‘నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో . . . వాటిని బోధించుట’
1 శిష్యులను తయారుచేయటంలో బోధించటం ఇమిడి వుంది. ఒక వ్యక్తి క్రీస్తు శిష్యుడగుటకు ముందు యేసు ‘ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని’ అతనికి బోధించాలి. (మత్త. 28:19, 20) దీనిని చేయగల అత్యంత శ్రేష్టమైన మార్గం గృహ బైబిలు పఠనమే.
2 బైబిలు పఠనములను ప్రారంభించడం ఎప్పుడూ సులభం కాదు. బైబిలు పఠనాన్ని కనుగొనటం మీకు కష్టంగా ఉంటే, నిరుత్సాహ పడవద్దు. బైబిలు పఠనములను ప్రారంభించడంలో విజయంపొందాలంటే దానికి పట్టుదల, ఇతరులకు సత్యమును నేర్పించాలనే మనఃపూర్వ కోరిక అవసరము.—గలతీ. 6:9.
3 ఆసక్తిని పెంపొందించుట: మీ మొదటి చర్చ కేవలం పరిమితమైన ఆసక్తినే కలుగజేస్తుంది. పరిస్థితులనుబట్టి ఒక కరపత్రాన్నేగాని, బ్రోషర్నేగాని, లేక పత్రికలనేగాని ఇంటివారికి ఇచ్చియుండవచ్చును. వీటిలో ఒకదానిని ఉపయోగించి మీరు గృహ బైబిలు పఠనమును ప్రారంభించవచ్చును. ఒకవేళ ఇంటివారు ఇంకా ఎక్కువ ఆసక్తి చూపితే, తదుపరి దర్శనములో అతనిని యుక్తమైన మరొక ప్రచురణలోకి నడుపవచ్చును.
4 విజయానికి సిద్ధపాటు కీలకము. మీరు మీ తదుపరి పునర్దర్శనంలో ఉపయోగించబోయే కరపత్రము, బ్రోషర్, లేక పత్రికలోని ఒక లేఖనాన్ని ముందుగానే ఎందుకు ఎన్నుకోకూడదు? ఆ విధంగా ప్రచురణలోని వ్యాఖ్యానమును మీ చర్చకు మీరు ముడిపెట్టగలుగుతారు. బహుశా మీరు నేరుగా ప్రచురణలోనుండే ఒకటి లేక రెండు పేరాలను చదువుటకు వీలగును.
5 మీరు ఇలా చెప్పవచ్చును:
◼ “ప్రస్తుతం నెరవేరుతున్న ఒక ప్రముఖమైన ప్రవచనాన్ని గూర్చిన సమాచారాన్ని మేము అందిస్తున్నాము.” మత్తయి 24:3 చదివి “మన సమస్యలు” బ్రోషర్లోని 13 నుండి 15 పేజీలలోని వ్యాఖ్యానములకు, చిత్రములకు దానిని ముడిపెట్టుము. లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్ కరపత్రమును ఉపయోగించేటప్పుడు కూడా ఇదే రీతిగా సమీపించవచ్చును.
6 ఒకసారి నిజమైన ఆసక్తిని కనుగొన్నప్పుడు దానిని తాత్సారముచేయకుండా వెంబడించాలి. గతంలో చేసిన సంభాషణ ఇంటివారి మదిలో ఇంకా తాజాగా ఉండగానే ఒక వారములోపే తిరిగి దర్శించడానికి ప్రయత్నించండి. దర్శించిన ప్రతిసారి, మీరు విడిచి వచ్చిన ప్రచురణనుండి కొన్ని పేరాలను పరిశీలించండి. తదుపరి యుక్తమైన సమయంలో, నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని పరిచయముచేసి యథాపద్ధతిని కొనసాగించవచ్చును.
7 యేసు ప్రవచించిన గొప్పకోత పనిలో నేడు చేయడానికి ఇంకా ఎంతో పని ఉంది. (మత్త. 9:37, 38) యథార్థ హృదయముగలవారికి బోధించుటలో మనము కొనసాగుతుండగా, ‘యుగసమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉంటాడనే’ బలమైన అభయం మనకు ఉంది.