ఫిబ్రవరిలోని సేవా కూటాలు
ఫిబ్రవరి 2తో ప్రారంభమయ్యే వారం
పాట 166 (15)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “యెహోవాసాక్షులు—నిజమైన సువార్తికులు.” ప్రశ్నా జవాబులు. కావలికోట డిసెంబరు 1, 1992లో 12వ పేజీలో ఉన్న బాక్సును పునఃసమీక్షించండి.
20 నిమి: “దప్పిగొన్న ప్రతి ఒక్కరినీ ఆహ్వానించండి.” ఇవ్వబడిన అందింపులు వినువారి ఆసక్తిని పెంపొందించి, ప్రేరేపించేందుకు ఎలా తయారుచేయబడ్డాయో సూచిస్తూ, శీర్షికను పునఃసమీక్షించండి. 2-3 పేరాలను లేక 4-5 పేరాలను ఒక వయోజనుడూ, 6వ పేరాను ఒక యౌవనుడూ ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయండి.
పాట 208 (8), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 9తో ప్రారంభమయ్యే వారం
పాట 96 (6)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం”ను పునఃసమీక్షించండి.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: “అన్ని భాషలకూ, మతాలకూ చెందిన ప్రజలకు సాక్ష్యమివ్వడం.” (1-8 పేరాలు) ప్రశ్నా జవాబులు. మీ ప్రాంతంలో ఉపయోగించే భాషగాక ఏ ఇతర భాషలను ఎక్కువమంది మాట్లాడతారో పేర్కొని, ఆ భాషల్లో సంఘం వద్ద స్టాకులో ఉన్న సాహిత్యాల్ని చూపించండి. 8వ పేరాలో వర్ణించినట్లుగా సకల జనులకు సువార్త అనే చిన్నపుస్తకం ఉపయోగాన్ని ప్రదర్శించి చూపండి.
పాట 220 (29), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 16తో ప్రారంభమయ్యే వారం
పాట 75 (22)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
12 నిమి: సంఘ కూటాలకు మీరు హాజరవ్వడానికిగల కారణాలు. కూటాలకు హాజరవ్వాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, కావలికోట ఆగస్టు 15, 1993, 8-11 పేజీల్లోని ముఖ్య విషయాల్ని పెద్ద చర్చిస్తాడు.
18 నిమి: “అన్ని భాషలకూ, మతాలకూ చెందిన ప్రజలకు సాక్ష్యమివ్వడం.” (9-24 పేరాలు) ప్రశ్నా జవాబులు. ఒక హిందువుకో, ఒక ముస్లిమ్‌కో బౌద్ధమతస్థునికో లేక యూదునికో అంటే మీ ప్రాంతంలో ఏ మతస్థులు ఎక్కువగా ఉంటే వాళ్లకు ప్రారంభ సాక్ష్యాన్ని ఎలా ఇవ్వవచ్చో అనుభవంగల ప్రచారకులు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయండి.
10 నిమి: “యెహోవా నాకు సహాయుడు.” పెద్ద ఇచ్చే ఉత్సాహపూరితమైన, ప్రోత్సాహకరమైన ప్రసంగం.
పాట 15 (2), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 23తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (29)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి నెల కొరకైన సాహిత్య అందింపును పునఃసమీక్షించండి. మన రాజ్య పరిచర్య మార్చి 1996, 4వ పేజీలో ఇవ్వబడిన విషయాల్ని ఉపయోగిస్తూ జ్ఞానము పుస్తకాన్ని ఎలా ఇస్తారో ఒకటి రెండు అభిప్రాయాంశాల్ని ప్రస్తావించండి. గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించాలన్న లక్ష్యాన్ని కలిగి ఉండాలని నొక్కి చెప్పండి.
15 నిమి: “అది ఫలితాల్ని తెస్తే, దాన్నే ఉపయోగించండి.” ప్రశ్నా జవాబులు. తాము ఉపయోగించే అందింపులు సరళంగావున్న కారణాన్ని బట్టి మరియు అవి చక్కని ఫలితాల్ని తీసుకొస్తున్న కారణాన్ని బట్టి వాటిని ఉపయోగించడంలో కొనసాగిన ఒకరిద్దరు అనుభవంగల ప్రచారకులు ప్రేక్షకులలోనుండి వాటిపై వ్యాఖ్యానించేందుకు ఏర్పాటు చేయండి. అటు తర్వాత, మన రాజ్య పరిచర్యలో ఇటీవల ఇవ్వబడిన, ప్రతిభావంతమైనవని రుజువైన కొన్ని అందింపులను గురించి కొందరు వ్యాఖ్యానించేందుకు ఏర్పాటు చేయండి.
20 నిమి: మీ అందింపులను ప్రాక్టీస్ చేయండి. పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం), 98-9 పేజీల్లో 8-9 పేరాల ఆధారంగా చిన్న ప్రసంగం. మన అందింపులను విశ్లేషించుకొని, మరింత ప్రతిభావంతులుగా తయారయ్యేందుకుగల మార్గాల కొరకు చూడాల్సిన అవసరతను నొక్కి చెప్పండి. ఇద్దరు సహోదరీలు తాము ఒక ఇంటివద్ద ఇచ్చిన సాక్ష్యాన్ని ఎలా విశ్లేషించుకుంటారో ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయండి, మరియు తామెలా మెరుగుపర్చుకోగలమనే విషయాన్ని వాళ్లు చర్చించడాన్ని అందులో ఇమడ్చండి. ఈసారి తాము ఉపయోగించాలని వాళ్లు అనుకుంటున్న అందింపును వాళ్లు క్లుప్తంగా ప్రాక్టీస్ చేసి చూస్తారు, మరి వాళ్లు ఒకరికొకరు సహాయకరమైన సలహాల్ని ఇచ్చుకుంటూ అలా చేస్తారు. తమ అందింపులను విశ్లేషించుకొని, ప్రాక్టీస్ చేయమని అధ్యక్షుడు అందర్నీ ప్రోత్సహిస్తూ ముగిస్తాడు.
పాట 103 (11), ముగింపు ప్రార్థన.