నిరంతరము జీవించగలరు పుస్తకంపై ఆసక్తిని పెంపొందించండి
1 మనం వారి గృహాలను దర్శించినప్పుడు, ప్రజలు “ఐహిక విచారము”లలో మనసును కేంద్రీకరించడాన్ని సాధారణంగా మనం కనుగొంటాము. (మార్కు 4:19) ఆలోచన రేకెత్తించే ప్రసంగంతో వారి ఆసక్తిని చూరగొనే సవాలును మనం ఎదుర్కొంటాము. ప్రారంభంలో, చాలామంది ప్రజలు మనం చెప్పేదానిలో కొంచెం ఆసక్తిని మాత్రమే కల్గివుంటారు. వారి జీవితాలను స్పర్శించేదేదైనా మనం చెప్పగల్గితే, మనం రాజ్య వర్తమానంపై కొంత ఆసక్తిని రేకెత్తించగలము. సంభాషణను ప్రారంభించడానికి కీలకమేమంటే నిరంతరము జీవించగలరు పుస్తకంనుండి మనసుకు నచ్చే మాట్లాడదగు అంశాలను ఎన్నుకోవాలి. మీరేమి చెప్పగలరు?
2 ఈ విధంగా మీరు సమీపించవచ్చు:
◼ “మీకు శక్తి వున్నట్లైతే, మన కాలంలోని దుఃఖకరమైన ఏ సమస్యను మీరు సరిచేస్తారు? [ప్రత్యుత్తరమివ్వనివ్వండి, సరియైనదైతే, అనేకమంది ప్రజలు అదే రీతిలో భావిస్తారని ఒప్పుకోండి.] ఇప్పటి వరకూ, లోక నాయకులు ఈనాటి కలవరపెట్టే అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనుటలో కొంచెంమట్టుకే విజయవంతమైనట్లుగా కన్పిస్తుంది. అయితే మానవజాతిని పీడిస్తున్న సమస్యలన్నింటినీ అంతమొందించగలవాడు, అంతమొందించేవాడు ఒక్కడే వున్నాడు. కీర్తన 145:16లో ఏమి వ్రాయబడిందో దయచేసి గమనించండి. [లేఖనాన్ని చదివి, 11-13 పేజీలలోని బొమ్మలను సూచించండి.] పద్నాలుగవ పేజీలోని 14వ పేరా మనమిప్పుడు చర్చించిన ప్రశ్నను లేవదీసి, యింకా యిలా అడుగుతుంది: ‘అయితే యిది ఎప్పుడు జరుగును?’” ఈ పుస్తకం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందని వివరించి, దాన్ని రూ. 20. చందాకు అందించండి.
3 లేదా మీరీవిధంగానైనా చెప్పవచ్చు:
◼ “ప్రియమైన వారిని కోల్పోవడంతో వచ్చే లోటునుగూర్చి బహుశా మీకు తెలిసేవుంటుంది. బహుశా అది మిమ్మల్ని చాలా దుఃఖభరితులుగాను, నిస్సహాయులుగాను చేసివుండవచ్చు. మీరిలాంటి ప్రశ్నలను గూర్చి ఆలోచించే ఉంటారు: [పేజీ 76నందలి పేరా 1లోని ప్రశ్నలను చదవండి.] ఈ ప్రశ్నలకు జవాబులను పొందడం ఓదార్పుకరంగా ఉండదా? మరణించినవారికి బైబిలులో ఒక నిశ్చయమైన నిరీక్షణ కలదని తెలుసుకోవడానికి మిమ్మల్నిది ప్రోత్సహిస్తుంది. [యోహాను 5:28, 29 చదవండి.] మరణించినవారి స్థితినిగూర్చి, భవిష్యత్తుకుగల నిరీక్షణనుగూర్చి తెలుసుకోవడానికి ఈ పుస్తకం మనకు సహాయంచేస్తుంది.” క్లుప్తంగా 8, 20 అధ్యాయాలను సూచించండి. ఆ పుస్తకాన్ని పరిశీలించడానికి గృహస్థునికి అవకాశమిచ్చి, దానిని అందించండి.
4 తటస్థంగా సాక్ష్యమిచ్చే అవకాశాలు మీకు ఎదురయ్యే సాధ్యత ఎంతో కలదు. అలాగైతే, మీ స్వంత మాటలతో ఈ క్రిందివిధంగా మీరు చెప్పవచ్చు:
◼ “ఈ రోజుల్లో లోకమంతా సమస్యలతో నిండివుంది, మీక్కూడా కొన్ని సమస్యలున్నాయనడంలో అనుమానంలేదు. విచారకరమైన విషయమేమంటే, అమాయకులే ఎక్కువగా బాధననుభవిస్తున్నట్లుగా కనబడుతుంది. దేవుడు ఎన్నటికైనా బాధలన్నింటినీ అంతమొందిస్తాడని మీరనుకుంటున్నారా? [ప్రత్యుత్తరమివ్వనివ్వండి.] ఆయనను సేవించేవారికి దేవుడు ఏం చేస్తానని వాగ్దానం చేశాడో నన్ను కాస్త చెప్పనివ్వండి. [కీర్తన 37:40 చదివి, ఆ తర్వాత నిరంతరము జీవించగలరు అను పుస్తకాన్ని 99వ పేజీకి త్రిప్పండి.] దేవుడు ఎందుకు దుష్టత్వాన్ని అనుమతించాడో, ఆయన దానిని ఎలా అంతమొందిస్తాడో ఈ పుస్తకం వివరిస్తుంది.”
5 మీరొకవేళ యవ్వన ప్రచారకులైతే, 156-8 పేజీలలో వున్న బొమ్మలపై ఆధారపడిన ప్రసంగాన్ని ఉపయోగించగలరు. ఈవిధంగా అడుగుతూ మీరు ప్రారంభించవచ్చు:
◼ “ఇలాంటి లోకంలో జీవించాలని మీరిష్టపడతారా? [ప్రత్యుత్తరమివ్వనివ్వండి.] దేవుని వాక్యమగు బైబిలులో వివరించిన వాగ్దానంపై ఈ అందమైన ప్రతి బొమ్మ ఆధారపడివుంది. [లేఖన రెఫరెన్సులను సూచించండి.] భూమినంతటిని పరదైసుగా మార్చడానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోడానికి ఈ పుస్తకం మీకు సహాయపడగలదు. ఇది జీవితాన్ని రక్షించే సమాచారాన్ని కల్గివుంది, మరి దీనిని చదవడానికి సమయం వెచ్చించుట విలువకరమే.”—యోహాను 17:3.
6 ఈ పుస్తకాన్ని అందించేటప్పుడు, అనుకూల దృక్పథంకల్గి, ఉత్సాహంగా వుండండి. దీనిలో ఆసక్తిని పెంపొందించుకొని, అద్భుతమైన మన రాజ్య నిరీక్షణను పంచుకోండి.