సత్క్రియలు చేసేలా ఒకరినొకరు ఆసక్తితో పురికొల్పుకోండి
హెబ్రీయులు 10:24, 25 మనల్ని ఇలా ప్రోత్సహిస్తుంది, “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను.” మన ఆదర్శంతో, విశ్వాసంతో సహోదరులను ప్రోత్సహించవచ్చు. సంఘంలోని వాళ్లతో మీ మంచి అనుభవాలు పంచుకోండి. యెహోవాను సేవించడంలో మీరు ఎంత ఆనందిస్తున్నారో వాళ్లు చూడగలగాలి. అదే సమయంలో, మీకంటే లేదా ఇతరులకంటే వాళ్లు తక్కువని భావించేలా చేయకండి. (గల. 6:4) మీ మంచి అనుభవాలు, ‘ప్రేమ చూపించేలా సత్కార్యములు చేసేలా’ ఇతరులను ప్రోత్సహించాలే తప్ప తమను తాము నిందించుకొని, మంచి పనులు మానేసేలా చేయకూడదు. (పరిచర్య పాఠశాల 158వ పేజీ, 4వ పేరా చూడండి.) ముందు ప్రేమ చూపించేలా ప్రోత్సహిస్తే, తర్వాత వాళ్లు అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడం, పరిచర్య చేయడం లాంటి మంచి పనులు చేస్తారు.—2 కొరిం. 1:24.