మొదటి పేతురు
5 కాబట్టి మీ తోటి పెద్దగా, క్రీస్తు పడిన బాధల్ని చూసినవాడిగా, బయల్పర్చబడే మహిమలో+ పాలుపంచుకునేవాడిగా నేను మీలోని పెద్దల్ని వేడుకునేది* ఏమిటంటే: 2 పర్యవేక్షకులుగా సేవచేస్తూ,* మీ సంరక్షణలో ఉన్న దేవుని మందను కాయండి.+ బలవంతంగా కాకుండా దేవుని ముందు ఇష్టపూర్వకంగా ఆ పని చేయండి;+ అక్రమ లాభం మీద ప్రేమతో కాకుండా,+ ఉత్సాహంతో కాయండి; 3 దేవుని సొత్తుగా* ఉన్నవాళ్ల మీద పెత్తనం చెలాయించకుండా,+ దేవుని మందకు ఆదర్శంగా ఉండండి.+ 4 ముఖ్య కాపరి+ వెల్లడి చేయబడినప్పుడు మీరు వాడిపోని మహిమా కిరీటాన్ని పొందుతారు.+
5 అలాగే యువకులారా, పెద్దవాళ్లకు* లోబడివుండండి.+ అయితే, మీరందరూ ఒకరితో ఒకరు వినయంగా* వ్యవహరించండి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు, కానీ వినయస్థులకు అపారదయను అనుగ్రహిస్తాడు.+
6 కాబట్టి, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండండి.+ 7 అంతేకాదు, ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా* ఆయన మీద వేయండి.+ 8 మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి! మీ శత్రువైన అపవాది గర్జించే సింహంలా ఎవర్ని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.+ 9 మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటూ అతన్ని ఎదిరించండి.+ ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులందరూ* ఇలాంటి బాధలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు.+ 10 అయితే మీరు కొంతకాలం బాధలు అనుభవించిన తర్వాత, క్రీస్తు ద్వారా మిమ్మల్ని తన శాశ్వత మహిమకు+ పిలిచిన దేవుడే మీ శిక్షణను పూర్తిచేస్తాడు. ఆయన అన్నివిధాలా అపారదయను అనుగ్రహించే దేవుడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు,+ బలపరుస్తాడు,+ గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు. 11 బలం ఎప్పటికీ ఆయనకే చెందాలి. ఆమేన్.
12 నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సిల్వాను*+ సహాయంతో ఈ చిన్న ఉత్తరం రాశాను. మీకు ప్రోత్సాహాన్ని, దేవుని నిజమైన అపారదయ ఇదే అన్న అభయాన్ని ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఆ అపారదయలో స్థిరంగా ఉండండి. 13 బబులోనులో ఉన్న ఆమె* మీకు శుభాకాంక్షలు చెప్తోంది. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నట్టే ఆమెను కూడా ఎంచుకున్నాడు. నా కుమారుడైన మార్కు+ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాడు. 14 ప్రేమతో ముద్దు పెట్టుకొని ఒకరినొకరు పలకరించుకోండి.
క్రీస్తు శిష్యులుగా ఉన్న మీ అందరికీ శాంతి కలగాలి.