కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/93 పేజీ 2
  • సెప్టెంబరు కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 6తో ప్రారంభమగు వారము
  • సెప్టెంబరు 13తో ప్రారంభమగు వారము
  • సెప్టెంబరు 20తో ప్రారంభమగు వారము
  • సెప్టెంబరు 27తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1993
km 9/93 పేజీ 2

సెప్టెంబరు కొరకు సేవా కూటములు

గమనిక: సమావేశ కాలంలో ప్రతి వారానికి ఒక సేవా కూటాన్ని ఏర్పాటు చేయుటకు మన రాజ్య పరిచర్య పట్టిక నిస్తుంది. “దైవిక బోధ” జిల్లా సమావేశానికి హాజరగుటకు వీలుగా సంఘాలు అవసరాన్ని బట్టి సర్దుబాట్లు చేసుకోవచ్చు, ఆ తరువాతి వారం సేవా కూటములో కార్యక్రమము యొక్క ముఖ్యాంశాలను 30-నిమిషాలు పునఃపరిశీలించ వచ్చును. జిల్లాసమావేశ కార్యక్రమ ప్రతిదిన పునఃసమీక్ష చేయడానికి ఇద్దరు లేక ముగ్గురు అర్హతగల సహోదరులను ముందుగానే నియమించాలి అపుడు వారు ముఖ్యాంశాలను ఉన్నత పర్చగల్గుతారు. వ్యక్తిగతంగా అనుసరించటానికి, క్షేత్రంలో ఉపయోగించటానికి ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవటానికి బాగా సిద్ధంచేయబడిన ఈ పునఃసమీక్ష సంఘానికి సహాయపడుతుంది. ప్రేక్షకుల నుండి జవాబులు, వివరించబడిన అనుభవాలు క్లుప్తంగా, సూటిగా వుండాలి.

సెప్టెంబరు 6తో ప్రారంభమగు వారము

పాట 164 (73)

5 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకొనబడిన ప్రకటనలు.

15 నిమి: పాఠశాల కొరకు మీ పిల్లలను బలపర్చండి. ఇంటర్‌వ్యూలు, ప్రదర్శనలతో కూడిన ప్రసంగము. సంఘంలో చాలామంది వూహించను కూడా వూహించలేని విషయాలను ఈనాడు క్రైస్తవ యౌవనస్థులు ఎదుర్కొంటున్నారు. యథార్థతా పరీక్షలను ఎదుర్కొనుటకు తమ పిల్లలను బలపర్చటానికి వీలుగా తలిదండ్రులు ప్రాముఖ్యంగా ఈ సవాళ్లను గూర్చి బాగా ఎరిగివుండాలి. వివిధ వయస్కులైన ముగ్గురు యౌవనస్థులను ఇంటర్‌వ్యూ చేయండి. వారు ప్రతిరోజు పాఠశాలలో ఎదుర్కోవలసిన కొన్ని ప్రత్యేకమైన వత్తిడులు ఏమిటి? యెహోవాతో వారు తమ మంచి సంబంధాన్ని కొనసాగించుటకు వారికి ఏది సహాయం చేస్తుంది? స్కూల్‌ బ్రోషూరులోని 11వ పేజిలోని 2, 3 పేరాలను కుటుంబంగా కలిసి పరిశీలించుటను ప్రదర్శించుటకు ఏర్పాటు చేయండి. బైబిలు నందలి ఉన్నత నైతిక ప్రమాణాలను పాటిస్తున్నందుకు తాము వెలివేయబడినట్లు భావిస్తున్నామని, తాము ఎగతాళి చేయబడుతున్నామని పిల్లలు తెలియజేస్తారు. వారి మాదిరిని బట్టి తాను సంతోషిస్తున్నానని, వారి ప్రవర్తనను బట్టి యెహోవా ఆనందిస్తాడని కుటుంబ శిరస్సు పిల్లలను ప్రోత్సహించి, వారికి గుర్తుచేస్తాడు. (సామెతలు 27:11) ఈ అంశాన్ని నిర్వహిస్తున్న సహోదరుడు వారి మంచి పనులనుబట్టి సంఘంలోని యౌవనస్థులను మెచ్చుకొంటూ, ఈ పాఠశాల సంవత్సరమంతా ఆత్మీయంగా బలపర్చబడటానికి వారు తమ తలిదండ్రులతో సంభాషించాలని వారిని ప్రోత్సహిస్తూ ముగిస్తాడు.

10 నిమి: “గొప్ప నిధిని కనుగొనుటకు ఇతరులకు సహాయం చేయుట.” ప్రశ్న సమాధానముల చర్చ.

15 నిమి: “ఈ 1993 సంవత్సరపు ‘దైవిక బోధ’ జిల్లా సమావేశం నుండి పూర్తిగా మేలు పొందండి”—1 భాగం. 1-16 పేరాలు ప్రేక్షకులతో చర్చ. సమావేశానికి హాజరయ్యే తమ బైబిలు విద్యార్థులతో తగిన విషయాలను ప్రచారకులు చర్చించాలి.

పాట 108 (95) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 13తో ప్రారంభమగు వారము

పాట 112 (59)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్సు రిపోర్టు మరియు విరాళముల కొరకు కృతజ్ఞతలు తెలపండి. స్థానిక అవసరతలకు అలాగే సంస్థ ప్రపంచ వ్యాప్త పనికొరకు ఇచ్చిన విస్తృత మద్దతు కొరకు సంఘాన్ని మెచ్చుకొనండి.

10 నిమి: “పత్రికలు ఉపయోగించుట ద్వారా ఇతరులకు మేలుచేయండి.” ప్రదర్శనలతో ప్రసంగము. పత్రికలలో పాత, క్రొత్త సంచికలను కూడా పూర్తిగా ఉపయోగించుటలోని విలువను ఉన్నతపర్చండి. క్రొత్త సంచికను ఉపయోగిస్తూ ఒక ప్రదర్శన, మరొక ప్రదర్శనలో పాత సంచికను ఉపయోగిస్తూ గృహస్థుని ప్రత్యేక అవసరానికి తగినట్లు ఎలా ఉపయోగించవచ్చో చూపించే రెండు ప్రదర్శనలు చేయండి.

15 నిమి: “ఈ సేవా సంవత్సరంలో మనమేమి సాధిస్తాము?” ప్రేక్షకుల చర్చతో ప్రసంగం. సంఘాధ్యక్షుడు నిర్వహించును. సంఘం యొక్క గత సంవత్సరపు సేవను పునఃసమీక్షించి, 1994 సేవా సంవత్సరంలో పనినధికం చేసేందుకు ప్రణాళిక వేసుకొమ్మని ప్రోత్సహించును.

15 నిమి: “ఈ 1993 సంవత్సరపు ‘దైవిక బోధ’ జిల్లా సమావేశం నుండి పూర్తిగా మేలు పొందండి”—2వ భాగం. 17-19 పేరాలను ప్రేక్షకులతో చర్చించి, “జిల్లా సమావేశ జ్ఞాపికలను” జాగ్రత్తగా పునఃపరిశీలించండి. జూన్‌ 15, 1989 కావలికోట 10-20 పేజీలలోని సమాచారాన్ని ఆధారం చేసుకుని తగిన జ్ఞాపికలను జతచేయండి లేక సమావేశానికి హాజరుకాక ముందు ఈ శీర్షికలలోని విషయాలను పునఃపరిశీలించమని కుటుంబాలను ప్రోత్సహించండి. పాట 17 (12) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 20తో ప్రారంభమగు వారము

పాట 100 (28)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారాంతములో ప్రాంతీయసేవయందు ఉపయోగించదగిన ఇటీవలి పత్రికలలోని శీర్షికలను ఉన్నతపర్చండి.

20 నిమి: “గట్టి పునాదిపై కట్టబడుటకు గొర్రెలవంటి ప్రజలకు సహాయం చేయండి.” ప్రేక్షకులతో చర్చించండి. ప్రతి పునర్దర్శనానికి సిద్ధపడు అవసరతను ఉన్నతపర్చండి. మునుపు నిరంతరము జీవించగలరు పుస్తకం తీసుకున్న వ్యక్తిని తిరిగి దర్శిస్తున్నట్లు 3 లేక 5 పేరాల్లోవున్న సమాచారాన్ని ఉపయోగిస్తూ ఒక అర్హతగల ప్రచారకుడు ప్రదర్శించులాగున ఏర్పాటు చేయండి.

15 నిమి: “గృహ బైబిలు పఠనాలు ప్రారంభించుట.” ప్రశ్నాసమాధానములు. నాలుగవ పేరా తరువాత, సూచింపబడిన ప్రకారం నిరంతరము జీవించగలరు లేక రీజనింగ్‌ పుస్తకాల్లోని భాగాల ఆధారంగా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగిస్తూ పునర్దర్శనం చేస్తున్నట్లు ఒక ఉత్తేజకరమైన ప్రదర్శనను పరిచయం చేయండి.

పాట 84 (30) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 27తో ప్రారంభమగు వారము

పాట 109 (18)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.

20 నిమి: చనిపోయిన మన ప్రియులు ఎక్కడవున్నారు? కుటుంబ చర్చ. రీజనింగ్‌ పుస్తకం నుండి 98-100 పేజీలలోని ఎంపిక చేసుకొనిన సమాచారాన్ని ఉపయోగిస్తూ, సన్నిహిత కుటుంబ స్నేహితుని మరణం ద్వారా కలిగిన నష్టాన్ని కుటుంబ శిరస్సు చర్చిస్తాడు. బైబిలు ఉద్దేశాన్ని అర్థం చేసుకొనుటకు తన పిల్లలకు సహాయం చేయుటకు ఆయన దృష్టిని కేంద్రీకరిస్తాడు. మరణం అంటే ఏమిటి అనేది వారు గ్రహించుకున్నారని, వారి వయస్సునుబట్టి వారు తమ తలంపులను వ్యక్తపర్చగలుగుతున్నారని కచ్చితంగా తెలుసుకొనుటకు అతడు వారిని ప్రశ్నలు అడుగుతాడు. ఇతరులను ఓదార్చుటకు వారు రీజనింగ్‌ పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చో కూడా ఆయన చూపిస్తాడు.

15 నిమి: అక్టోబరు నెలలో పత్రికలను అందజేయండి. ఇటీవలి కావలికోటను ఒక ప్రదర్శనలో, ఇటీవలి అవేక్‌! పత్రికను మరో ప్రదర్శనలో, గృహస్థుడు పనితొందరలో వుండడం చేత కరపత్రాన్ని తీసుకున్నట్లు ఇంకొక ప్రదర్శనలో, ఇలా మూడు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. ప్రతి ప్రదర్శన తరువాత, ఆ ప్రదర్శన ఎందుకు ప్రభావవంతంగా వున్నదో ప్రేక్షకులతో చర్చించండి. తగిన ఆసక్తి కనపర్చినప్పుడు, పత్రిక కొరకు చందా లేదా మాన్‌ కైండ్స్‌ సర్చ్‌ ఫర్‌ గాడ్‌ అందజేయవచ్చు.

పాట 21 (1) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి