కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • యిర్మీయా తీవ్ర ఆవేదన (1-3ఎ)

      • యెహోవా యూదాను లెక్క అడగడం (3బి-16)

      • యూదాను బట్టి విలపించడం (17-22)

      • యెహోవాను తెలుసుకోవడాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవాలి (23-26)

యిర్మీయా 9:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 22:4; యిర్మీ 13:17

యిర్మీయా 9:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:7; 23:10

యిర్మీయా 9:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 59:3
  • +యిర్మీ 4:22

యిర్మీయా 9:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 12:6; మీకా 7:2, 5
  • +యిర్మీ 6:28; యెహె 22:9

యిర్మీయా 9:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 50:19; మీకా 6:12

యిర్మీయా 9:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:25; 48:10

యిర్మీయా 9:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:9, 29

యిర్మీయా 9:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:25; జెఫ 1:3

యిర్మీయా 9:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 79:1; యిర్మీ 26:18
  • +యిర్మీ 10:22
  • +యిర్మీ 4:27; 25:11; 32:43

యిర్మీయా 9:13

అధస్సూచీలు

  • *

    లేదా “ఉపదేశాన్ని.”

యిర్మీయా 9:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:24
  • +న్యా 3:7; 1స 12:10; హోషే 11:2

యిర్మీయా 9:15

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 8:14; 23:15; విలా 3:15, 19

యిర్మీయా 9:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:33; ద్వితీ 28:64; కీర్త 106:27; జెక 7:14
  • +యిర్మీ 29:17; యెహె 5:2

యిర్మీయా 9:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 35:25

యిర్మీయా 9:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:26; 14:17

యిర్మీయా 9:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:31; యెహె 7:16; మీకా 1:8, 9
  • +విలా 4:15; మీకా 2:10

యిర్మీయా 9:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:29

యిర్మీయా 9:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:17; యిర్మీ 6:11

యిర్మీయా 9:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:25; యిర్మీ 16:3, 4

యిర్మీయా 9:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:12-14, 17, 18

యిర్మీయా 9:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 1:31; 2కొ 10:17
  • +నిర్గ 34:6
  • +హోషే 6:6; మీకా 6:8; 7:18

యిర్మీయా 9:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 3:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2013, పేజీలు 9-10

యిర్మీయా 9:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 29:2
  • +యెష 1:1
  • +యెహె 32:29; ఓబ 1
  • +యిర్మీ 49:1
  • +యెష 15:1
  • +యిర్మీ 25:17, 23; 49:32
  • +లేవీ 26:41; యిర్మీ 4:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2013, పేజీలు 9-10

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 9:1యెష 22:4; యిర్మీ 13:17
యిర్మీ. 9:2యిర్మీ 5:7; 23:10
యిర్మీ. 9:3యెష 59:3
యిర్మీ. 9:3యిర్మీ 4:22
యిర్మీ. 9:4యిర్మీ 12:6; మీకా 7:2, 5
యిర్మీ. 9:4యిర్మీ 6:28; యెహె 22:9
యిర్మీ. 9:5కీర్త 50:19; మీకా 6:12
యిర్మీ. 9:7యెష 1:25; 48:10
యిర్మీ. 9:9యిర్మీ 5:9, 29
యిర్మీ. 9:10యిర్మీ 4:25; జెఫ 1:3
యిర్మీ. 9:11కీర్త 79:1; యిర్మీ 26:18
యిర్మీ. 9:11యిర్మీ 10:22
యిర్మీ. 9:11యిర్మీ 4:27; 25:11; 32:43
యిర్మీ. 9:14యిర్మీ 7:24
యిర్మీ. 9:14న్యా 3:7; 1స 12:10; హోషే 11:2
యిర్మీ. 9:15యిర్మీ 8:14; 23:15; విలా 3:15, 19
యిర్మీ. 9:16లేవీ 26:33; ద్వితీ 28:64; కీర్త 106:27; జెక 7:14
యిర్మీ. 9:16యిర్మీ 29:17; యెహె 5:2
యిర్మీ. 9:172ది 35:25
యిర్మీ. 9:18యిర్మీ 6:26; 14:17
యిర్మీ. 9:19యిర్మీ 4:31; యెహె 7:16; మీకా 1:8, 9
యిర్మీ. 9:19విలా 4:15; మీకా 2:10
యిర్మీ. 9:20యిర్మీ 7:29
యిర్మీ. 9:212ది 36:17; యిర్మీ 6:11
యిర్మీ. 9:22యెష 5:25; యిర్మీ 16:3, 4
యిర్మీ. 9:23ద్వితీ 8:12-14, 17, 18
యిర్మీ. 9:241కొ 1:31; 2కొ 10:17
యిర్మీ. 9:24నిర్గ 34:6
యిర్మీ. 9:24హోషే 6:6; మీకా 6:8; 7:18
యిర్మీ. 9:25ఆమో 3:1, 2
యిర్మీ. 9:26యెహె 29:2
యిర్మీ. 9:26యెష 1:1
యిర్మీ. 9:26యెహె 32:29; ఓబ 1
యిర్మీ. 9:26యిర్మీ 49:1
యిర్మీ. 9:26యెష 15:1
యిర్మీ. 9:26యిర్మీ 25:17, 23; 49:32
యిర్మీ. 9:26లేవీ 26:41; యిర్మీ 4:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 9:1-26

యిర్మీయా

9 నా తల బావిలా,

నా కళ్లు కన్నీటి ఊటలా ఉంటే ఎంత బావుండు!+

అప్పుడు నా ప్రజల్లో హతులైనవాళ్ల గురించి

నేను రాత్రింబగళ్లు ఏడుస్తాను.

 2 బస చేయడానికి ఎడారిలో నాకో స్థలం ఉంటే ఎంత బావుండు!

అప్పుడు నేను నా ప్రజల్ని విడిచి దూరంగా వెళ్తాను;

ఎందుకంటే వాళ్లంతా వ్యభిచారులు,+ మోసగాళ్ల ముఠా.

 3 వాళ్లు తమ నాలుకను విల్లులా వంచుతారు;

దేశంలో నమ్మకత్వానికి బదులు అబద్ధమే రాజ్యమేలుతోంది.+

“వాళ్లు అంతకంతకూ నీచంగా తయారౌతున్నారు,

నన్ను ఏమాత్రం లెక్కచేయట్లేదు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

 4 “ప్రతీ ఒక్కరు తమ పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి,

సొంత సహోదరుణ్ణి కూడా నమ్మకండి.

ఎందుకంటే ప్రతీ సహోదరుడు నమ్మకద్రోహి,+

ప్రతీ పొరుగువాడు లేనిపోనివి కల్పించి చెప్పేవాడు.+

 5 ప్రతీ వ్యక్తి తన పొరుగువాణ్ణి మోసం చేస్తున్నాడు,

ఒక్కరూ నిజం మాట్లాడట్లేదు.

వాళ్లు తమ నాలుకకు అబద్ధాలాడడం నేర్పించారు.+

తప్పులు చేసీచేసీ అలసిపోతున్నారు.

 6 నువ్వు మోసం మధ్య జీవిస్తున్నావు.

వాళ్లు మోసం చేయడంలో మునిగిపోయి నన్ను తెలుసుకోవడానికి ఇష్టపడలేదు” అని యెహోవా అంటున్నాడు.

 7 కాబట్టి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“నేను వాళ్లను కొలిమిలో వేసి శుద్ధి చేస్తాను,+

నా ప్రజల కూతురికి నేను ఇంతకన్నా ఏం చేయగలను?

 8 వాళ్ల నాలుక ప్రాణాలు తీసే బాణం, అది మోసపు మాటలు మాట్లాడుతుంది.

ఒక వ్యక్తి తన పొరుగువానితో పైకి శాంతిగా మాట్లాడతాడు,

కానీ లోపల అతని మీద కుట్ర పన్నుతాడు.”

 9 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా?

ఇలాంటి దేశం మీద నేను పగ తీర్చుకోవద్దా?+

10 నేను పర్వతాల గురించి ఏడుస్తాను, విలపిస్తాను,

ఎడారిలోని పచ్చిక మైదానాల గురించి శోకగీతం పాడతాను,

ఎందుకంటే అవి కాల్చేయబడ్డాయి,

ఏ మనిషీ వాటి మీదుగా వెళ్లట్లేదు, పశువుల అరుపులు వినబడట్లేదు,

ఆకాశపక్షులు ఎగిరిపోయాయి, జంతువులు పారిపోయాయి; ఇక లేవు.+

11 నేను యెరూషలేమును రాళ్లకుప్పలా,+ నక్కలకు నివాస స్థలంగా చేస్తాను,+

యూదా నగరాల్ని ఒక్క నివాసి కూడా లేని నిర్జన ప్రదేశాలుగా మారుస్తాను.+

12 దీన్ని అర్థం చేసుకునేంత తెలివి ఎవరికుంది?

ఈ మాటల్ని ప్రకటించేలా యెహోవా వాటిని ఎవరికి చెప్పాడు?

దేశం ఎందుకు నశించిపోయింది?

ఎవ్వరూ దాని గుండా వెళ్లకుండా

ఎడారిలా ఎందుకు ఎండిపోయింది?”

13 యెహోవా ఇలా జవాబిచ్చాడు: “ఎందుకంటే నేను వాళ్లకు ఇచ్చిన నా ధర్మశాస్త్రాన్ని* వాళ్లు తిరస్కరించారు, దాన్ని అనుసరించలేదు, నా మాట వినలేదు. 14 బదులుగా వాళ్లు మొండిగా తమకు నచ్చిందే చేశారు,+ తమ తండ్రులు నేర్పించినట్టు బయలు విగ్రహాల్ని అనుసరించారు.+ 15 కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఈ ప్రజలతో మాచిపత్రి* తినిపిస్తాను, విషం కలిపిన నీళ్లు తాగిస్తాను.+ 16 వాళ్లకు గానీ వాళ్ల తండ్రులకు గానీ తెలియని దేశాల మధ్యకు వాళ్లను చెదరగొడతాను,+ నేను వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేంతవరకు వాళ్ల వెనక ఖడ్గాన్ని పంపిస్తాను.’+

17 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

‘అవగాహనతో ప్రవర్తించండి.

శోకగీతాలు పాడే స్త్రీలను,+

నైపుణ్యంగల స్త్రీలను పిలిపించండి.

18 వాళ్లు త్వరగా వచ్చి మన కోసం విలాపగీతం పాడాలి.

అప్పుడు మన కళ్లలో నుండి కన్నీళ్లు ధారలా ప్రవహిస్తాయి,

మన కనురెప్పల నుండి కన్నీటి చుక్కలు రాలతాయి.+

19 ఎందుకంటే సీయోను నుండి విలాప శబ్దం వినిపిస్తోంది:+

“అయ్యో, మనం నశించిపోయామే!

మనం ఇంత ఘోరంగా అవమానం పొందామే!

మనం దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందే, శత్రువులు మన ఇళ్లను కూలగొట్టారే.”+

20 స్త్రీలారా, యెహోవా మాట వినండి.

మీ చెవి ఆయన నోటి మాటను అంగీకరించాలి.

మీ కూతుళ్లకు ఈ విలాపగీతం నేర్పించండి,

ఒకరికొకరు ఈ శోకగీతం నేర్పించుకోండి.+

21 ఎందుకంటే వీధుల్లో నుండి పిల్లల్ని,

సంతవీధుల్లో నుండి యువకుల్ని తీసుకెళ్లిపోవడానికి+

మన కిటికీల గుండా మరణం వచ్చింది;

అది మన పటిష్ఠమైన బురుజుల్లోకి ప్రవేశించింది.’

22 నువ్విలా చెప్పు, ‘యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు:

“ప్రజల శవాలు పొలంలో పెంటలా పడివుంటాయి,

కోతకోస్తున్న వాడి వెనక పనలు వరుసగా పడివున్నట్టు అవి పడివుంటాయి.

వాటిని పోగుచేసేవాళ్లు ఎవరూ ఉండరు.” ’ ”+

23 యెహోవా ఇలా చెప్తున్నాడు:

“తెలివిగలవాడు తన తెలివి గురించి,

బలవంతుడు తన బలం గురించి,

ధనవంతుడు తన ధనం గురించి గొప్పలు చెప్పుకోకూడదు.”+

24 “గొప్పలు చెప్పుకునేవాడు,

నా గురించిన లోతైన అవగాహన, నా గురించిన జ్ఞానం కలిగి ఉండడాన్ని బట్టి,+

భూమ్మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ నీతిన్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే+ అని తెలుసుకోవడాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవాలి,

ఈ విషయాల్లో నేను సంతోషిస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.

25 “ఇదిగో! నేను లెక్క అడిగే రోజులు వస్తున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు; “సున్నతి చేయించుకుని కూడా సున్నతిలేని వాళ్లలా ఉన్నవాళ్లను నేను లెక్క అడుగుతాను;+ 26 ఐగుప్తును,+ యూదాను,+ ఎదోమును,+ అమ్మోనీయుల్ని,+ మోయాబును,+ కణతల పక్క వెంట్రుకల్ని గొరిగించుకున్న ఎడారి నివాసులందర్నీ+ నేను లెక్క అడుగుతాను; ఎందుకంటే దేశాల ప్రజలందరూ సున్నతి లేనివాళ్లు, ఇశ్రాయేలు ఇంటివాళ్లంతా హృదయ సున్నతి లేనివాళ్లు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి