1992 “వెలుగు ప్రకాశకుల” జిల్లాసమావేశము
1 యేసు తన అనుచరులు “లోకమునకు వెలుగైయున్నార”ని చెప్పెను. (మత్త. 5:14) అందుకు భిన్నంగా లోకపు ఆత్మీయ, నైతిక అంధకారము దినదినమునకు పెరుగుచున్నది. (యెష. 60:2; రోమీ. 1:21) ఈ విధానపు అంతమునకు మనము సమీపించేకొలది లోకమునకు వెలుగైయున్నవారముగా మన బాధ్యత ఎక్కువ అర్ధవంతముగా తయారౌవుతుంది. మనము పోషించవలసిన ప్రముఖ పాత్రను గుర్తించువారమై ఎంతో ఆశతో 1992 “వెలుగు ప్రకాశకుల” జిల్లాసమావేశమునకు హాజరగుటకు ఎదురు చూస్తున్నాము. ఈ సమావేశ పరంపర మొదటగా సెప్టెంబరు, శుక్రవారము 11న ప్రారంభమౌతుంది.
2 మూడు దినముల సమావేశము: ఈ సంవత్సరము ఇండియా కొరకు 31 సమావేశములను ఏర్పాటుచేసియున్నారు. కార్యక్రమము శుక్రవారము ఉదయం 10.20 గం. ప్రారంభమై, పాట మరియు ప్రార్థనతో ఆదివారం షుమారు 4:15 గం. లకు ముగియును. ఉదయం 7:30 గం. తలుపులు తెరుస్తారు. అయితే ఆ సమయంలో కేవలము పనికి నియమించబడినవారు మాత్రమే లోపలికి ప్రవేశించుటకు అనుమతించబడుదురు. యెహోవా ప్రజలైన వారందరు కార్యక్రమమంతటికి హాజరుగు టకు కోరుకొనవలెను. మూడు దినములలో పూర్తి సమయమునకు హాజరుకావలెనని మీరు వ్యక్తిగత నిర్ణయముచేసికొన్నారా? మీ ప్రయత్నములపై యెహోవా దీవెనలు ఉండులాగున కచ్చితంగా ప్రార్థన చేయండి.
3 శుక్రవారం ఉదయం ప్రారంభపు ప్రసంగంనుండి ఆదివారం మధ్యాహ్నం ముగింపు వ్యాఖ్యానముల వరకు, కార్యక్రమమంతటికి మనము విశేషావధానమును ఇవ్వాలి. ప్రసంగములు, ప్రదర్శనలు, ఇంటర్వూలు మరియు డ్రామాలో పులకరింపజేయు సమాచారము వివరించబడి అందించబడును. శుక్రవారం కార్యక్రమము ప్రారంభమగుటకు బాగా ముందుగానే మీ సీట్లలో కూర్చొను ఏర్పాట్లుచేసికొనండి. సాధారణంగా మొదటిరోజున వాహనాన్ని నిలుపుకొనుట, సీట్లను వెదుక్కొనుట మొదలగు వాటికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అలాంటివాటికి తగినంత సమయం ఉండులాగున చూసుకొనండి. కార్యక్రమ భాగమంతటిని వింటూ, ముగింపు పాట మరియు ప్రార్థనకు ఉండుటవలన కార్యక్రమమునుండి పూర్తి ప్రయోజనము పొందుతూ, వెలుగు ప్రకాశకులుగా మనకుగల ఆధిక్యతయెడల మెప్పుచూపెదము.
4 మీ చెవిని అవధానముతో విననివ్వండి: గాయకుడు ఇలా ఉద్ఘాటించాడు: “నీ శాసనములను తలపోయుదును. నీ ధర్మశాస్త్రము నా కెంతో ప్రియముగా నున్నది. దినమెల్ల నేను ధ్యానించుచున్నాను.” (కీర్త. 119:95బి, 97) యెహోవాచేత ఉపదేశము పొందటానికి కూడుకొనినప్పుడెల్ల, మనము అవధానమును నిలిపి చెవితో వినడమేగాక హృదయముతో కూడా వినాలి. అయినా, జిల్లాసమావేశములవంటి పెద్దసమావేశములకు హాజరవుతున్నప్పుడు దీని అవసరత ఎంతో ఉంటుంది. కండ్లతో చూడటానికి, చెవులతో వినటానికి ఎంతో ఉంది. మనము సమావేశానికి హాజరయ్యేందుకు సమయాన్ని, డబ్బును ఖర్చు పెట్టుకొని వెళ్తూ, వెలుగు ప్రకాశకులుగా మనమెట్లు అభివృద్ధిచెందగలమో వివరించు మంచి అంశాలను ఏమాత్రము గుర్తుచేసికోలేకపోయిన అది వ్యక్తిగతంగా ఎంత నష్టము! కార్యక్రమమునుండి మనము పూర్తిగా ప్రయోజనము పొందాలంటే మన అవధానమును ప్రక్కకు మరల్చే వాటిని నిరోధించటానికి శక్తికొలది ప్రయత్నించాలి. సమావేశ కార్యక్రమ ముగింపులో అందులోని సమాచారమంతా మన హృదయంలోకి, మనసులోకి లోతుగా నాటుకుపోయిందని మనమెలా నిశ్చయించుకోగలము?
5 వినుటయనేది వృద్ధిచేసికొని, అభ్యాసం చేయవలసిన కళ. “వినుట” అనే పదానికి “ఆలోచనతో శ్రద్ధగా ఆలకించుట” అనే అర్థముంది. ఇందుకు కొన్ని సూచనలను గమనించండి: (1) బాగా విశ్రాంతి తీసికొని ప్రతి ఉదయం సమావేశ స్థలమునకు రండి. ఇందుకు పథకము, కుటుంబ సహకారము అవసరము. నిద్రసరిగా లేనందువలననో, లేక ఉదయకాల అల్ఫాహారము తినక ఆకలిగొంటేనో, లేక తొందరవలన మీ నరాలు ఉడికిపోతుంటే మీరు కార్యక్రమమునుండి ఎక్కువ ప్రయోజనము పొందలేరు. (2) అంశము ఎలా వివరించబడుతుందనే విషయంలో ఎదురుచూడగలిగే ఆశను కలుగజేసుకోవాలి. సమావేశమునకు కొన్ని వారములముందు మీ కుటుంబ పఠనములో భాగంగా మీరెందుకు ఒక్కొక్క సభ్యుడు వెలుగు ప్రకాశకునిగా తన బాధ్యత ఏమైయుందో వ్యాఖ్యానించకూడదు. సమావేశములో ఉన్నప్పుడు కార్యాక్రమము ప్రారంభం కాకముందే ఆ దిన కార్యక్రమ భాగాన్ని ముందే చూసి దానిపై తలంచండి. (3) తగువిధంగా వస్త్రధారణ చేసికొనండి. కార్యాక్రమం జరిగే సమయంలో తినటం, త్రాగటం చెయ్యొద్దు. కొంతమంది ఆడిటోరియంలోని కూర్చొనే స్థలాలలో తింటూ ఉండటం, త్రాగుతుండటం గమనించబడింది. అది అగౌరవమైనది, ఇతరుల అవధానాన్ని ప్రక్కకు మరలించేదై, ఆశానిగ్రహం లేదని ప్రదర్శిస్తుంది.—ది వాచ్‌టవర్ నవంబరు 15, 1991, పేజీలు 8-18 చూడండి.
6 నోట్సు వ్రాసుకొనే విషయానికి మనం ప్రత్యేకంగా శ్రద్ధనివ్వ గోరుతాం. సరియైనరీతిగా అలాచేస్తే, అది ప్రసంగీకులు చెప్పేదాన్ని జాగ్రత్తగా వింటూ, వినేదాన్ని భధ్రపరచుకొనటానికి వీలవుతుంది. మనం మాట్లాడేదానికంటే నాలుగురెట్లు వేగంగా తలస్తువుంటాము కాబట్టి మనస్సు అటుఇటు తిరుగకుండ ఉంచుకొనుటకు నోట్సు వ్రాసుకొనుట శ్రేష్టమైన మార్గము. ఒక రచయిత ఇలా అన్నాడు: “ఒక ప్రసంగాన్ని ఇవ్వటం కన్నా వినటం కష్టం.” మీకు గుర్తుకు రావచ్చు, తొలిక్రైస్తవులు కూటములకు వెళ్లునప్పుడు, వారితోపాటు పగిలిన కుండపెంకులను తీసుకెళ్లి వాటిపై సిరాతో లేఖనములు వ్రాసుకొనేవారని ప్రసిద్ధికెక్కారు. కాబట్టి, మనము కూడా ఒక తగుమాత్రపు నోట్‌బుక్, పెన్ను లేక పెన్సిల్ తీసుకెళ్లి అలాగే చేయవచ్చు. నేర్పుగా నోట్స్ వ్రాసుకొనుటయంటే ముఖ్యమైన తలంపులను గుర్తుగా వ్రాసుకోవడమేగాని, అదేపనిగా మరి విస్తారంగా వ్రాసుకోవటం అని కాదు. అలాచేస్తే, మన అసలు సంకల్పమంతా విఫలమై, ప్రసంగీకుడు చెప్పే ప్రాముఖ్యమైన అంశాలను పోగొట్టుకొనేలా చేస్తుంది. కీలకమైన పదాలను వ్రాసుకొనండి. క్లుప్తంగా సంకేతాక్షరాలను ఉపయోగించండి. అదే సాయంకాలము మరియు సమావేశ కార్యక్రమ ఉన్నతాంశములను సంఘ సేవాకూటములో చర్చించే ముందు ఆనోట్స్‌ను పునఃసమీక్షించుట ఎంతో ఫలవంతముగా ఉండగలదు.
7 హృదయపూర్వకమైన పాట మరియు ప్రార్థన: యెహోవాకు స్తుతికీర్తనలు పాడుట, గౌరవపూర్వకంగా ఆయనను ప్రార్థనలో సమీపించుట మన ఆరాధనలో అంతర్గత భాగమైయున్నవి. (2 దిన. 30:21, 27) ఇవి మనమందరము పాల్గొనగల సమావేశ ప్రముఖ ఆకృతులు. “వెలుగు ప్రకాశకుల” మన జిల్లాసమావేశపు మూడు దినములలో యెహోవాకు స్తుతిగా మనమందరము 18 పాటలను పాడుదుము. మన పరలోకపు తండ్రియైన యెహోవాకుచేసే ఎనిమిది ప్రార్థనలలో ఐక్యమగుదుము. ఇవి నిజంగా అమూల్యమైన ఆధిక్యతలు. యెహోవా మనకు 12 గంటల ఆత్మీయ విద్యను, తర్ఫీదును ఇస్తున్నాడు. పాటకు, ప్రార్థనకు కేటాయించబడిన కొద్దినిముషములలో యెహోవా మనకిచ్చిన ఉదార వరములకై వందనములు చెల్లిస్తూ, ఆయనను స్తుతిస్తున్నాము. మనము ఒక సమాజముగా కూడిన ప్రజలముగా ప్రార్థనలో యెహోవా సన్నిధికి వస్తున్నందున, కేవలం సరైన పథకములేనందుననే పాట మరియు ప్రార్థనలలో ఏకముకాలేక ఆయనచేత స్వార్థపరులుగాను, కృతజ్ఞతలేనివారముగాను చూడబడగోరుదుమా? మరల, ఈ సంవత్సరము కార్యక్రమము పూర్తిగా ముగిసేంతవరకు తమ సీట్లలోనే సరైన రీతిగా కూర్చొనువారు సాహిత్యములను పొందునట్లు ఈ సంవత్సరపు సమావేశములలోకూడా సాహిత్యపు సరఫరాలు సమృద్ధిగా ఉండవలెను. అలాగే, ఎవరూ కూడ ఇతరులకంటె ముందుగా భోజనం కొరకు కార్యక్రమము పూర్తికాకముందే ఆహార సరఫరాచేయబడు వరుసలోవచ్చి నిలువబడకూడదు.—మత్త. 7:12; రోమా. 12:10; ఫిలి. 2:1-4.
8 సమస్తము దేవుని మహిమకొరకు చేయుడి: ప్రతి సంవత్సరం సమావేశం వద్ద మనము కలిగి ఉండవలసిన మంచిమర్యాదలు యుక్తమైన ప్రవర్తనను గూర్చి దయతోకూడిన జ్ఞాపికలు ఇవ్వబడుతున్నవి. ఈ జ్ఞాపికలను జాగరూకతో మనసుపెట్టి పాటిస్తున్నందుకు అనేకులను మెచ్చుకొనవలసి ఉన్నాము. ఈ విధానము దాని అంతమునకు సమీపిస్తుండగా, మనము అంతకంతకు పనిచేసేచోట, లేక పాఠశాలవద్ద 2 తిమోతి 3:1-5 లో ప్రవచింపబడినలాంటి ప్రవర్తనగల ప్రజలతో మనము కలియువత్తిడికి యింకా లోనవుతున్నాము. మనము జాగ్రత్తగా రక్షణ ఏర్పాటును చేసికొనకపోతే ఈ సహవాసము మనపై హానికరమైన ప్రభావమును చూపగలదు. ఇతరులు ‘మనలను కీడుచేయువారు’ అని మాట్లాడుటకు మనమెన్నటికి అవకాశమివ్వకూడదు. (1 పేతు. 2:12) అనగా దీనికొరకు మనము మన క్రైస్తవ వ్యక్తిత్వం విషయంలో అసాధారణమైన శ్రద్ధనివ్వాల్సి ఉంది. ప్రతిఒక్కరు సమావేశమువద్ద, లేక ఇతర రెస్టారెంటులు, హోటల్స్ మొదలగు బహిరంగ స్థలాలలో తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు వారి సహోదరులందరి గూర్చి శ్రద్ధకలిగియున్నారు. (ఫిలి. 2:4) వారు వారికి సహాయకరంగా ఉంటూ, వారి మంచి ప్రవర్తననుబట్టి ఇతరులను మెచ్చుకుంటారు. పెద్దలకు వ్యక్తిగతంగా ఒక సహోదరుడు లేక సహోదరి తెలియక పోయినప్పటికిని అవసరమైతే ప్రేమగల హెచ్చరికనివ్వటానికి వారు స్వేచ్ఛగా ముందుకెళ్లాలి. ఏవైన గంభీరమైన సమస్యలను గుర్తించినట్లయిన వాటిని సమావేశపు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో తెలియపరచాలి.
9 మనము ఇంకా వేటిని మనసులో ఉంచుకొనాలి? హోటలు సిబ్బందిని గౌరవముగాను, ఘనంగాను చూడాలి. రూమింగ్ డిపార్టుమెంటు ఎంతో కష్టపడి సాధారణ ధరలకంటె ఎంతో తక్కువ ధరకు ఆ గదులను సంపాదించారు. మనము అధికంగా కోరువారమైనా, లేక గదిని అసహ్యకరంగా విడిచి వెళ్లువారమైన హోటలు నిర్వాహక యాజమాన్యము మన భవిష్యత్తు సమావేశములకొరకై యెహోవాసాక్షులకు వాటిని ఇవ్వక పోవచ్చును. ఈ విషయంలో మనలో కొంతమందికి ఇంకా జ్ఞాపకం చేయవలసిన అవసరత కనిపిస్తుంది. కొద్దిమందే అనేకమంది పేరును చెడగొట్టగలరు.
10 హోటలు సిబ్బంది చేసిన సేవలకు ప్రతిఫలంగా బహుమానములనిచ్చే విషయంలో మన రాజ్య పరిచర్య జూలై 1991లో వివరించబడింది. వాటిలో ముఖ్యమైన విషయాలను దయచేసి పునఃసమీక్షించండి.
11 ఎఫెసీయులు 4:24లో తెలుపబడిన నవీన స్వభావము, పాత స్వభావమును విడిచిపెట్టిన తర్వాత ఒకడు వేసికొనే వస్త్రానికి పోల్చబడింది. వ్యక్తిత్వములోని ఈ మార్పు మన భౌతిక దుస్తులను వేసుకొనే విషయంలోను ప్రతిబింబించాలి. కొంతమంది సహోదర సహోదరీలు, ప్రత్యేకంగా యౌవనస్థులు, చాలా సాధారణమైన, చివరకు కొన్నిసార్లు అమర్యాదకరమైన దుస్తులను ధరించటం గమనించబడింది. కొంతమంది తమ బూట్లను విప్పి తమ ముందున్న సీట్లపై కాళ్లుపెట్తున్నారు. రాజ్యమందిరములోను మనం ఇలాగే ప్రవర్తిస్తామా? కొంతమంది బాప్తిస్మము తీసికొను అభ్యర్థులు లోక సంబంధమైన నినాదములు లేక లోకసంబంధమైన వ్యాపార ప్రకటనలుగల T-షర్టులను ధరించారు. పెద్దలు బాప్తిస్మమునకు సిద్ధపడువారితో ప్రశ్నలను పునఃసమీక్షించునప్పుడు, బాప్తిస్మము తీసికొనబోవువారు, ఆ సమయానికి వేసికొను తగిన దుస్తులనుగూర్చి వారు ఖచ్చితంగా తెలిసికొనునట్లు చూడవలెను.—ది వాచ్‌టవర్ జూన్ 1, 1985, పేజీ 30, ఏప్రిల్ 15, 1973, పేజిలు 254-5.
12 రికార్డుచేసికొనే పరికరములు: వీడియో కెమెరాలను ఉపయోగించడం అనుమతించబడుచున్నప్పటికిని, వాటిని ఉపయోగించువారు ఇతరులను గూర్చి తలంచువారై, వారు ఎన్నదగినవాటినే టేపుచేస్తూ, తింటున్నప్పుడు, కార్యక్రమం వింటున్నప్పుడు, ప్రార్థనా సమయాల్లో తమను ఫొటో తీయుటకు ఇష్టపడనివారి కోరికను గౌరవించవలెను. వీడియోటేపు తీయువారేగాని లేక కేసెట్ రికార్డు చేసికొనేవారేగాని ఇతరులకు ఆటంకము కలుగజేసి, వారి అవధానమును ప్రక్కకు మళ్లించకూడదు. మీరు సీట్లలోనే కూర్చొని కార్యక్రమంను రికార్డుచేసుకొంటే అభ్యంతరమేమి లేదు. కానీ, కార్యక్రమం జరుగుతున్నప్పుడు, టేపు తీసుకుంటూ ప్రేక్షకుల ముందు, సీట్లమధ్యలోనున్న దారులలో తిరుగుట భావ్యం కాదు. ఈ విషయంలో సహోదర ప్రేమను కనపరచనివారితో అవసరమైతే, అటెండెంట్సు మాట్లాడవలెను. దయచేసి ఏవిధమైన కెమెరాలనేగాని, లేక రికార్డింగ్ పరికరములనేగాని సమావేశములోని సౌండ్ సిస్టమ్‌కేగాని, లేక ఎలక్ట్రికల్‌కేగాని కనెక్టుచేయకూడదు. లేక వీటిని సీట్లమధ్యలోగల దారులలో లేక ప్రజలు తిరిగే ప్రాంతాలలోగాని ఉంచకూడదు.
13 తల్లిదండ్రుల కొరకు: తల్లిదండ్రులు అన్ని సమయాల్లో, అనగా సమావేశం వద్దనేగాని, లేక హోటల్లోనేగాని తమ పిల్లలను గమనిస్తూనే ఉండాలని మేము గుర్తుచేయగోరుతున్నాము. (సామె. 29:15బి; లూకా 2:48) కార్యక్రమం జరుగుతున్నప్పుడు, మీ పిల్లలు జాగ్రత్తగా అవధానమును నిలుపుతూ, నోట్స్ తీసుకొంటూ ఉండులాగున కచ్చితంగా చూడండి. విరామ సమయములలో ఇతర సంఘాలనుండి వచ్చిన స్నేహితులను కలిసికొనవచ్చును.
14 ఎప్పుడూ మనపిల్లలు ఎక్కడుంటున్నారో తెలిసికొను ప్రాముఖ్యతను వివరించుటకు ఈ విషయమును గమనించండి. ఒక టాక్సి డ్రైవరు సమావేశం దగ్గరనుండి ఇద్దరు బాలికలను ఎక్కించుకొని వెళ్లాను అని ఒక సహోదరునికి అతడు తెలియజేశాడు. వారిద్దరు మధ్యాహ్న కార్యక్రమ భాగాన్ని విడిచిపెట్టి అలావెళ్లారు. వారు ఆ డ్రైవరుతో ఈ సంగతి మా అమ్మకు సాయంకాలము 5 గం. వరకు తెలియదని చెప్పారు. ఈ టాక్సి డ్రైవరు వారి క్షేమంగూర్చి ఎంతో చింతించాడు, గాని వారి తల్లి సంగతేమి? వారికేదైన ఘోరం జరిగివుంటే అదెంత దుఃఖకరమోగదా, అది దేవునికి, దేవుని ప్రజలకు ఎంత చెడ్డపేరు తెచ్చేది!
15 మీ పూర్తి సహకారము మెచ్చుకొనబడుతుంది: సంఘము నియమించబడిన ప్రాంతంలోనే జిల్లాసమావేశమునకు హాజరై, మనలో ప్రతివారము సొసైటి నడిపింపుయెడల మెప్పును ప్రదర్శించుట ఎంతప్రాముఖ్యము? సొసైటి మరియు బాధ్యతగల సహోదరులు ఎంతో జాగ్రత్తగా ప్రతి సమావేశ పట్టణంలోను సమావేశాన్ని సిద్ధపరుస్తారు. అందులో తగినంతగా సీట్లు, ఆహారము, సాహిత్యము ఏర్పాటుచేయడం ఇమిడివుంది. వారు నియమించబడని ప్రాంతాలలో ఎక్కువ మంది సహోదరులు హాజరైతే కష్టమైన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. చాలావరకు ఎక్కువమందికి మరో ప్రాంతంలోని సమావేశానికి హాజరయ్యే పరిస్థితి ఉండదు. ఇతర ప్రాంతంలో ఏర్పాటుచేయబడిన సమావేశం అనేక కారణాలనుబట్టి ఎక్కువ ఆకర్షణీయంగా కన్పించవచ్చును. అయితే ఎక్కువ శాతంమంది సహోదరులు వారివారి ఎన్నిక ప్రకారం సమావేశములకు హాజరైతే, గలిబిలితోకూడిన పరిస్థితులు ఏర్పడగలవు.
16 సీట్లను భద్రపరచుకొనే విషయంలోకూడ మీ సహకారం కోరబడుతుంది. దయచేసి మీ స్వంత కుటుంబ సభ్యులకు లేక మీతోపాటు ప్రయాణంచేసిన వారికొరకు మాత్రమే సీట్లను భద్రపర్చవచ్చని జ్ఞాపకముంచుకొనండి. అన్ని సమావేశాలలో వృద్ధులకు, అంగవికలులకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయబడును. దయచేసి అటెండెంట్లు ఇచ్చు నడిపింపును, గుర్తులను జాగ్రత్తగా అనుసరించండి. వృద్ధులకొరకు ఏర్పాటుచేసిన విభాగంను యౌవనులు ఆక్రమించుకొన్నందువలన వృద్ధులైనవారు త్వరగా లోపలికి వెళ్లలేని సీట్లయొద్దకు వెళ్లవలసివచ్చెను. దయచేసి వృద్ధులవిషయంలో శ్రద్ధకలిగివుండండి. అలర్జీలు మొదలగు సమస్యలుగలవారికి ప్రత్యేక ప్రాంతాలను లేక గదులను ఏర్పాటుచేయటానికి సాధ్యంకాదని తెల్పుటకు మేము చింతిస్తున్నాము.
17 సాధ్యమైనంతవరకు మీరు సమావేశ స్థలానికి తెచ్చుకొనే వ్యక్తిగత వస్తువులను తగ్గించుకోవాలని సూచించబడుతుంది. మీరు తెచ్చుకొనే ఒక వస్తువు సీటు క్రింద పట్టదనుకుంటే దాన్ని ఇంటిదగ్గరే విడిచిరావటం మంచిది. భద్రతా దృష్ట్యా పెద్దపెద్ద కూలర్లను సీట్లమధ్యగల దారులలో పెట్టుకొనుటకు అనుమతించబడరు. వాటిని మీ సీటుకు ప్రక్కగా పెట్టుకొంటే, మరొకరికి సీటు లేకపోవచ్చును.
18 అంచనావేయబడిన హాజరుకు కావలసినంత భోజనం ప్రతి సమావేశంలో ఏర్పాటుచేయబడుతుంది. యౌవనులతో సహా ప్రతివారు ప్రతి భోజనానికి వారికి కావలసినంతే తీసుకుంటే, అందరికి సరిపోతుంది. దయచేసి మీకు మీకుటుంబానికి సరిపడునంత మేరకే భోజనమును తీసుకొనండి. భోజనమును సమావేశం వద్దకాకుండా, మరోచోట ఆ తరువాత తినటానికి తీసుకెళ్లవద్దు. ప్రతిరోజు సాయంకాలం భోజన సరఫరా అయిన తర్వాత అదనంగా మిగిలిన భోజనము లేక ఆదివారం సాయంకాలం సమావేశ ముగింపులో అందరికి సరిపోగా మిగిలిపోయిన భోజనమునకు ఇది వర్తించదు.
19 అవసరమైనంతకంటే ఎక్కువగా వేయించుకున్నవారు మిగిలిన భోజనమును బుట్టలలో పడవేయటం కూడా జరిగింది. మొదట తగుమాత్రం వేయించుకొని తరువాత, మరలా ఏమైన అవసరమైతే ఇతరులందరికి వడ్డించిన తరువాత తిరిగి వేయించుకొనవచ్చును. ప్రాథమిక భోజన అవసరతలను సాధ్యమైనంతమేరకు అనుకూలంగా ఉండునట్లు సమావేశము ఏర్పాటుచేయును.—ది వాచ్‌టవర్ నవంబరు 15, 1991, పేజి 11, పేరాలు 13, 14 చూడండి.
20 సిద్ధముచేయబడిన ఆత్మీయ కార్యక్రమమునుండి ప్రయోజనము పొందుటకు మంచి సౌకార్యాలయందు సమకూడుటను యెహోవా ప్రజలు మెచ్చుకుంటారు. అలాంటి సమావేశాలలో అందించబడు సేవలను, సౌకర్యాలను మనముకూడా మెచ్చుకుంటాము. సొసైటి ఎంతో శ్రద్ధతో, తగినంత ఖర్చును భరించి కావలసినంతగా సీట్లను, మంచి సౌండ్ సిస్టమ్‌ను, సమర్ధవంతంగా పనిచేయు ఆహార సేవా విభాగాన్ని ఏర్పాటుచేస్తూ, సమావేశానికి హాజరగుట ఆనందదాయకంగాను, ఆత్మీయ విశ్రాంతిదాయకంగా ఉండునట్టి సేవలకు ఏర్పాట్లు చేయబడినవి.
21 “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశమునకు హాజరు కండి. వెలుగు ప్రకాశకుల జిల్లా సమావేశమునకు హాజరగుట ద్వారా వెలుగు ప్రకాశకులముగా ఉండుట ఎందుకు గొప్ప ఘనత మరియు ఆధిక్యతైయున్నదో వినుటకు మనము పులకరించి పోదుము. అది గంభీరమైన బాధ్యత అనే సంగతికూడ మన దృష్టికి తేబడును. సమావేశములో చెప్పబడువాటియెడల అసాధారణమైన అవధానమును నిల్పుటద్వారా వెలుగు ప్రకాశకులుగా మనము కలిగియున్న పాత్రలో నేర్పును మరియు మెప్పును అభివృద్ధిచేసుకొందుము. శుక్రవార ప్రారంభపు పాటనుండి ఆదివారం మధ్యాహ్నం ముగింపు ప్రార్థనవరకు అన్ని కార్యక్రమ భాగాలకు హాజరుగుటకు ఇప్పుడే మీ పథకములను వేసికొనండి.
[5వ పేజీలోని బాక్సు]
జిల్లాసమావేశ జ్ఞాపికలు:
వసతి: సమావేశమునందు ఏర్పాటుచేయబడిన వసతి సౌకర్యములను ఉపయోగించుటలో మీ సహకారము బహుగా మెచ్చుకొనబడును. మీ రిజర్వేషన్ రద్దుచేయగోరినయెడల, హోటల్‌కు నేరుగా వ్రాయవలెను, లేదా ఫోను చెయ్యండి. ఆవిధంగా చేసేటప్పుడు ఆ వసతిని వేరే వారికి కేటాయించ వీలగునట్లు సాధ్యమైనంత ముందుగా తెల్పాలి.
బాప్తిస్మము: శనివారం ఉదయకాల కార్యక్రమము ప్రారంభం కాకమునుపు బాప్తిస్మము పొందగోరు సభ్యులు తమకు నిర్దేశించబడిన సీట్లలో కూర్చొనవలెను. బాప్తిస్మము పొందబోవువారు మర్యాదకరమైన దుస్తులను టవలును తీసుకురావలెను. బాప్తిస్మప్రసంగము, ప్రసంగీకునిచే చేయబడు ప్రార్థన అయిన తరువాత కార్యక్రమ అధ్యక్షుడు బాప్తిస్మ సభ్యులకు క్లుప్తమైన ఉపదేశమునిచ్చును. అటుపిమ్మట పాటపాడుటకు ఆహ్వానించును. ఆఖరి చరణము అయిన తరువాత బాప్తిస్మపు సభ్యులను బాప్తిస్మం తీసుకొనే స్థలమునకు లేదా అచ్చటికి వారిని చేరవేయు వాహనములయొద్దకు అటెండెంట్లువారిని నడిపిస్తారు. ఒకని సమర్పణకు సూచనయైన బాప్తిస్మము ఒక వ్యక్తికిని యెహోవాకును మధ్య సన్నిహితమైన వ్యక్తిగత విషయము గనుక, ఇద్దరు లేక ముగ్గురు బాప్తిస్మ సభ్యులు ఒకరినొకరు పట్టుకొని లేదా చేతులు కలిపి బాప్తిస్మము తీసుకునే సహవాసుల బాప్తిస్మములకు తావులేదు.
స్వచ్ఛంద సేవ: జిల్లాసమావేశములు చక్కగా నిర్వహించబడుటకు స్వచ్ఛంద సేవకుల సహాయము అవసరము. సమావేశములో ఏ ఒక్క భాగమందో పనిచేయగల్గితే కూడా మీ సేవలు మెచ్చుకొనబడును. మీరు తోడ్పడగోరినయెడల సమావేశమునకు మీరు వచ్చినప్పుడు స్వచ్ఛంద సేవా డిపార్టుమెంటునకు దయచేసి తెల్పండి. 16 సంవత్సరముల లోపు వయస్కులైన పిల్లలు కూడా సమావేశము విజయవంతమగుటకు తోడ్పడవచ్చును. అయితే వారు తమ తల్లిదండ్రులలో ఎవరితోనైనను లేదా బాధ్యతగల పెద్దవారితో పనిచేయవలెనని కోరబడుచున్నారు.
బ్యాడ్జి కార్డులు: దయచేసి సమావేశమునకు వెళ్లేటప్పుడు, తిరిగివచ్చేటప్పుడు, ప్రత్యేకంగా తయారుచేయబడిన బ్యాడ్జికార్డులను ధరించండి. ప్రయాణం చేసేటప్పుడు మంచి సాక్ష్యమియ్యటానికి ఇది తరచు వీలయ్యేలా చేస్తుంది. సమావేశ ప్రతినిధివని స్పష్టంగా వ్రాయబడివున్న బ్యాడ్జికార్డును ధరించుట, సాధారణ రీతిగా ఏర్పాటుచేయబడిన భోజన ఏర్పాటు నిర్వాహణ సులభతరమవుటకు సహాయపడుతుంది. బ్యాడ్జికార్డులను మీ సంఘముద్వారా పొందవలసిందేగాని, అవి సమావేశములవద్ద లభ్యం కావు.
హెచ్చరిక: మీ వాహనములను ఎక్కడ పెట్టినప్పటికిని ఎల్ల వేళల వాటికి తాళంవేయండి, వాటిలో కన్పించేరీతిగా ఏమియు విడువవద్దు. సాధ్యమైతే మీకు సంబంధించిన వస్తువులను లోపలపెట్టి తాళంవేయండి. పెద్ద సమాజములకు వచ్చే దొంగలు, జేబు దొంగల బారినుండి కాపాడుకోండి. సమావేశములందు సీట్లలో విలువైన వస్తువులను విడువకుండుట కూడా యిమిడియున్నది. యౌవన పిల్లలను సమావేశ ప్రాంతమునుండి ఎరచూపి తీసుకొని పోయేందుకు ప్రయత్నించుచున్న అక్రమకారులను గూర్చిన కొన్ని నివేదికలున్నవి. జాగ్రత్త. కొన్ని హోటళ్లలో అవినీతితోకూడిన టెలివిజన్ చిత్రములను లేదా అశ్లీల చిత్రాలను ప్రదర్శిస్తున్నారని నివేదించబడినవి. ఈ లాడ్జింగ్ స్థలాల్లో పిల్లలు టి.వి.,ని చూచుటను పర్యవేక్షించాలని చూపుచున్నది.
కార్యక్రమ ఆరంభ సమయములనుగూర్చి మరి యితర సంబంధిత విషయాలను గూర్చి కొందరు సహోదరులు, ఆసక్తిగల వ్యక్తులు సమావేశ ప్రదేశ యజమానులకు ఫోనుచేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మీరు ఆశించిన సమాచారమును దివాచ్‌టవర్ లేదా మనరాజ్యపరిచర్యలో కనుగొనక పోతే ప్రతి సంఘ కార్యదర్శియొద్దనున్న ఫైలులో నుండు సమావేశ చిరునామాకు మీరు వ్రాయవలెను.