సమాధానకరమైన దేవుని రాజ్యమందు ఆసక్తిని వృద్ధి చేయండి
1 ఫిబ్రవరి నెలలో, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని మనం అందిస్తాం. యథార్థహృదయులైన ప్రజలు దేవుని రాజ్యమును, అది సాధించబోయే విషయాలయందు మెప్పును పెంచడానికి వారికి సహాయం చేయడమనేది మన లక్ష్యమై ఉండాలి. వారి అభిప్రాయాలను అడగడం యీ లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడగలదు.
2 స్నేహపూర్వకంగా పలకరించిన తర్వాత మనమిలా చెప్పవచ్చు:
◼ “భూవ్యాప్తంగా ప్రభుత్వాల్లో గంభీరమైన మార్పులు జరుగుతున్నాయి, శాంతిని సాధించాలనే మాటలు తరచూ వినబడుతున్నాయి, నిజమైన సమాధానాన్ని ఎన్నటికైనా పొందవచ్చని మీరు భావిస్తున్నారా? [అభిప్రాయం చెప్పనివ్వండి.] సమాధానం తెస్తారని అనేకులు పరిపాలకులవైపు నిరీక్షణతో చూస్తున్నప్పటికీ, కీర్తన 46:9 లో పేర్కొన్న ప్రకారం దేవుడు సమాధానాన్ని తెస్తాడని ఎలా వాగ్దానం చేస్తున్నాడో గమనించండి. [చదవండి.] దేవుని చర్య భూమిపై ఏ మార్పులను తెస్తుందని మీరనుకుంటున్నారు? [గృహస్థుని సమాధానం వినండి, తర్వాత శాంతియుతమైన నూతనలోకంలో జీవితము అనే కరపత్రం చూపించండి.] ఇక్కడ చిత్రీకరించబడినదాన్ని మీరు ఊహించగలరా? “దేవుని నూతన లోకములో జీవితము” అనే ఉపశీర్షిక క్రిందవున్న వివరాలను పరిశీలించండి. పరిస్థితులు అనుమతించినట్లయితే రీజనింగ్ బుక్ లోని 227-32 పేజీలలో “వాట్ విల్ గాడ్స్ కింగ్డం అకంప్లిష్?” అన్న ప్రశ్న క్రిందవున్న వివరాలను చర్చించవచ్చు. లేకపోతే నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 13 వ అధ్యాయంలోనికి గృహస్థుని శ్రద్ధ మళ్ళించి నేరుగా ఆ పుస్తకాన్ని అందించవచ్చు. “దేవుని రాజ్యం యీ మార్పులను తెస్తుందని మీరనుకుంటున్నారా?” అని అడుగుతూ చర్చను ముగించవచ్చు. గృహస్థుడు ఆసక్తి చూపిస్తే, పునర్దర్శనానికి ఏర్పాట్లు చేయాలి.
3 లేకపోతే మనమిలా చెప్పవచ్చు:
◼ “ప్రతిదినం మనం వ్యవహరించవలసిన కలత పరచే సమస్యలను గూర్చిన చింత మరెక్కువగా వ్యక్తమౌతుంది. ఈ సమస్యలనుండి విడుదలపొందగలమనే ఏదైనా నిరీక్షణ ఉందని మీరు భావిస్తున్నారా? [అభిప్రాయం చెప్పనివ్వండి.] మన దురవస్థను ఆయన ఏ మాత్రం పట్టించుకోడని కొందరు భావించవచ్చు. అయితే ప్రకటన 21:3, 4 లో దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడో గమనించండి.” వచనాలను చదవండి. ఈ సందర్భంలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని లేదా ఈ లోకం నిలుస్తుందా? అనే కరపత్రాన్ని చూపించవచ్చు. కరపత్రాన్ని యిచ్చినట్లయితే, 2, 3 పేజీల్లోని “ఈ లోక భవితవ్యం” అనే శీర్షిక క్రిందవున్న సమాచారాన్ని చర్చించవచ్చు. సాధ్యమైతే, “దేవుడు కష్టాలనెందుకు అనుమతిస్తున్నాడు?” అనే ప్రశ్న అడిగి సూటిగా నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించండి. ఆ పుస్తకంలోని 11 వ అధ్యాయాన్ని చూపించి తర్వాతి సందర్శనంలో దాన్ని చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
4 గృహస్థుడు మరీ పనిరద్దీలో ఉంటే, ఒక క్రొత్త పత్రికలోని ఏదైనా ఎంపిక చేసుకున్న ఒక శీర్షికను చూపించి, దానిలోని ఓ ప్రత్యేకమైన అంశాన్ని గూర్చి క్లుప్తంగా వ్యాఖ్యానించవచ్చు.
మీరు ఒకవేళ యీ విధంగా చెబుతూ పత్రికను పరిచయం చేయవచ్చు:
“ఈ పత్రిక ఆ అంశాన్ని గూర్చి మరింత వివరంగా చెబుతుంది. [ముందుగానే ఎన్నుకున్న ఒకటి రెండు వాక్యాలను చదవండి.] ఈ శీర్షిక అదనపు వివరాలను అందించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రోత్సహించగలదు. మీకు యీ విషయంలో ఆసక్తి ఉన్నందువల్ల, యీ సంచికను, దీనితోపాటున్న మరొక పత్రికను రెండింటిని కలిపి 6 రూపాయల చందాకు మీకివ్వడానికి మేం సంతోషిస్తాము.”
5 మానవకోటి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకొరకై ఎటు వెళ్ళాలో తెలియక నేటి ప్రజలు తరచూ తికమకపడుతున్నారు. భవిష్యత్తుకొరకైన స్పష్టమైన నిరీక్షణను, వారితో పంచుకొనే ఆధిక్యత మనకుంది. (అపొ. 17:27) అలా అయితే, సమాధానానికి నిజమైన మూలమైన దేవుని రాజ్యం వైపు ప్రజల శ్రద్ధను మనం మళ్ళించవచ్చు.