తల్లిదండ్రులారా—ప్రకటించేందుకు మీ పిల్లలకు శిక్షణనివ్వండి
1 దేవున్ని సేవించాలనే యథార్థమైన కోరికగల అనేకమంది పిల్లలతో మన సంఘాలు ఆశీర్వదించబడ్డాయి. (ప్రసం. 12:1, 2) తనను స్తుతించడంలో భాగం వహించేందుకు యెహోవా ఆహ్వానించినవారిలో వాళ్లూ ఉన్నారు. (కీర్త. 148:12-14) గనుకనే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అనుదిన తర్ఫీదులో రాజ్య ప్రకటనా పనిలో ఇతరులతో తమ విశ్వాసాన్ని ఎలా పంచుకోవాలో ఉపదేశించడం కూడా చేర్చబడాలి.—ద్వితీ. 6:6, 7.
2 పురోభివృద్ధిదాయకమైన పద్ధతుల్లో పిల్లలకు శిక్షణనివ్వండి: పరిచర్యలో తమ తల్లిదండ్రులతోపాటు వెళ్లేలా అతి పిన్న వయస్సులో తర్ఫీదును ఇవ్వడానికి పిల్లలు తగినవారే. సేవకు వెళ్లడానికి మునుపు, అర్థవంతమైన రీతిలో భాగంవహించేలా మీ పిల్లల్ని సిద్ధపర్చండి. సాక్ష్యమివ్వబోయే ఇంటిదగ్గర మీరు వారినుండి దేన్ని అపేక్షిస్తున్నారో ముందుగానే నిశ్చయపర్చుకోండి. మరీ చిన్నపిల్లలు కరపత్రాల్నీ, హాండ్ బిల్స్నూ ఇచ్చి, రాజ్యమందిరానికి ప్రజల్ని ఆహ్వానించవచ్చు. సాక్ష్యమివ్వబోయే ఇంటిదగ్గర బాగా చదవగల్గే పిల్లల్ని లేఖనాల్ని చదివేందుకు ఆహ్వానించవచ్చు. వాళ్లు క్లుప్తంగా మాట్లాడి, పత్రికల్ని ఇవ్వొచ్చు. వాళ్లు అనుభవాన్ని సంపాదిస్తూండగా, వాళ్ల అందింపులో బైబిల్ని ఉపయోగించేలా వారికి తర్ఫీదు ఇవ్వండి. ప్రచారకులైన అనేకమంది పిల్లలు తమ స్వంత పత్రికామార్గాల్ని ప్రారంభించి, క్రమంగా పునర్దర్శనాల్ని చేస్తున్నారు. పిల్లవాడు మరో పిల్లవానితో పనిచేయడంకన్నా ఓ పెద్దవ్యక్తితో పనిచేయడం మంచిది. ఆ పెద్దవ్యక్తి, ఈ పిల్లవాడు పరిచర్యలో శిక్షణ పొందుతున్నాడని గృహస్థునితో చెప్పవచ్చు.
3 ఓ చిన్నబాలిక తాను రాజ్య ప్రచారకురాలుగా అర్హురాలయ్యేందుకు సహాయపడమని పెద్దలను అర్థించింది. అప్పుడామెకు ఐదేళ్లే అయినా, చదవడం రాకపోయినా, తాను రాజ్య సందేశాన్ని ప్రతిభావంతంగా ఇళ్లదగ్గర అందించేది. లేఖనాలున్న చోటును ఆమె గుర్తుపెట్టుకొని వాటి వైపుకి ప్రచురణను త్రిప్పి, వాటిని చదవమని గృహస్థున్ని అడిగేది. అటుతర్వాత, ఆమె దాన్ని వివరించేది.
4 పరిచర్యలో క్రమంగా భాగంవహించేందుకు ఓ మంచి షెడ్యూల్ను కల్గివుండే విలువను తల్లిదండ్రులు తాము మాదిరి చూపించడంద్వారా పిల్లలకు బోధించాలి. తల్లిదండ్రులు సేవకోసం వారంలో స్థిరమైన ఓ పద్ధతిని ఏర్పర్చుకొని, దానికి అంటిపెట్టుకొని ఉండాలి. ఆ విధంగా, పిల్లలు వారంలో ఎంత సమయం ప్రకటనా పనికోసం ఎల్లప్పుడూ కేటాయించబడుతుందో తెల్సుకుంటారు.
5 పరిచర్యను ప్రేమించి ఆనందించేలా పిల్లలకు చిన్నప్పటినుండే తర్ఫీదునిచ్చినప్పుడు, బహుశా పయినీరు సేవతోపాటూ భవిష్యత్తులో అటువంటి గొప్ప ఆధిక్యతల్ని చేరుకునేలా ప్రేరేపించబడతారు. (1 కొరిం. 15:58) యెహోవా స్తుతికర్తలుగా మంచి పురోభివృద్ధిచెందేలా మనమధ్యనున్న పిల్లల్ని మనమంతా ప్రోత్సహించాలి.