ఈ నెల అందింపును పరిచయముచేయుట
1 ఈనాడు అనేకులు బైబిలు ఒక కల్పిత కథలతో కూడిన పుస్తకమని, నైతికవిషయాలలో నేడు పనికిరాని పూర్వకాల సలహాలనిస్తుందని అనుకుంటారు. అందుచేత దేవునివాక్యముయెడల గౌరవాన్ని నిర్మించడమంటే ఎంతో సవాలుపూర్వకమైంది. కానీ, బైబిలు నిజముగా దేవునిచే ప్రేరేపించబడిన పుస్తకమని ప్రజలకు చూపించుటలో మనకు విలువైన సహాయకమని నిరూపించబడినదొకటుంది. అదే ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అనే పుస్తకము.
2 ఈ పుస్తకమును చదువుటకై ఇంటివారిలో ఆసక్తిని రేకెత్తించుటకు మీరు ఏమి చెప్పుదురు? క్రైస్తవులని చెప్పుకొనేవారికి ఆసక్తికరంగావుండే ఏ అంశాలను, లేక భాగాలను మీరు ఉన్నతపరుస్తారు? క్రైస్తవేతర నమ్మకమున్నవారికి? అసలు విశ్వాసమే లేనివారికి? “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్న”దని మన పొరుగువారికి నిజంగా చూపుటకు ఈ క్రింది సూచనలు సహాయపడును. (2 తిమో. 3:16, 17) ఈ సూచనలను స్థానిక పరిస్థితులకు అనుగుణ్యంగా వర్తించుకొనవచ్చును.
3 మనం చెప్పబోయే దాన్ని ఎందుకు పరిశోధించుకోవాలి: అనేకులు బైబిలుయెడల ఒక నమ్మకాన్ని స్థిరపర్చుకొని, ఆ విషయంలో పరిశీలించుటకు సుముఖంగాలేరు గనుక, మనం చెప్పబోయేదాన్ని విశాల దృక్పథంతో పరిశీలించులాగున అతనికి సహాయపడుటకై మనం మన ఉపోద్ఘాతాన్ని మార్చుకోవలసి వస్తుంది.
4 యుక్తమైనరీతిలో అభినందనలు చెప్పిన తరువాత మీరు ఇట్లు చెప్పవచ్చును:
◼ “మా పొరుగువారితో మాట్లాడునప్పుడు అనేకమంది మనకాలమునకు బైబిలు ఎంతమాత్రము ఆచరణాత్మకము కాదని భావించటం మేము గమనించాము. కాని బైబిలులో నిజంగా ఏముందో పరిశీలనచేయటానికి ప్రజలు సమయం తీసుకొంటే బైబిలు నిజంగా చెప్పేదాన్ని వారు తెలిసికొంటారని మీరనుకుంటారా? [జవాబు చెప్పుటకు ఇంటివారికి అవకాశమివ్వండి] బైబిలు దాని ఉపయోగమునుగూర్చి మనకేమి చెప్తుందో గమనించండి.” 2 తిమోతి 3:16, 17 చదివిన తరువాత ది బైబిల్—గాడ్స్‌వర్డ్ ఆర్ మ్యాన్స్? పుస్తకంలో 12 వ అధ్యాయం 11, 15, 16 పేరాగ్రాఫ్‌లకు అవధానాన్ని మరల్చి బైబిలునందు వ్రాయబడిన కొన్ని వివేకయుక్తమైన మార్గదర్శక సూత్రాలు ఈనాడు మనకెట్లు ఆచరణాత్మకమైనవో సూచించండి. కీర్తన 119:159, 160 లోని గాయకుని మాటలయొక్క సత్యత్వమునకు ఇవి సాక్ష్యముగా ఉన్నవి.
5 అనేకమంది ఇంటివారికి ప్రత్యేకంగా ఆసక్తికరమైన ఒక విషయాన్ని చర్చించు అధ్యాయమును పుస్తకములో చూపించటం ఇంటివారి అవధానాన్ని ఆకట్టుకొంటున్నట్లు కనుగొన్నారు. దానిని ఎలా చేయవచ్చునో గమనించండి:
6 మిమ్ములను మీరు పరిచయము చేసికొన్న తర్వాత, మీరు ఇలా చెప్పవచ్చును:
◼ “ప్రజలు అనేక మత పుస్తకములను ‘పవిత్ర’ మైనవని పిలుస్తున్నారు గనుక, వీటిలో ఏది నిజంగా దేవునివలన ప్రేరేపించబడిందో మనమెలా నిర్ణయించగలమని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా?” ఇంటివారు వ్యాఖ్యానించిన తరువాత ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? పుస్తకము 3వ, పేజిలోని విషయ పట్టికవైపు అతని అవధానమును మరల్చుము. ఉదాహరణకు, ఒకవేళ అతను విజ్ఞానశాస్త్రముయెడల ఆసక్తిచూపితే, 8వ అధ్యాయమునకు త్రిప్పి, పేరా 1 నుండి బైబిలు విజ్ఞానశాస్త్ర సంబంధమైన పుస్తకముగా చెప్పుకోకపోయినను, విజ్ఞానశాస్త్రమునకు సంబంధించిన విషయములను ప్రస్తావించునప్పుడు, అది సంపూర్ణంగా ఖచ్చితంగా తెల్పుతుందని చెప్పుము. సమయము అనుమతించిన పేరా 2లో ఉదహరించబడిన లేఖనములను చదివి, బైబిలు అనేక శతాబ్దములకు పూర్వమే విజ్ఞానశాస్త్రసంబంధంగా ఖచ్చితమైన వివరణలనిచ్చింది కావున బైబిలు తప్పక ఉన్నతమూలము ద్వారా ప్రేరేపించబడియుంటుందని ఇది నిరూపిస్తుంది.
7 సహాయకరమైన ఇతర అంశాలు: ఈ పుస్తకము వెనుక, అధ్యాయము వారిగా సూచించబడిన అనేక రెఫరెన్సులను చూపిస్తూ, ఈ చిన్న పుస్తకము ఎంత బాగా పరిశోధన జరుపబడి వ్రాయబడిందో చూపించవచ్చును. విజ్ఞానశాస్త్ర సంబంధముగా 8వ అధ్యాయమును చర్చిస్తుంటే పేరుగాంచిన శాస్త్రజ్ఞులచే వ్రాయబడిన అనేక పుస్తకాలను, ఎన్‌సైక్లోపిడియాలను మీరు సూచించవచ్చును. దేవున్నేగాని, లేక మతమునేగాని నమ్మని అనేకమంది వ్యక్తులు విజ్ఞానశాస్త్రము, విజ్ఞానశాస్త్రజ్ఞులు అందించు సాక్ష్యము బైబిలు ప్రేరేపితమైనదని ఎలా చూపుతుందో తెలుసుకొనుటకు శ్రద్ధ కలిగియుంటారు. 167వ పేజిలోని 14వ పేరా, సత్యమును మాట్లాడుటలో బైబిలు సలహాను పాటించే విషయాన్ని, మరియు దాని సూత్రములు మనకెంత ప్రయోజనకరమైనవో బలపరచుటకు ఒక వ్యాసరచయితను, మానసిక తత్వ శాస్త్ర పత్రికను ఎత్తిచూపిస్తున్నది.
8 ది బైబిల్ గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకమును పరిచయముచేయుటకు సమర్ధవంతంగా శైలిని మార్చుట ద్వారా మనము మాట్లాడువారు బైబిలును గౌరవించి దానిని దేవుని వాక్యముగా వారు పరిగణించునట్లు సహాయపడగలము.—1 థెస్స. 2:13.