బైబిలు విలువను గుణగ్రహించడానికి ఇతరులకు సహాయపడండి
1 తన శిష్యులకు అవసరమైన దానిని యేసుక్రీస్తు ఇచ్చాడు. లూకా 24:45 ఈ విధంగా నివేదిస్తుంది: ‘వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు.’ వారు తన తండ్రి అంగీకారాన్ని పొందాలంటే, వారు దేవుని వాక్యమైన బైబిలును పఠించి, అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమని ఆయనకు తెలుసు. (కీర్త. 1:1, 2) మన ప్రకటన పనికి అదే ఉద్దేశం ఉంది. ‘యేసు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ గైకొనవలెనని’ మనం ‘ప్రజలను బోధించగల’ చోట బైబిలు పఠనాలను ఆరంభించడమే మన లక్ష్యం. (మత్తయి 28:20) దీని దృష్ట్యా, మీరు పునర్దర్శనాలను చేసేటప్పుడు మీకు సహాయకంగా ఉండే కొన్ని సలహాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
2 మీరు మొదట్లో “బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా?” అనే పుస్తకాన్ని గూర్చి చర్చించినట్లయితే మీరు ఈ విధంగా చర్చను కొనసాగించవచ్చు:
◼ “బైబిలు సలహాలోని ఆచరణాత్మక విలువను ఉదాహరించే ఒక దానిని మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇతరులతో సర్దుకుపోవడం కష్టమైనట్లు అనేకులు కనుగొంటారు. మన చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాన్ని పెంపొందించుకునేందుకు మనమేమి చేయగలం? [ప్రతిస్పందించిన తరువాత, 167-8 పేజీల్లోని 15వ పేరాలోని మత్తయి 7:12 చదవండి. 16వ పేరాలో వ్యక్తం చేయబడిన తలంపులను జత చేయండి.] బైబిలు సలహాలో కనుగొనబడిన జ్ఞానానికి ఇది మరొక ఉదాహరణ. నేను ఈ సారి వచ్చినప్పుడు, వివాహిత దంపతులకు తమ బంధంలో మరింత సంతోషాన్ని పొందేందుకు సహాయపడే బైబిలు ఇచ్చే సలహాను మీకు చూపిస్తాను.” 170-2 పేజీల్లోని సంతోషకరమైన కుటుంబ జీవితానికి బైబిలు ఏమని సిఫారసు చేస్తుందో చూపిస్తున్న దానిని చర్చించడానికి తిరిగి వెళ్ళేందుకు ఏర్పాటు చేయండి.
3 బైబిలులో ఆసక్తి చూపించిన ఎవరితోనైనా మీరు మాట్లాడినట్లయితే, మీరు ఈ విధంగా చేయడం ఒక పఠనాన్ని ఆరంభించడంలో ప్రభావవంతంగా ఉండవచ్చు:
◼ “మీతో మాట్లాడే వారందరూ తాము శాంతిపూర్ణమైన మరియు భద్రత గల లోకంలో జీవించాలని ఇష్టపడుతున్నానని మీతో చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నట్లయితే, మరి లోకం ఎందుకు మరీ ఇంత సంక్షోభంతోను హింసతోను నిండి ఉంది? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రశ్నలకు జవాబును బైబిలులో ఎక్కడ కనుగొనగలరో నూతనలోక అనువాదం మీకు చూపిస్తుంది.” 1659వ పేజీని త్రిప్పి, “బైబిలు చర్చనీయాంశములు” లోని నెం. 43ఎ చూపించండి. “లోకంలోని కలతకు ఎవరు బాధ్యులు.” 2 కొరింథీయులు 4:4 చదవండి. దేవుడు ఎలా అపవాదిని నాశనం చేసి, నిత్యమైన సమాధాన సంతోషాలు గల లోకాన్ని తెస్తాడో వివరించండి. ప్రకటన 21:3, 4 చదవండి. మీరు అప్పుడు ఇలా చెప్పవచ్చు: “నేను మళ్ళీ వచ్చినప్పుడు, కలతలు లేని లోకం కొరకు మీరెందుకు ఎదురు చూడగలరో వివరించే కొన్ని లేఖనాలను చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను.”
4 గృహస్థుడు 192 పేజీల పాత పుస్తకాల్లో ఏదైన ఒకటి తీసుకున్నట్లయితే, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మేము క్రితంసారి మాట్లాడినప్పుడు, బైబిలును పఠించడం ఎందుకు ప్రయోజనకరమనే కొన్ని కారణాలను చర్చించాం. దీనిని మరింత చేయడానికి యథార్థంగా పని చేయడం దేవుడు మన కోసం ఏమి దాచి ఉంచాడో గుణగ్రహించడానికి సహాయపడగలదు. [యోహాను 17:3 చదవండి.] దేవుడు ఏమి వాగ్దానం చేశాడు, మనమాయనను ఎలా ప్రీతిపర్చవచ్చు అనే విషయాలను గూర్చి ఎక్కువగా నేర్చుకోవడానికి వేలాదిమందికి సహాయపడిన ఒక పఠన కార్యక్రమాన్ని మేము వృద్ధి చేశాం.” గృహస్థుడు అంగీకరించిన ప్రచురణ ఏదైనప్పటికీ, దానిలోని అధ్యాయాల శీర్షికలను పునఃసమీక్షించి, మనమెలా బైబిలు పఠనాలను నిర్వహిస్తామో ప్రదర్శించండి.
5 దేవుని వాక్యం యొక్క శ్రేష్ఠమైన విలువను గుణగ్రహించేందుకు యథార్థపరులైన వ్యక్తులకు మీరు సహాయపడగలిగినట్లయితే, మీకు సాధ్యమైనంత శ్రేష్ఠమైన మార్గంలో మీరు వారికి సహాయం చేశారన్నమాట. దానిలోని పుటలను పఠించడం వలన వారు నేర్చుకోగల బుద్ధి వారికి మరింత సంతోషాన్నిచ్చే “జీవవృక్షము” కాగలదు.—సామె. 3:18.