రోమీయులు
12 కాబట్టి సహోదరులారా, దేవుని కనికరాన్ని బట్టి నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన,+ దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించండి,+ మీ ఆలోచనా సామర్థ్యాల్ని+ ఉపయోగించి పవిత్రసేవ చేయండి. 2 ఇకమీదట ఈ వ్యవస్థ* మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి.*+ అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.+
3 దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయ ద్వారా అక్కడున్న మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా* అంచనా వేసుకోవద్దు.+ బదులుగా ప్రతీ ఒక్కరు దేవుడు తనకు ఇచ్చిన* విశ్వాసం ప్రకారం, తనకు మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి.+ 4 ఒకే శరీరంలో చాలా అవయవాలు ఉన్నా,+ అన్నీ ఒకే పని చేయవు. 5 అలాగే మనం కూడా చాలామందిమి ఉన్నా, క్రీస్తులో ఒకే శరీరంగా ఉన్నాం; మనం ఒకదానికొకటి జతచేయబడిన* అవయవాలం.+ 6 అయితే దేవుడు మనకు అనుగ్రహించిన అపారదయకు అనుగుణంగా మనకు వేర్వేరు వరాలు ఉన్నాయి.+ కాబట్టి మనకు ఒకవేళ ప్రవచించే వరం ఉంటే, మన విశ్వాసానికి తగ్గట్టు ప్రవచిద్దాం; 7 పరిచర్య వరం ఉంటే, పరిచర్య చేస్తూ ఉందాం; అలాగే బోధించే వ్యక్తి బోధిస్తూ ఉండాలి;+ 8 ప్రోత్సహించే* వ్యక్తి ప్రోత్సహించాలి;*+ పంచిపెట్టే* వ్యక్తి ఉదారంగా పంచిపెట్టాలి;*+ నాయకత్వం వహించే వ్యక్తి ఆ పనిని శ్రద్ధగా* చేయాలి;+ కరుణ చూపించే వ్యక్తి సంతోషంగా కరుణ చూపించాలి.+
9 మీ ప్రేమలో కపటం ఉండకూడదు.+ చెడ్డదాన్ని అసహ్యించుకోండి;+ మంచిదాన్ని అంటిపెట్టుకొని ఉండండి. 10 సహోదర ప్రేమను, ఆ ప్రేమలో వాత్సల్యాన్ని చూపించండి. ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ముందుండండి.*+ 11 కష్టపడి* పనిచేసేవాళ్లుగా ఉండండి, సోమరులుగా ఉండకండి.*+ పవిత్రశక్తి మీలో ఉత్సాహం నింపనివ్వండి.+ దాసులుగా యెహోవాకు* సేవ చేయండి.+ 12 నిరీక్షణను బట్టి సంతోషించండి. శ్రమల్లో సహనం చూపించండి.+ పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి.+ 13 పవిత్రుల అవసరాల్ని బట్టి మీకున్నవాటిని వాళ్లతో పంచుకోండి. ఆతిథ్యం ఇస్తూ ఉండండి.+ 14 హింసించేవాళ్లను దీవిస్తూ ఉండండి;+ దీవించండి కానీ శపించకండి.+ 15 సంతోషించేవాళ్లతో సంతోషించండి; ఏడ్చేవాళ్లతో ఏడ్వండి. 16 మీ గురించి మీరు ఎలా శ్రద్ధ తీసుకుంటారో, ఇతరుల గురించి కూడా అలాగే శ్రద్ధ తీసుకోండి; గొప్పగొప్ప వాటిమీద మనసుపెట్టకండి, బదులుగా తక్కువ వాటిని ఇష్టపడండి.*+ మీకు మీరే తెలివిగలవాళ్లని అనుకోకండి.+
17 ఎవరైనా మీకు చెడు చేస్తే, తిరిగి వాళ్లకు చెడు చేయకండి.+ మనుషులందరి దృష్టిలో ఏది సరైనదో పరిగణనలోకి తీసుకోండి. 18 సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.+ 19 ప్రియ సహోదరులారా, మీకు మీరే పగతీర్చుకోకండి, దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వండి;+ ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది: “ ‘పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని’ అని యెహోవా* అంటున్నాడు.”+ 20 “నీ శత్రువు ఆకలితో ఉంటే ఆహారం పెట్టు, దాహంతో ఉంటే తాగడానికి నీళ్లు ఇవ్వు. అలా చేయడం ద్వారా అతని తలమీద నిప్పుల్ని కుప్పగా పోస్తావు.”*+ 21 చెడును నీ మీద విజయం సాధించనివ్వకు, బదులుగా మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ ఉండు.+