1991 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు హాజరగుటకు ఇప్పుడే ఏర్పాటు చేసికొనుము
1 నేటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, అనేక దేశములలోని ప్రజలు తాము కలిగియున్న దానికంటె ఎక్కువ స్వాతంత్ర్యమును కోరుట ఆశ్చర్యముకాదు. అయితే నిజమైన స్వాతంత్ర్యము ఎచ్చట కనుగొనబడును? యేసు ఇట్లనెను: “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహా. 8:31, 32) మనుష్యులు ఒక రాజకీయ పాలకుని తృణీకరించినప్పుడు లేదా ఒక ప్రభుత్వము యెడల మక్కువతో మరొకదానిని విడనాడినప్పుడు వారు నిరీక్షించునట్టి పరిమితమైన స్వాతంత్ర్యము కాదు ఇది. బదులుగా, మానవ సమస్యలకుగల మూలమునకు అది చేరును. పాపపు దాస్యబంధకములనుండి స్వతంత్రమగుటనుగూర్చి యేసు చర్చించుచుండెను. (యోహా. 8:24, 34-36 చూడుము.) ఆ విధముగా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క నిజశిష్యుడైనప్పుడు, అతని జీవితములో గుర్తించదగు మార్పు, ఒక విడుదల అతనికి లభించును.
2 మూడు రోజుల సమావేశము: 1991 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశములు ఇండియాలో సెప్టెంబరు 13-15 నుండి ప్రారంభమగును. ప్రారంభ కార్యక్రమము శుక్రవారం ఉదయం 10:20 గంటలకు ప్రారంభమై, ఆదివారం మధ్యాహ్నము 4 గంటలకు సమావేశము ముగియును. ప్రతి కార్యక్రమభాగమందు మన ఆత్మీయారోగ్యమునకు అవసరమగునట్టి జాగ్రత్తగా ఎంపిక చేయబడిన సమాచారము అందించబడును. రోమా. 8:21 నందు పేర్కొనబడిన స్వాతంత్ర్యము మనకు ఎలా లభించునో వివిధ రకములైన అంశములు ఉన్నతపర్చబడును. ప్రసంగములందు, ప్రదర్శనలందు, పరిచయములందు మరియు ఒక నాటికయందు ఉత్తేజితమగు సమాచారము పెంపొందించబడి, అందించబడును.
3 ఒక్క కార్యక్రమముకూడ తప్పిపోకుండునట్లు చూచుకొనుడి, అందుకు మీ పట్టికలో వ్యక్తిగత త్యాగముల సర్దుబాట్లు చేయవలసియుండును. మీ యజమానితో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిన అగత్యత ఉండునేమో, అన్ని కార్యక్రమములకు హాజరగు నిమిత్తము అనేకులు ఆర్థికసంబంధమైన లబ్దినికూడ విడిచిపెట్టుటకు ఇష్టపడుచున్నారు. ఈ విషయమునుగూర్చి యథార్థంగా ప్రార్థనచేయుచు, అచ్చట ఉండడాన్ని హృదయపూర్వక ప్రయత్నములు చేయువారిని యెహోవా నిశ్చయముగా ఆశీర్వదించును.—లూకా 13:24.
4 ముందుగా చేరుకొనుము: ఆధారపడదగినవారిగా, సమయమునకు వచ్చువారిగా ఉండుటకు తాము చేయు ప్రయత్నములనుగూర్చి యెహోవాసాక్షులు పేరుగాంచిరి. (లుకా 16:10) జిల్లాసమావేశమునకు హాజరగునప్పుడుకూడ ఇది ప్రాముఖ్యము. ప్రతిదినము ముందుగావచ్చి, కార్యక్రమము ప్రారంభముకాక మునుపు కూర్చొనండి. మీ వాహనము నిలుపుట, మీ కుటుంబమునకు సీట్లను కనుగొనుటవంటి అవధానమివ్వవలసిన విషయాలకు తగినంత సమయమును అనుమతించుట కూడ అవసరము.
5 జిల్లాసమావేశమునకు హాజరగుట ఉల్లాసవంతమైన సహవాసమును అనుభవించుటకు మనకు మంచి అవకాశమునిచ్చును. అయితే రాత్రి చాలా ఆలస్యమయ్యేంతవరకు స్నేహితులను దర్శిస్తు ఉన్నట్లయితే మరుసటిరోజున సమయానికి అచ్చట ఉండడానికి మనము చేయు ప్రయత్నములను కృంగజేయును. ఆలస్యంగా ప్రారంభమై, ఉదయాన్నే త్వరత్వరగా వెళ్లవలసివస్తున్నందుకు ఎక్కువ ఆందోళన, ఆశాభంగము కల్గును. దీనిని తప్పించుకోవాలంటే విశ్రాంతి తీసుకొనుటకు తగిన సమయమును నిర్ణయించుట ప్రయోజనకరము. పట్టికకు ఖచ్చితముగా అంటిపెట్టుకొన్నట్లయితే, రాత్రి అందరు మంచిగా నిద్రపోయి మరుసటి దినమును పెందలకడనే ప్రారంభమగుటకు సిద్ధంగా ఉందురు. కార్యక్రమము కొనసాగుచుండగా చేరుకొనుటను ఇది తప్పించగలదు. ఆలస్యంగా రావడం అప్పటికే కూర్చున్నవారి అవధానమును మరల్చి, విసుగు పుట్టించగలదుకూడ. ప్రతిదినము ముందుగా రావడం మూలంగా మీ సహోదర సహోదరీలతో సహవాసము చేయుటకు మీకు అవకాశము లభించును. యెహోవా యెడల ఆయన అందించుచున్న ఆత్మీయ విషయముల యెడల గౌరవముతో క్రైస్తవ ప్రేమ, మరియు శ్రద్ధ, మనము సమయానికి చేరుకొనుటకు చేయగలిగినదంతా చేయుటకు మనలను పురికొల్పవలెను.
6 శ్రద్ధగా వినుము: వినుట అనగా మన మనస్సును మరియు మన హృదయమును ఈ రెండింటిలోను, మన చెవులు, మన గ్రాహ్యశక్తులతో నిజంగా అవధానమును నిలుపుట అని అర్థము. మనము విని, “యెహోవా వాక్కునకు చెవి యొగ్గువలసియున్నాము. (యిర్మీ. 2:4) యెషయా 55:2 నందు యెహోవా ఇశ్రాయేలీయులకు యిలా ఆజ్ఞాపించెను: “నామాట శ్రద్ధగా ఆలకించుము.” “ఏకాగ్రత” అనుమాట “ఎక్కువ శ్రమ తీసుకొని లేదా శ్రద్ధవహించి చేయబడేది” అని నిర్వచింపబడినది. సమావేశము జరుగునప్పుడు మనము శ్రద్ధవహించి మనము ఆకాంక్షతో “విని మరింత ఉపదేశమునొందగలము.” (సామె. 1:5, NW) జిల్లాసమావేశములో విని నేర్చుకొనుటకు సర్వసాధారణముగా రాజ్యమందిరములో చేయుదానికంటె ఎక్కువ ప్రయత్నము అవధానము నిలుపవలసియున్నాము. ఎందుకు? ఎక్కువ సమయము కూర్చొని ఉంటున్నాము. మరియు ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరైయున్నందున అవధానము ఎక్కువ మరల్చబడును. మనము జాగ్రత్తగా ఉండకపోతే మనలను మనమే లేకుండా చేసికొని, అందించబడుచున్న ఆత్మీయపోషకాహారమునుండి పూర్తి ప్రయోజనము పొందకుండా తప్పిపోగలము. (1 పేతు. 2:2) ఏమి చేయవచ్చును? కార్యక్రమము జరుగుచుండగా సమావేశ ప్రేక్షకులనేకులు నోట్స్ వ్రాసుకొను ఉపయుక్తమైన అలవాటును పెంపొందించుకొనుట చూడముచ్చటగా ఉన్నది. జిల్లాసమావేశములో ఇవ్వబడు ప్రసంగములలో కొన్ని కొంతకాలానికి సాహిత్యములలో వచ్చునుగాని మిగిలినవిరావు. జిల్లాసమావేశమందు నోట్స్ వ్రాసికొనుటను అందరు గురిగా కలిగియుండవలెనని ప్రోత్సహించబడుచున్నారు. ఎందుకంటే చెప్పబడుచున్న దానిపై మీ అవధానము నిలుపుటకు అది ఒక మంచి మార్గము.
7 తీసుకొను నోట్స్ పెద్దగాను విశదముగాను ఉండనవసరము లేదు. సర్వసాధారణముగా ఒక కీలకాంశమునకు ఒకటి లేక రెండు వాక్యములు సరిపోవును. యౌవన పిల్లలు కూడ ప్రసంగములనుండి ఎక్కువ ప్రయోజనము పొందగలరు మరియు వారికి ఒక వ్రాసుకొను పుస్తకమును పెన్ను లేక పెన్సిల్‌ను ఇచ్చి ప్రసంగీకుడు పేర్కొను కీలకాంశములను కీలక లేఖనములను లేదా క్రొత్త యోచనలను వ్రాసుకొనులాగున వారికి సహాయపడవచ్చును. చక్కగా వ్రాసుకొనిన నోట్స్ జిల్లాసమావేశనంతరము సేవా కూటమందలి కార్యక్రమములో సమావేశ కార్యక్రమముపై ఆసక్తికరమైన పునర్విమర్శ చేయునప్పుడు ఎంతో ప్రయోజనకరముగా ఉన్నట్లు పెద్దలు కనుగొందురు. అంతేకాకుండా, వారి బోధనాపనిలోను కాపరిపనిలోను అందలి అనేక అంశములను చేర్చుటకు వారు ఇష్టపడవచ్చును.
8 పాట మరియు ప్రార్థనయందు ఐక్యమైయుండుడి: యేసు మరియు ఆయన అపొస్తలులు చేసిన విధముగా, యెహోవాకు స్తుతులను పాడుటద్వారా ఆయనను ఘనపర్చుట మన ఆరాధనలో భాగమైయున్నది. (మార్కు 14:26) పాడుటనుగూర్చి పౌలు 1 కొరి. 14:15లో చేసిన వ్యాఖ్యానము క్రైస్తవ ఆరాధనలో అది ఒక క్రమమైన భాగముగా ఉన్నట్లు కన్పించుచున్నది. (మన రాజ్య పరిచర్య మార్చి 1991 పేజి 3కూడ చూడుము.) పాట మరియు ప్రార్థనద్వారా యెహోవాను స్తుతించుటలో వేలాదిమంది మన సహోదర సహోదరీలతో ఐక్యమైయుండుటకు జిల్లాసమావేశములు ఒక సాటిలేని అవకాశమును మనకిచ్చుచున్నవి. అయితే, మన ఆరాధనలో ప్రాముఖ్యమైన ఈ భాగములయెడల కొందరు గౌరవమును చూపుటలేదు. ఏ విధముగా? కారణసహితముగా ప్రారంభపాట మరియు ప్రార్థన జరుగుచున్నప్పుడుగాని, అటు తరువాతగాని సమావేశమునకు వచ్చుచున్నారు. కార్యక్రమ ముగింపులో, పాడుచున్నప్పుడుగాని ప్రార్థనకు ముందుగాని కొందరు తమ సీట్లను వదలి వెళ్లుచున్నారు. తప్పని పరిస్థితులందు అలా చేయుటకు మంచి హేతువు ఉండవచ్చును. అయితే, కేవలం తమ కార్ల యొద్దకు త్వరగా వెళ్లడానికి లేదా తినడానికి ముందుగా వెళ్లుటకు, ఐక్యముగా పాడి, ప్రార్థించుటకున్న అవకాశమును కొందరు విడనాడితే, యెహోవా బల్లయెడల తగిన గౌరవము, మెప్పుదలను చూపినట్లగునా?—మత్త. 6:33.
9 వ్యక్తిగత అనుకూలత కొరకు నేను ముందు అనే లోకసంబంధమైన స్వభావమును అనుమతించకుండ లేదా, మన ఆత్మీయవృద్ధిని అణచివేయునట్టి పేరాశ, స్వార్థత్వమువంటి భక్తిహీన లక్షణాలను అనుమతించకుండ శ్రద్ధవహించవలయును. ఇటీవల సంవత్సరములలో తూర్పు ఐరోపాదేశమందలి మన సహోదర సహోదరీలు పాడుట మరియు ప్రార్థించుటలో స్వాతంత్ర్యమును అనుభవించగలిగిరి. పెద్ద సంఖ్యతో కూడి పాడి ప్రార్థించుటలో వారు ఉల్లసించినరీతిగా, మనముకూడ పరిశుద్ధ విషయములందు అభినందనతోకూడిన అట్టి స్వభావమునే కనపరచి, మనము కలిసిపాడి, ప్రార్థించుటకున్న అవకాశములను ఎన్నడు తేలికగా దృష్టించకుందము గాక.
10 మన క్రైస్తవ మర్యాద: జిల్లాసమావేశములందు మన క్రైస్తవ మర్యాద, మనము కనబడుతీరు యెహోవా సాక్షులుగా మనకు మంచి పేరును తెచ్చుటలో కొనసాగుచున్నవి. ఎందుకనగా యెహోవాకు మనముచేయు ఆరాధనను గంభీరమైనదిగా పరిగణించి, సమావేశమునకు హాజరగుట ఒక సామాజిక కూటముగా మనము పరిగణించుటలేదు. అట్టి ప్రత్యేక సమయములకు కలిసివచ్చునప్పుడు, ఎల్లవేళలా పరిచారకులముగా మన క్రైస్తవహోదాను, ఆత్మసంబంధమైన మనస్సును కాపాడుకొనవలెను.—1 కొరిం. 10:31-33.
11 దీనిని చేయుటలో మనము తప్పిపోతే, ఇతరుల ఆనందాన్ని దెబ్బతీసిన వారమగుదుము. క్రొత్తవారిని అభ్యంతర పరచెదముకూడ. మనకు చూపబడిన అతిస్వల్పమైన దయార్థక్రియకు అభినందనను వ్యక్తపరచుచున్నామా? మనచుట్టూవున్న వారి విషయమై గౌరవమును శ్రద్ధను కనపరచవలెను. కార్యక్రమము ప్రారంభమైనప్పుడు, అది వినడాన్కి సమయమేగాని, అటుయిటు తిరుగుటకు, లేదా మాట్లాడుటకు సమయము కాదని మనలో ప్రతిఒక్కరము గుర్తించాలి.—ద్వితీ. 31:12.
12 మన క్రైస్తవ మర్యాదద్వారా యెహోవా దేవునికి మహిమను తెచ్చు మరొక విషయమేమంటే మనకు విశ్రమ స్థలములను పొందుపరచిన వారితో మనము వ్యవహరించు తీరు, మంచి హోటల్ గదులను మనము సవరించిన ధరలకే పొందగల్గుచున్నాము. మనము మర్యాదగాను, మితిమీరి కోరని వారమైయుండి, హోటల్ సిబ్బందియెడల మెప్పును అవగాహనను ప్రదర్శించవలెను. (గల. 6:10) హోటళ్లలో కలిగియుండవలసిన ప్రవర్తననుగూర్చి మంచి హెచ్చరిక ఇవ్వబడింది. దానికి అనుకూలముగా అనేకులు ప్రత్యుత్తరమిచ్చి, హోటల్ సిబ్బందితో సహకరించుటకు ఇష్టపూర్వకముగా కృషిచేయుచుండగా, కొన్ని ప్రదేశములలో యెహోవా సాక్షులయెడల ప్రతికూల దృక్పథము నిలిచియుండుటకు గుర్తించుట నిరుత్సాహంగా ఉన్నది. ఎందుకు?
13 డబ్బును ఆదా చేయడంలో మనము శ్రద్ధ కలిగియున్నను, అందించబడిన సేవలకు టిప్స్ ఆశించువారిని నిర్లక్ష్యపెట్టకూడదు. అవేక్! జూలై 22, 1986 నందు పేజి 24-7లలో నున్న శీర్షికలు “టు టిప్-ఆరా నాట్,” “టిప్స్ ఆన్ టిప్పింగ్” ఇంకను మన అవధానమును చూరగొనవలసియున్నవి. పేజి 24 నందు ఇలా సూచించబడినది: “టిప్స్ ఇవ్వడం మనకు అందించబడిన అదనపు సేవలకు కృతజ్ఞత తెల్పుటకంటె ఎక్కువ. ఒక వ్యక్తి ఆదాయములో అది ఒక ప్రధాన భాగము.” “సమావేశమునకు హాజరైనప్పుడు, మీరు వ్యక్తిగతముగా చేసే ప్రతిదీ గుంపు అంతటికి వర్తించును. మీ ప్రవర్తననుబట్టి ప్రజలు గుంపునంతటిని పరిగణిస్తారు,” అనికూడ అవేక్! సూచించినది. టిప్స్నుగూర్చి మీ వ్యక్తిగత దృక్పథములెలావున్నను, యెహోవాసాక్షుల సమావేశమునకు ప్రేక్షకునిగా మీరు ఒక నగరమును సందర్శించునప్పుడు, మంచి తీర్పును, అవగాహనను ఉపయోగించుము, మరియు “సువార్తవిషయములో అన్నింటిని చేయుటకు” సిద్ధముగా ఉండుము.—1 కొరిం. 9:19-23.
14 కొందరు సాక్షులు హోటళ్లను విడిచి వెళ్లేటప్పుడు గదులను ఆశుభ్రముగా విడిచారని హోటల్ యజమానులు గమనించారు. శుభ్రత మరియు శ్రద్ధ కేవలం దుస్తులు మరియు ప్రవర్తనయందేకాక, ఇతరుల ఆస్తియెడల కూడ లక్ష్యము చూపాలి. అద్దెకు తీసుకొనిన గదిని చక్కగాను, శుభ్రముగాను ఉంచకూడని కారణమేమైన ఉన్నదా? అనాలోచనాప్రవర్తన మన మంచిపేరును పాడుచేయును. రానున్న జిల్లాసమావేశములలో “అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు” ప్రవర్తించుటకు మనమంతా నిర్ణయమునకు వచ్చెదము.—తీతు. 2:10.
15 తల్లిదండ్రుల కొరకు: “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు చిన్నపిల్లలు, కౌమారులు (యౌవనులు) హాజరుకావలెనని ఆహ్వానింపబడుచున్నారు. ప్రారంభములో మానవులకు యివ్వబడిన స్వాతంత్ర్యమును ఆదాము పోగొట్టుకొనిన విధముగా, లోకము తమకు అందించు స్వాతంత్ర్యము వారి ఆత్మీయ మరణానికి నడిపించగలదు. ఈ విషయమై సరియైన తర్కనను యెహోవా ప్రేమపూర్వక సంస్థ మనకందరికి అందించుచున్నది. క్రైస్తవ కూటములన్నింటికి సన్నిహిత అవధానమును నిల్పుటను నేర్చుకొనిన వారును, సమావేశ కార్యక్రమమందు అత్యంత ఆసక్తిగల యౌవనులను చూచుట మనకు ప్రోత్సాహకరంగా ఉండును. (కీర్త. 148:12, 13) అయితే చాలామట్టుకు తలిదండ్రుల మాదిరి, పర్యవేక్షణపై ఆధారపడి ఉంటుంది. నోట్స్ వ్రాసుకొనుటకు అనేక యౌవనులకు మంచి శిక్షణ ఇవ్వబడింది. నోట్స్ వ్రాయుటను మీ పిల్లలకు ఇంకను బోధించకపోయినట్లయిన మీ సమావేశానికి ముందుగా మిగిలియున్న ఈ సమయాన్ని ఆ విధముగా చేయుటకు ఎందుకు ఉపయోగించకూడదు? చిన్న పిల్లలుకూడ చెప్పబడిన లేఖనములను, అందుకు సంబంధించి ప్రసంగీకుడు వ్యక్తపరచు కీలక పదములను వ్రాసుకొనునట్లు ప్రోత్సహించవచ్చును. ఆ దిన కార్యక్రమము అయిపోయిన తరువాత తమ విశ్రమ స్థలమునకు తిరిగివెళ్లినప్పుడు లేదా తిరిగి తమ యింటికి ప్రయాణమైనప్పుడు అందలి ముఖ్యాంశములను పునఃసమీక్షించుటకు అనేకమంది తల్లిదండ్రులు ఏర్పాటు చేసికొందురు.
16 పిల్లలు ఆటలాడుకోవాలనుకోవడం వారి సహజ కోరికయని అనేకమంది తల్లిదండ్రులు అర్థం చేసికొనగలరు. వారికి జీవితంలో అనుభవంలేదు, వారు పరిణతి చెందలేదు గనుక, ఎప్పుడు అవధానము నిలుపవలెనో, కూటములందు వారు ఎలా ప్రవర్తింపవలయునో వారికి బోధించవలెను. అందుకు తల్లిదండ్రుల మంచి పర్యవేక్షణ అవసరము. ఈ విషయములో కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రార్థనా సమయమందు తల్లిదండ్రులు యెహోవాకు తగిన గౌరవమును చూపుచున్నను, కొన్నిసార్లు వారి పిల్లలు ఆడుకొనుచు ఇతరులకు ఆటంకముగా ఉంటున్నారు. ప్రార్థనా సమయమందుకూడ తమ పిల్లలు ఏమి చేయుచున్నారో తల్లిదండ్రులు తెలిసికోవలసియున్నారు. అంతేకాకుండా, కార్యక్రమము జరుగుచుండగా వారు తమ సీట్లను వదలి వెళ్లినప్పుడు వారు ఏమి చేస్తున్నారు? సమావేశ కార్యక్రమ సమయమందు, లేదా తరువాత పిల్లలు గమనించబడకుండా వదలివేయబడుచున్నారా?—సామె. 29:15.
17 కొన్ని సందర్భాలలో హోటలునందు తల్లిదండ్రులు తమగదిలో ఉండగా, భోజనమునకు వెళ్లినప్పుడు, లేక ఇతర పనిలో నిమగ్నమైయున్నప్పుడు పిల్లలు గమనించబడకుండా వదలివేయబడుచున్నారు. ఇది సరియైనది కాదు. పెద్దవారైన సహోదరులు లేక సహోదరీలు దయాపూర్వకముగా సరిదిద్దబోయినప్పుడు కొంతమంది పిల్లలు క్రమశిక్షణా రహితముగా, అసభ్యముగా చివరకు అగౌరవముగా ప్రవర్తించారు. అట్టి అసభ్యత, క్రైస్తవత్వమునకు తగని ప్రవర్తనకు కారణము, తరచు ఇంటిలోని విచ్చలవిడితనము, క్రమశిక్షణారాహిత్వపు పరిస్థితియే. దానిని తప్పక సరిదిద్దవలెను. వారిని “యెహోవా శిక్షలోను మరియు బోధలోను పెంచుకొలది” క్రైస్తవ తల్లిదండ్రులందరు తమ పిల్లలను చాలా సన్నిహితముగా పరిశీలించవలెను.—ఎఫె. 6:4 NW.
18 మీ పూర్తి సహకారము మెచ్చుకొనబడును: హాజరగు ప్రతివారికిని సరిపడు సీట్ల ఏర్పాటు, సాహిత్యములు, ఆహారము, మరి యితర అవసరములు ఏర్పాటు చేయుటకు తగినంత పథకములు, కార్యసాధన జరిగింది. ఈ ఏర్పాట్లు మంచి ఫలవంతముగా నుండుట కొరకు కొన్ని సంఘములు ప్రత్యేకించి ఒక సమావేశమునకు నియమించబడినవి. జనం క్రిక్కిరిసి పోకుండ ఉండుటకు మీ పూర్తి సహకారము అవసరము. అయినను, కొంతమందికి వేరొక ప్రాంతమందలి సమావేశమునకు హాజరగు తప్పని పరిస్థితులుండవచ్చును. ఏమైనప్పటికిని, ఎక్కువమంది తమకు నియమించబడిన ప్రాంతపు సమావేశమునకు హాజరు కావలెను.—1 కొరిం. 13:5, ఫిలి. 2:4.
19 సీట్లను నిలుపుకొనుట విషయములో పూర్తి సహకారం కోరబడుచున్నది. మీ స్వంత కుటుంబ సభ్యులకు లేక మీ స్వంత కారులో మీతో ప్రయాణించిన వారికి మాత్రమే సీట్లను నిలుపుకొనవచ్చునను విషయమును దయచేసి మనస్సునందుంచుకొనుము. దయచేసి ఇతరులకొరకు సీట్లను ఉంచవద్దు. కొన్నిసార్లు ఎవరికొరకు కాకుండ సీట్లను అదనంగా ఉంచడం జరిగింది. ఇది ప్రేమలేని చర్య, మరియు లభ్యముగానున్న సీట్లకొరకు చూచు ఇతరులను, అటెండెంట్లను పెడత్రోవ పట్టించునదైయుండును. బైబిలు ఉపదేశానుసారముగా సహోదర ప్రేమను కనపర్చుటకును సీట్లను ఉంచుకొను విషయములో అంగీకృత ఏర్పాటులతో సహకరించుటకు మనము పోరాడవలెను. సీట్లు ఖాళీగా వున్నందువలన అవసరమైన వాటికంటె ఎక్కువ సీట్లను తమ స్వంతబంధువులకు లేక తమ కారులో ప్రయాణించువారికి ఎవరును ఉంచకూడదు.—2 పేతు. 1:7.
20 ఒకరోజు ముందుగానే సీట్లను నిలుపుకొనుట అనుమతించబడదు. ఉదయం 7 గంటలకు ముందే ఏ సమావేశ స్థలము స్వచ్ఛంద సేవకులకు తప్ప మరెవరికిని ఎప్పుడును తెరువబడదు. ఇతరులు లోనికి అనుమతించబడునప్పుడు అనగా ఉదయం 7 గంటలకు ముందుగా ఈ పనివాళ్లలో ఎవ్వరుకూడ సీట్లను నిలుపుకొనుటకు అనుమతింపబడరు. సొసైటి ఇచ్చిన సీట్ల నిలుపుదల మార్గదర్శక సూత్రములను నిందింపబడకుండ చూచుటకు ఏమి జరుగుచున్నదో చూచు నిమిత్తము ఈ సమయానికిముందే అటెండెంట్లు తమకు నియమించబడిన స్థానమందు ఉంటారు. హాజరైన ప్రతివారి ప్రయోజనము నిమిత్తము అటెండెంట్లు తమ కర్తవ్యమును నెరవేర్చుచుండగా వారితో పూర్తిగా సహకరించుము.
21 వ్యక్తిగత వస్తువులను సమావేశ స్థలమునకు తెచ్చు విషయములో మంచి వివేచనను ఉపయోగించుమని సలహాయివ్వబడుచున్నది. గతములో కొందరు పెద్ద కూలర్లు, తమసీట్ల క్రిందపెట్టలేని పెద్ద సామాగ్రిని తీసుకొనివచ్చారు. ఇవి సీట్లకు వెళ్లేమార్గమందును, లేక సీట్లపై పెట్టబడేవి. ఇవి ఇతరులకు సీట్లు లేకుండాచేసి, కొన్నిసార్లు, అగ్నిమాపక లేక భద్రతా సూచనలను భంగపర్చినవి. అట్టి విషయములలో మనము శ్రద్ధవహించవలెను.
22 ఆహారమును లేక ఇతర సమావేశ ఏర్పాట్లను దయచేసి వృధాచేయక జాగ్రత్త వహించుడి. గతసంవత్సరము సమావేశములలో, రొట్టెముక్కలు, ఇతర ఆహారపదార్థములు చెత్తకుండీలలో కన్పించినవి. మనకు చూపబడిన ఔదార్యమును దుర్వినియోగపర్చుట లేఖన సూత్రములను ఉల్లంఘించినట్లగును.—యోహా. 6:12.
23 సిద్ధపరచబడిన ఆత్మీయ కార్యక్రమమునుండి ప్రయోజనము పొందుటకు అటువంటి మంచి సౌకర్యములందు కూడుకొనగలుగుచున్నందుకు యెహోవా ప్రజలు నిశ్చయముగా మెచ్చుకొందురు. అట్టి కూటములందు అందించబడు సేవలను, అనుకూలతలను మేమును మెచ్చుకొనుచున్నాము. సమావేశమునకు హాజరగుట సంతోషదాయకమైనదిగాను, ఆత్మీయముగా సేదదీర్చునదిగాను చేయుటకు చాలినన్ని సీట్లు, ఖరీదైన సౌండ్ సిస్టమ్, మంచి ఆహారసేవ ఏర్పాట్లు ఎంతో జాగ్రత్తతో మరియు సొసైటియొక్క ఖర్చుతో ఏర్పాటు చేయబడుచున్నవి.
24 మీరు స్వచ్ఛందముగా ఇచ్చు చందాలవలన, సొసైటియొక్క ప్రపంచవ్యాప్త పనికి ఇచ్చు మద్దతు మూలముగా ఈ ఖర్చులు భరించబడుచున్నవి. మీకు అనుకూలముగా ఉండునట్లు, సమావేశ స్థలమంతటా స్పష్టంగా గుర్తించబడిన చందాపెట్టెలు ఉంచబడినవి. చందాలన్నియు మెచ్చుకొనబడును. మరియు రాజ్యాసక్తులకై మీరు ఈ విధముగా అందించు ఉదారమైన, ఐక్యమైన మద్దతు కొరకు సొసైటి మీకు ముందుగానే కృతజ్ఞత తెలుపగోరుచున్నది. చందా ఇవ్వవలసిన మొత్తమును గూర్చి సలహా ఇవ్వబడనందుకు ఒక వ్యక్తి తన అభినందనను ఇట్లు వ్యక్తపరచెను: ‘అదిమాకే విడువబడిందని తెలిసికొనుట ఎంతో సౌమ్యముగా ఉన్నది. మా లోతైన అభినందనకు అది విడువబడింది. సామాన్యంగా ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇచ్చుటకు కృతజ్ఞతతో కదిలించబడితిమి!’ ఈ ఖర్చులన్నింటి నిమిత్తము తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తెరిగి తమ పరిస్థితులు అనుమతించుకొలది దీనిలో భాగము వహించి పూర్తి సహకరించగలదని మేము నమ్మకమును కలిగియున్నాము.—లూకా 6:38.
25 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు హాజరుకమ్ము! “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు హాజరై కార్యక్రమునకు శ్రద్ధతో కూడిన అవధానమిచ్చుటద్వారా, క్రీస్తుద్వారా లభించు స్వాతంత్ర్యమును, క్రైస్తవ స్వాతంత్ర్యమును సరిగా ఉపయోగించుటనుగూర్చి మన మెప్పుదలను వృద్ధి చేసికొనగలము. ప్రారంభపు పాటనుండి ఆదివారము మధ్యాహ్నము ముగింపు ప్రార్థనవరకు అన్ని కార్యక్రమములకు హాజరగుటకు పథకములను వేసికొనుము.
[5వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశపు జ్ఞాపికలు
వసతి: సమావేశముద్వారా ఏర్పాటు చేయబడిన వసతిని ఉపయోగించుటలో మీ సహకారము మెచ్చుకొనబడుతుంది. మీ రిజర్వేషన్ రద్దుచేయుట అవసరమని మీరు కనుగొనినట్లయిన, మీ గదిని వేరొకరికి కేటాయించుటకు వీలగులాగున సాధ్యమైనంత ముందుగా హోటల్వారికే నేరుగా వ్రాయుటగాని లేక ఫోన్ చేయుటగాని చేయవలెను.
బాప్తిస్మము: బాప్తిస్మము తీసికొనువారు శనివారపు ఉదయకార్యక్రమమునకు ముందే తమకు సూచించబడిన సీట్లలో కూర్చొనుటకు ప్రయత్నించవలెను. బాప్తిస్మము పొందుటకు వచ్చు ప్రతివ్యక్తి తగినట్లుగా యుండు స్నానపు దుస్తులను, తువ్వాలును తెచ్చుకొనవలెను. ప్రసంగీకుని వలన బాప్తిస్మపు ప్రసంగము మరియు ప్రార్థన అయిపోయిన తరువాత కార్యక్రమ అధ్యక్షుడు బాప్తిస్మపు అభ్యర్థులకు క్లుప్తమైన ఉపదేశములనిచ్చి పాడుటకు పిలుచును. ఆఖరు వచనప్రారంభములో అటెండెంట్స్ బాప్తిస్మపు అభ్యర్థులను బాప్తిస్మపు స్థలమునకు లేదా అచ్చటికి తీసికొనిపోవు వాహనములయొద్దకు నడుపుదురు. మిగిలిన ప్రేక్షకులు పాట పాడుటను పూర్తిచేయుదురు. బాప్తిస్మము వ్యక్తికి మరియు యెహోవాకు మధ్యనుండు సన్నిహితమైన వ్యక్తిగత విషయము గనుక తోటి బాప్తిస్మపు అభ్యర్థులుగా నామకార్థముగా పిలువబడువారు ఒకరు లేక ఇద్దరు బాప్తిస్మమప్పుడు బాప్తిస్మ అభ్యర్థి చేతులు పట్టుకొనియుండుటకును, లేక కౌగిలించుకొనియుండుటకును ఏర్పాటు లేదు.
పయనీరు గుర్తింపు కార్డు: ప్రతి రెగ్యులర్ మరియు స్పెషల్ పయనీర్లు అందరు, ప్రయాణకాపరులు వారి వాచ్‌టవర్ గుర్తింపుకార్డును (S-202) సమావేశమునకు తేవలెను. వారు హాజరగు జిల్లాసమావేశమునకు కనీసము ఆరునెలలకు ముందు పయనీరు లిస్టులో యున్నవారు తమ వాచ్‌టవర్ గుర్తింపు కార్డును చూపించినప్పుడు 60 రూ. విలువగల ఆహార టికెట్లను పొందుదురు. ఇది ఒక్క సమావేశమునకు మాత్రమే. కాబట్టి ఈ కార్డును డబ్బుగా భావించి జాగ్రత్తగా చూచుకొనుము. దానికి బదులు ఇంకొక దానిని సమావేశములో పొందలేవు. బుక్రూమ్లోని పుస్తకములు వారు తమ వాచ్‌టవర్ గుర్తింపు కార్డును చూపినప్పుడు మాత్రమే పయనీరు రేట్లకు ఇవ్వబడును. బేతేలు సేవలోయున్న వారు తమ బేతేలు గుర్తింపుకార్డును చూపి ఈ అనుకూలతను పొందవచ్చును.
స్వచ్ఛందసేవ: జిల్లాసమావేశము మృదువుగా సాగుటకు స్వచ్ఛంద సేవ అవసరము. నీవు సమావేశపు ఒక భాగమున మాత్రమే పనిచేయగలిగినను అదియు మెచ్చుకొనబడును. నీవు సహాయపడగలిగినట్లయిన సమావేశమునకు వచ్చిన దినమున స్వచ్ఛందసేవా డిపార్టుమెంటుకు రిపోర్టుచేయుము 16 సంవత్సరముల వయస్సులోపు పిల్లలను సమావేశ విజయమునకు దోహదపడవచ్చును. అయితే వారు తల్లి లేక తండ్రి లేదా ఒక బాధ్యతగల పెద్దవ్యక్తితో పనిచేయవలెను.
లేపల్ కార్డులు: దయచేసి ప్రత్యేకముగా తయారుచేయబడిన లేపెల్ కార్డును సమావేశమందును సమావేశమునకు వచ్చిపోవునప్పుడు ప్రయాణమందును ధరించుకొనుము. తరచు ఇది మన ప్రయాణమందు మంచి సాక్ష్యమిచ్చుటకు సాధ్యపరచును. ఆ లేపెల్ కార్డులు సమావేశమునందు లభ్యము కావు. కాబట్టి మీ సంఘము ద్వారా వాటిని పొందవలయును. లేపెల్ బ్యాడ్జ్ హోల్డరులను సంఘములు ఆర్డరు చేయవలెను. అయితే లేపెల్ కార్డులు సంఘములకు సొసైటిచే పంపబడును. హోల్డరు విలువ 1 రూ. మరియు కార్డు విలువ 20 పైసలు.
హెచ్చరిక మాటలు: మీ వాహనమును ఎక్కడ నిలిపినను అన్ని సమయములలో మీరు దానికి తాళము వేయవలెను. బయటకు కనిపిస్తుయుండు దేనిని ఎప్పుడును లోపల వదిలివుంచకుము. సాధ్యమైన మీ సామానును ట్రంక్లోపల పెట్టి తాళము వేయుము. పెద్ద కూటములను చూచి ఆకర్షింపబడు దొంగలు, జేబు దొంగలనుగూర్చి జాగ్రత్తపడుము. విలువైన వాటిని గమనించకుండా సీట్లపై వదలి వెళ్లకుండుటయు ఇందు ఇమిడియున్నది. దయచేసి జాగ్రత్తగా యుండుము.
కొన్ని హోటళ్లు అవినీతికరమైన లేక లైంగిక సంబంధమైన టెలివిజన్ సినిమాలకు సులభముగా వీలు కల్పించునని రిపోర్టుచేయబడినది. కాబట్టి పిల్లలు లాడ్జింగ్ స్థలములలో వెళ్లి దూరదర్శిని చూచుటను ఒక కంట కనిపెట్టవలెనని ఇది ఉన్నతపరచుచున్నది.
1991-92 జిల్లాసమావేశపు పాట నెంబర్లు
ఉదయం మధ్యాహ్నము
శుక్రవారము 19 (90)a 172 (92)
34 (8) 85 (44)
శనివారము 117 (65) 155 (49)
121 (68) 113 (62)
13 (82) 105 (46)
ఆదివారము 215 (117) 53 (27)
174 (78) 191 (9)
10 (80) 212 (110)
a బ్రాకెట్లలో చూపబడిన పాట సంఖ్యలు 1996 సంవత్సరపు పాటల పుస్తకమును ఉపయోగించు కేరళ సమావేశములకు మాత్రమే. మిగిలిన సమావేశములు 1984 సంవత్సరపు పాటల పుస్తకమును ఉపయోగించును.