కావలికోట చదువునట్లు ఇతరులను ప్రోత్సహించుము
1 మే మరియు జూన్ మాసములలో సత్యమును ప్రేమించువారిని క్రమముగా కావలికోటను చదవమని ప్రోత్సహించగోరుదుము. ఈనాడు ప్రచురించబడుచున్న పత్రికలన్నిటిలోకెల్లా కేవలము అది మాత్రమే లోక దుఃఖకర పరిస్థితులనుబట్టి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారికి అవసరమైన ప్రాముఖ్యమగు ఆత్మీయ ఆహారమును అందించును.—యెహె. 9:4.
2 మనము అంత్యకాలమందున్నామనియు, దేవుని రాజ్యము త్వరలో భూమిపైకి సమాధానము తెచ్చుననియు, రుజువు పరచు బైబిలు ప్రవచనమును అర్థము చేసికొనుటకు కావలికోట మనకు సహాయము చేసియున్నది. ఇతరుల జీవితములయెడల మనకు గల నిజమైన శ్రద్ధవారితో ఈ అద్భుతకర నిరీక్షణను పంచుకొనునట్లు చేయును. అనేకమంది యథార్థహృదయము గలవారు రక్షణకు సమకూర్చబడుటను చూచుటద్వారాను మనము ప్రోత్సహించబడియున్నాము.—యోహాను 10:16.
3 “అది మీరనుకొనుదానికంటే తరువాతనేనా?” అను ఏప్రిల్ 1, 1991 ది వాచ్‌టవర్ సంచిక ఆలోచనను రేకెత్తించునది. ఏప్రిల్ 15, సంచిక “సమాధానము నిజముగా ఎప్పుడు వచ్చును?” అను శీర్షికను కలిగియున్నది. ఈ శీర్షికలు ప్రపంచశాంతి సమీపముగా ఉన్నదా? అనబడు మన సంభాషణ అంశమునకు చాలా బాగా ముడిపెట్టవచ్చును. యింటివారు నిజముగా సువార్తయందు ఆసక్తి కలిగియున్నారా అని నిర్ణయించుటకు అతనిని ఉత్సాహపూరితమైన బైబిలు చర్చలోకి దించుము. ఆ సమయంలో చర్చించు అంశమును ఎక్కువగా గ్రహించుకొనుటకు ప్రస్తుత పత్రికలలోని ఏ శీర్షికలు సహాయపడునో చూపించుటకు ముందుగానే సిద్ధపడుట, వెంటనే చూపగల చురుకుదనము అవసరము.
4 మనకు పోస్టుద్వారా పత్రికలను పంపమని అడ్రసు ఇచ్చినట్లయిన కేవలము ఎవరికైనను పత్రికలను పంపుటలో మనము ఆసక్తికలిగి లేము. మనకప్పగింపబడినపని సువార్తను ప్రకటించి శిష్యులను చేయుట అని గుర్తుంచుకొనుము. (మత్త. 24:14; 28:19, 20) ఒక వేళ వ్యక్తి ఏదో కొన్ని శీర్షికలను అప్పుడప్పుడు చదువుటలో శ్రద్ధగలవాడైతే అతని పేరును మీ పత్రికామార్గములో వ్రాసుకొని క్రమంగా వ్యక్తిగతముగా అతనిని కలుసుకొనుము. మీరు వ్యక్తిని క్రమముగా కలియుట ఆసక్తిని వృద్ధిచేయుటకు దోహదపడి క్రమేణి పోస్టుద్వారా కావలికోటను తాను పొందుట ఎప్పుడు బాగుంటుందో నిర్ణయించవచ్చును.
5 మే మరియు జూన్ మాసములు యెహోవా రాజ్యసువార్తను ఇంటింటను మరియు తటస్థంగాను మనము కలియు ప్రజలతో వ్యాప్తిచేయుటకు అనేక అవకాశములను కలుగజేయును. మన ప్రాంతములోని దీనులైనవారిని కనుగొని వారికి ఆత్మీయ పోషణను అందించుటలో మన శ్రద్ధగల ప్రయత్నములను దీవించుటలో యెహోవా కొనసాగునని మనము నమ్మకము కలిగియుండగలము.