కీర్తనలు
ఐదో భాగం
(107-150 కీర్తనలు)
107 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు;+
ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.
2 యెహోవా విడిపించినవాళ్లు,*
శత్రువు చేతి* నుండి ఆయన విడిపించినవాళ్లు+ ఆ మాట అనాలి.
3 తూర్పు నుండి, పడమటి నుండి,*
ఉత్తరం నుండి, దక్షిణం నుండి,+
దేశదేశాల నుండి ఆయన వాళ్లను సమకూర్చాడు.+
4 ఎడారిలో, నిర్జన ప్రాంతంలో వాళ్లు అటూఇటూ తిరిగారు;
కానీ వాళ్లు నివసించగలిగేలా, ఏ ఒక్క నగరానికీ దారి కనిపించలేదు.
5 వాళ్లు ఆకలిదప్పులతో అలమటించారు;
అలసిపోయి సొమ్మసిల్లారు.
8 యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి,
మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనుల్ని బట్టి+
ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.+
9 ఎందుకంటే ఆయన, దాహంతో ఉన్న ప్రాణాన్ని నీళ్లతో తృప్తిపర్చాడు,
ఆకలితో ఉన్నవాళ్లకు మంచివాటిని సమృద్ధిగా ఇచ్చాడు.+
10 కొంతమంది కటిక చీకట్లో ఉన్నారు,
ఖైదీలు ఇనుప సంకెళ్లతో బంధించబడి కష్టాలు పడ్డారు.
11 ఎందుకంటే వాళ్లు దేవుని మాటకు ఎదురుతిరిగారు;
సర్వోన్నతుని సలహాను నిర్లక్ష్యం చేశారు.+
12 కాబట్టి కష్టాలతో ఆయన వాళ్ల హృదయాల్ని అణచాడు;+
వాళ్లు తడబడ్డారు, వాళ్లకు సహాయం చేసేవాళ్లెవ్వరూ లేరు.
13 కష్టకాలంలో వాళ్లు యెహోవాకు మొరపెట్టారు;
వాళ్ల బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపించాడు.
14 కటిక చీకట్లో నుండి వాళ్లను బయటికి తీసుకొచ్చాడు,
వాళ్ల సంకెళ్లను విరగ్గొట్టాడు.+
15 యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి,+
మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనుల్ని బట్టి
ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.
16 ఆయన రాగి తలుపుల్ని పగలగొట్టాడు,
ఇనుప గడియల్ని విరగ్గొట్టాడు.+
18 వాళ్ల ఆకలి చచ్చిపోయింది;
వాళ్లు చావుకు* దగ్గరయ్యారు.
19 కష్టకాలంలో వాళ్లు యెహోవాకు మొరపెట్టేవాళ్లు;
వాళ్ల బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపించేవాడు.
21 యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి,
మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనుల్ని బట్టి
ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.
22 వాళ్లు కృతజ్ఞతా బలులు అర్పించాలి,+
సంతోషంతో కేకలు వేస్తూ ఆయన పనుల్ని చాటిచెప్పాలి.
23 సముద్రం మీద ఓడల్లో ప్రయాణించేవాళ్లు,
విస్తార జలాల మీద ప్రయాణించే వ్యాపారస్థులు+
24 యెహోవా పనుల్ని చూశారు,
సముద్రంలో ఆయన అద్భుతమైన పనుల్ని చూశారు;+
25 ఆయన ఆజ్ఞాపించినప్పుడు తుఫాను చెలరేగి+
సముద్ర తరంగాల్ని ఎలా ఉప్పొంగజేస్తుందో వాళ్లు చూశారు.
26 వాళ్లు ఆకాశమంత ఎత్తుకు వెళ్తారు;
అగాధంలోకి పడిపోతారు.
ముంచుకొస్తున్న విపత్తును చూసి వాళ్ల ధైర్యం నీరుగారిపోతుంది.
28 కష్టకాలంలో వాళ్లు యెహోవాకు మొరపెడతారు;+
వాళ్ల బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపిస్తాడు.
29 ఆయన తుఫానును నిమ్మళింపజేస్తాడు;
సముద్ర తరంగాలు నిశ్శబ్దమౌతాయి.+
30 అవి నిశ్శబ్దమైనప్పుడు వాళ్లు సంతోషిస్తారు,
వాళ్లు వెళ్లాలనుకున్న ఓడరేవుకు ఆయన వాళ్లను చేరుస్తాడు.
31 యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి,
మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనుల్ని బట్టి+
ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.
33 ఆయన నదుల్ని ఎడారిగా,
నీటి ఊటల్ని ఎండిన ప్రదేశంగా మారుస్తాడు;+
34 పండే నేలను పనికిరాని భూమిగా* చేస్తాడు.+
దానిలో నివసించే దుష్టుల కారణంగా ఆయన అలా చేస్తాడు.
35 ఆయన ఎడారిని జమ్ము మడుగులుగా,
ఎండిన భూమిని నీటి ఊటలుగా మారుస్తాడు.+
36 ఆకలిగా ఉన్నవాళ్లను అక్కడ నివసించేలా చేస్తాడు,+
అలా వాళ్లు తాము నివసించడానికి ఒక నగరాన్ని స్థాపించుకుంటారు.+
38 ఆయన వాళ్లను దీవిస్తాడు, వాళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది;
వాళ్ల పశుసంపదను ఆయన తగ్గిపోనివ్వడు.+
39 కానీ అణచివేత, విపత్తు, దుఃఖం వల్ల
వాళ్ల సంఖ్య మళ్లీ తగ్గిపోతుంది, వాళ్లు అవమానాలపాలు అవుతారు.
40 ప్రముఖుల్ని ఆయన అవమానాలపాలు చేస్తాడు,
వాళ్లు దారులు లేని పనికిరాని ప్రదేశాల్లో తిరిగేలా చేస్తాడు.+