అక్టోబరులోని సేవాకూటాలు
అక్టోబరు 2తో ప్రారంభమయ్యే వారం
పాట 149 (69)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్యలో నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికతోపాటు ఇవ్వబడిన “1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” యొక్క తమ ప్రతిని దగ్గర ఉంచుకోమని అందరిని ప్రోత్సహించండి. 1996లో చూసుకోవడానికి సౌలభ్యమైన స్థలంలో దాన్ని ఉంచుకోవాలి.
15 నిమి: “ఎల్లప్పుడు యెహోవాను స్తుతించుడి.” ప్రశ్నా జవాబులు. ఉదాహరించబడిన మరియు ఎత్తివ్రాయబడిన లేఖనాల అన్వయింపును నొక్కి తెలియజేయండి.
20 నిమి: “ప్రతి సందర్భంలోను చందాలను ప్రతిపాదన చేయండి.” ముఖ్యాంశాలను చర్చించి, చందాలను ప్రతిపాదించేటప్పుడు ఉపయోగించగల, తాజా పత్రికల్లోని శీర్షికలను పునఃసమీక్షించండి. రెండు లేక మూడు అందింపులను ప్రదర్శించండి. చందా కట్టడానికి నిరాకరించిన చోట విడి ప్రతులను తప్పక అందజేయండి.
పాట 153 (44) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 131 (55)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు.
15 నిమి: స్ధానిక అవసరతలు. లేదా కావలికోట 1995 జూలై 15, 25-7 పేజీల్లోగల “బహిష్కరణ—ప్రేమగల ఓ ఏర్పాటా?” అనేదాని ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “మనం మెలకువగా ఉంటున్నామా అంటే పరధ్యానం కలుగజేసేవాటిని తప్పించుకొంటున్నామా?” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించినకొలది, కావలికోట (ఆంగ్లం) 1992 మే 1, 20-2 పేజీల ఆధారంగా అదనపు వ్యాఖ్యానాలు చేయండి.
పాట 128 (89) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 16తో ప్రారంభమయ్యే వారం
పాట 120 (26)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఒక అందింపును 59 భాషల్లో అందజేసే సకల జనములకు సువార్త (ఆంగ్లం) అనే చిన్న పుస్తకం వైపుకు శ్రద్ధ మళ్లించండి. ప్రాంతంలో మనకు రాని భాష మాట్లాడే ఎవరినైనా కలిసినప్పుడు ఈ చిన్న పుస్తకాన్ని ఉపయోగించమని ప్రోత్సహించండి.
15 నిమి: “ఇండియాలో పరిచారకుల శిక్షణా పాఠశాల మొదటి తరగతి.” కార్యదర్శి ఇచ్చే ప్రసంగం. ఆత్మీయ ప్రయోజనాలను నొక్కి చెప్పి, మీ తరువాతి సర్క్యూట్ సమావేశ సమయంలో ధరఖాస్తు చేయడానికి సంఘంలోని అర్హులైన ఏ సహోదరులనైనా ప్రోత్సహించండి.
20 నిమి: “ఒక సంకల్పంతో పునర్దర్శనాలు చేయడం.” పునర్దర్శనాలు చేయడంలోని మన లక్ష్యాలను చర్చించండి. సమర్థులైన ప్రచారకులు రెండు వేరువేరు అందింపులను ప్రదర్శించడానికి ఏర్పాటు చేయండి. మొదటి దర్శనంలో చందా కట్టడానికి నిరాకరిస్తే, పునర్దర్శన సమయంలో చందా కట్టమని మళ్లీ ఎలా కోరవచ్చో చూపించండి.
పాట 130 (58) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 23తో ప్రారంభమయ్యే వారం
పాట 100 (59)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “మనకు సంఘం అవసరం.” ప్రశ్నా జవాబులు.
20 నిమి: సంస్థవైపు ఆసక్తిని మళ్లించండి. యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అనే బ్రోషూరును ఉపయోగిస్తూ, సేవాధ్యక్షుడు ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులతో చర్చ నిర్వహిస్తాడు. సంస్థ ఎలా పనిచేస్తుందో, వివిధ కార్యాలు ఎలా ఏర్పాటు చేయబడతాయో, వాటిలో వారెలా ఇమిడి ఉండవచ్చో ఆసక్తిగల వారికి తెలియజేయడం ఎందుకు ప్రయోజనకరమైనదో వివరించండి. 14 మరియు 15 పేజీల్లోగల “ప్రేమ, సత్కార్యములను పురికొల్పజేసే కూటములు” అనేదాని నుండి విషయాలను పునఃసమీక్షించండి. హాజరవ్వవలసిన అవసరతను ఆసక్తిగల వ్యక్తి గుణగ్రహించేందుకు సహాయం చేయడానికి పునర్దర్శనంలో లేదా బైబిలు పఠన సమయంలో ఈ సమాచారాన్ని ఎలా ఇమిడ్చవచ్చో ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులు క్లుప్తంగా ప్రదర్శించాలి.
పాట 126 (10) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 159 (67)
10 నిమి: స్థానిక ప్రకటనలు. డిశంబరులో లోక సంబంధమైన సెలవు దినాలు ఉన్నాయి గనుక, సహాయ పయినీర్లుగా పేర్లు నమోదు చేసుకోవడం గురించి తలంచమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: పరిచయం చేయబడినవారి దగ్గరికి మీరు వెళ్లారా? ప్రసంగం. కొంతమంది ప్రచారకులు ఈ విధంగా క్రొత్త బైబిలు పఠనాలు ప్రారంభించగలిగారు: ఆసక్తిగల ఒక వ్యక్తితో కొంతకాలం పఠించిన తర్వాత, మీ స్నేహితులు, బంధువులు, లేక పరిచయస్థులలో బైబిలు పఠనమందు ఆసక్తిగలవారెవరైనా మీకు తెలుసా అని వారు ఆ వ్యక్తిని అడుగుతారు. తరచూ కొన్ని పేర్లు ఇవ్వబడతాయి. ఈ వ్యక్తులను కలిసేటప్పుడు అతని పేరు చెప్పవచ్చేమో ఆ వ్యక్తిని అడగండి. వారి దగ్గరకి వెళ్లినప్పుడు, మీరిలా చెప్పవచ్చు: “ఫలానా వ్యక్తి బైబిలు పఠనాన్ని ఎంతగా ఆనందిస్తున్నాడంటే, మా ఉచిత బైబిలు పఠన కార్యక్రమం నుండి మీరు కూడా ప్రయోజనం పొందడానికి ఇష్టపడతారని అతడు తలంచాడు.” ఫలవంతమైన బైబిలు పఠనాలుగా వృద్ధిచెందగల పునర్దర్శనాల ఉపయోగకరమైన పట్టికను ఇది అందజేయగలదు. ఈ విధంగా ఆసక్తిగలవారిని కనుగొన్న లేదా క్రొత్త పఠనాలు ప్రారంభించిన ప్రచారకుల నుండి ఒకటి లేక రెండు అనుభవాలను చేర్చండి.
20 నిమి: నవంబరులో బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకంతోపాటు నూతనలోక అనువాదం (ఆంగ్లం) అందజేయడం. తర్కించుట పుస్తకం 276-80 పేజీల్లో గల నూతనలోక అనువాదం యొక్క విశేషతను పునఃసమీక్షించండి. అది ఎందుకు తయారు చేయబడిందో వివరిస్తూ, “నిర్వచనం” చదవండి. నూతనలోక అనువాదం అందించడాన్ని గూర్చి అనుకూల దృక్పథం కలిగివుండమని, అలాగే మీ భాషలో లభ్యమౌతున్న 192 పేజీల పాత పుస్తకాలను లేదా మన రాజ్య పరిచర్యలో ఈ నెల కొరకు సూచించబడిన ఇతర పుస్తకాల్లో ఒకదాన్ని వెంట ఉంచుకొనమని కూడా అందరినీ ప్రోత్సహించండి. బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకంలోని 184వ పేజీలోగల 14వ అధ్యాయాన్ని గూర్చిన పరిచయ వ్యాఖ్యానాలను ఉపయోగిస్తూ, సమర్థుడైన ప్రచారకుడు క్లుప్త అందింపును ప్రదర్శించాలి. రెండవ ప్రదర్శన, స్థానికంగా ఉపయోగించే ప్రత్యామ్నాయ పుస్తక అందింపును చూపించేదై ఉండాలి. ఈ వారం సేవలో ఉపయోగించడానికి ప్రతులను తీసుకోమని అందరికి గుర్తుచేయండి.
పాట 138 (71) మరియు ముగింపు ప్రార్థన.