కీర్తనలు
96 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.+
భూమ్మీదున్న సమస్త ప్రజలారా, యెహోవాకు పాట పాడండి!+
2 యెహోవాకు పాట పాడండి; ఆయన పేరును స్తుతించండి.
ప్రతీరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి.+
4 యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు.
దేవుళ్లందరి కంటే పూజనీయుడు.*
7 దేశదేశాల కుటుంబాల్లారా, యెహోవాకు తగిన ఘనత ఆయనకు ఇవ్వండి;
యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ఆయనకు తగిన ఘనత ఇవ్వండి.+
9 పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి;*
భూమ్మీదున్న సమస్త ప్రజలారా, ఆయన ముందు వణకండి!
10 దేశాల మధ్య ఇలా చాటించండి: “యెహోవా రాజయ్యాడు!+
భూమి* స్థిరంగా స్థాపించబడింది, దాన్ని కదిలించలేరు.*
దేశదేశాల ప్రజలకు ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు.”*+
11 ఆకాశం సంతోషించాలి, భూమి ఆనందించాలి;
సముద్రం, దానిలో ఉన్నవన్నీ సంతోషంతో ఘోషించాలి;
12 పొలాలు, వాటిలో ఉన్నవన్నీ ఉల్లసించాలి.+