సువార్తనందించుట—బైబిలు పఠనముల ద్వారా
1 గత సేవా సంవత్సరములో ఇండియాలో ప్రతినెలకు 6,200 బైబిలు పఠనములు జరుపబడినవి. బహుశా, 8,784 మంది రాజ్య ప్రచారకులలో దాదాపు సగము మంది సంతోషదాయకమైన ఈ పనిలో కొంతభాగమును కలిగియున్నారు. ఒకవేళ ప్రచారకులలో సగము మంది ఈ పనిలో భాగము వహించిన తక్కిన సగముమంది ఈ పనిలో భాగము వహించలేదని దాని భావము. ఇతరులకు సత్యమును బోధించుటనుండి వచ్చు ప్రత్యేకమైన తృప్తిని మనలో ఎక్కువమందిమి ఎట్లు అనుభవించగలము?
2 మనము దేవునిని పొరుగువారిని ప్రేమించుచున్నాము గనుక సత్యమును ఇతరులతో పంచుకొనెదము. అయితే మన పరిచర్యలో యెహోవానుండి మనకు సహాయమవసరమైయున్నది. (1 కొరిం. 3:6, 7) అందువలన ఒక బైబిలు పఠనమును ప్రారంభించుటకు ప్రార్థనలో యెహోవా దేవుని సమీపించి ఆయన సహాయమునకై అడుగుట యుక్తముకాదా? (1 యోహాను 5:14, 15) ఆ తరువాత మనము కోరిన దానికనుగుణ్యముగా మన పరిస్థితులు అనుమతించినంతవరకు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొని, అవకాశము వచ్చినపుడెల్లా బైబిలు పఠనమును అందించవలెను.
అనేకమైన తరుణములు
3 గత కొద్ది సంవత్సరములలో జనులకు వేలకొలదిగా పుస్తకములను చిన్నపుస్తకములను, బ్రొషూర్లను ప్రాంతములో అందించియున్నాము. యెహోవాసాక్షులు కానటువంటి కొన్ని వేలమంది గృహములలో ఇతర సాహిత్యములతోపాటు లివ్ఫరెవర్, ట్రూపీస్, మరియు సత్యము అను పుస్తకములను మనము చూడగలము. ఇది క్రొత్త బైబిలు పఠనములను ఆరంభించుటకుగల విస్తార అవకాశమును తెలియజేయుచున్నది.
4 ఇంటియజమాని ఒకరు మన పనినిగూర్చి ఎరిగియున్నానని, లేక మన సాహిత్యములు కొన్ని ఇంతకు ముందే తనవద్దగలవని చెప్పినప్పుడు దాని విషయమై చాల సంతోషమును కలిగియున్నామని తెలుపవలెను. (రీజనింగ్ పుస్తకము పేజి 20ని చూడుము.) ఏదైనా ఒక పుస్తకమును యింటివారు కలిగియున్నప్పుడు వారికిని, తమ కుటుంబమునకును ప్రయోజనకరమగు మంచి ఆసక్తికర కొన్ని అంశములను తెలుపుటకై ఆ పుస్తకమును తెమ్మని దయాపూర్వకముగా కోరవచ్చును. అందుకు తగిన ప్రతిస్పందన కనబడినచో బైబిలు పఠనమును అందించవచ్చును.
5 అయితే పైనున్న దానికి భిన్నమైనదేమనగా మనమే చొరవ తీసుకొని ఒకవేళ యింటియందు ఏదైనా సాహిత్యము కలదేమో విచారించుట. ఇది ప్రత్యేకముగా ఎక్కువగా సాహిత్యము అందజేయబడిన ప్రాంతములో ఎక్కువ ఫలవంతముగా యుండవచ్చును. స్నేహపూర్వక పరిచయము తరువాత పెక్కుసారులు ఆ ప్రాంతమును దర్శించినందున వారి పొరుగువారు అనేకమంది మన సాహిత్యమును కొంత కలిగియున్నారని చెప్పవచ్చును. ప్రచురింపబడిన అట్టి సాహిత్యము ద్వారా ప్రజలు ప్రయోజనము పొందునట్లు చేయుటలో మనము శ్రద్ధను కలిగియున్నాము. ఆ తరువాత ఇంటివారు ఏదైన మన సాహిత్యమును కలిగియున్నారేమో అడుగవచ్చును. తాను కలిగియున్నట్లయిన దయతో మేము చూడవచ్చా అని అడిగి దానిని మనమెట్లు పఠించుదుమో చూపుము. క్లుప్తమైన ప్రదర్శన కుటుంబ బైబిలు పఠనమునకు నడుపవచ్చును. సాహిత్యము యింటివారు కలిగియుండని యెడల ప్రస్తుత సాహిత్యము నందించుము లేక నేరుగా ఉచిత బైబిలు పఠనము కలిగియుండుటకు తన కుటుంబము యిష్టపడునేమో అడుగుము.
వివేచనను వినియోగించుము
6 ప్రజలు తొందర కలిగియుందురు గనుక అట్టివారి గృహముల యొద్ద మన ఆహ్వానమును మించి ఎక్కువ సమయమును తీసుకొనుట జ్ఞానయుక్తముకాదు. మొదట్లో కొన్ని పఠనములను 15 నిముషములకు పరిమితము చేయవచ్చును. ఈ సందర్భముగా తమ సమయమును ఎక్కువగా తీసికొనమని యింటివారు గ్రహించినపుడు మనము క్రమముగా దర్శించుటను తాను యిష్టపడవచ్చును. ఒకసారి పఠనము స్థిరపరచబడి యింటివారి ఆసక్తివృద్ధియైనప్పుడు పఠనములో ఎక్కువకాలమును గడుపవచ్చును. అయినను, కొందరు ఆరంభమునుండే బైబిలు పఠనములో ఎక్కువ సమయమును గడుపుటకు యిష్టపడుదురు.
7 సేవా ప్రాంతమందు మన సహాయము అవసరమైన గొర్రెవంటి స్వభావముగలవారు చాలామంది కలరు. వారిలో అనేకమంది మన సాహిత్యములను కలిగియున్నారు. నిస్సందేహముగా నేడు లోకములో జరుగుచున్న హేయకృత్యములనుబట్టి మూల్గులిడుచుచు ప్రలాపించువారు కొందరున్నారు. (యెహె. 9:4) మానవజాతి యొక్క శ్రమలను పరిష్కరించు రాజ్యసాహిత్యమును పంచుటయేగాక యథార్థహృదయము గలవారిని బైబిలు పఠనములద్వారా సత్యముతో సమీపించుటయు మన ఆధిక్యతైయున్నది.—మత్త. 28:19, 20.