు కూడా వీటిని ఉపయోగించవచ్చు. వారు అందులో ఆసక్తి కనబరచినపుడు బైబిలు పఠనానికి అంగీకరించేలా, మన కూటాలకు హాజరయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు హ్యాండ్బిల్ వెనుకనున్న సందేశాన్ని ఉపయోగించండి.
7 మీ పనిలో నైపుణ్యం కలిగి ఉండండి, అప్పుడు మీ పనిలో మీరు ఆనందిస్తారు. సంపూర్ణ సాక్ష్యమివ్వడంపై ఎడతెగక అవధానముంచండి, పరిచర్యలోని అన్నిభాగాలనూ చక్కగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందండి.—1 తిమో. 4:16.