యెషయా
నువ్వు నాశనం చేయడం పూర్తికాగానే, నిన్ను నాశనం చేస్తారు.+
నువ్వు మోసం చేయడం పూర్తికాగానే, నిన్ను మోసం చేస్తారు.
2 యెహోవా, మా మీద అనుగ్రహం చూపించు.+
నీ మీదే మేము ఆశపెట్టుకున్నాం.
3 నీ గర్జన విని జనాలు పారిపోతాయి.
నువ్వు లేచినప్పుడు దేశాలు చెల్లాచెదురైపోతాయి.+
4 తిండిబోతు మిడతలు పోగైనట్టుగా మీ దోపుడుసొమ్ము పోగుచేయబడుతుంది;
మిడతల దండ్లు వచ్చినట్టు ప్రజలు వేగంగా దాని మీదికి వస్తారు.
5 యెహోవా హెచ్చించబడతాడు,
ఎందుకంటే ఆయన అత్యున్నత స్థలాల్లో నివసిస్తాడు.
ఆయన సీయోనును న్యాయంతో, నీతితో నింపుతాడు.
6 నీ కాలాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది ఆయనే;
రక్షణను,+ తెలివిని, జ్ఞానాన్ని, యెహోవా పట్ల భయభక్తుల్ని+ సమృద్ధిగా ఇచ్చేది ఆయనే;
ఇదే అతని సంపద.*
7 ఇదిగో! వాళ్ల శూరులు వీధుల్లో కేకలు వేస్తున్నారు;
శాంతి సందేశకులు బోరున ఏడుస్తున్నారు.
8 రహదారులు నిర్మానుష్యం అయ్యాయి;
దారుల్లో ఎవరూ ప్రయాణించట్లేదు.
9 దేశం దుఃఖిస్తూ* వాడిపోతోంది.
లెబానోను అవమానాలపాలైంది;+ అది కుళ్లిపోయింది.
షారోను ఎడారిలా మారింది,
బాషాను, కర్మెలు ఊగుతూ ఆకులు రాలుస్తున్నాయి.+
10 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇప్పుడు నేను లేస్తాను,
ఇప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటాను;+
ఇప్పుడు నన్ను నేను ఘనపర్చుకుంటాను.
11 మీరు ఎండుగడ్డిని గర్భం దాల్చి కొయ్యకాలును* కంటారు.
మీ మనోవైఖరే* అగ్నిలా మిమ్మల్ని దహించేస్తుంది.+
12 జనాలు కాలుతున్న సున్నంలా తయారౌతారు.
నరికేసిన ముళ్లలా వాళ్లు అగ్నితో కాల్చేయబడతారు.+
13 దూరంగా ఉన్న ప్రజలారా, నేను ఏం చేయబోతున్నానో వినండి!
దగ్గర్లో ఉన్న ప్రజలారా, నా బలాన్ని గుర్తించండి!
‘దహించే అగ్ని ఉన్న చోట మనలో ఎవరు నివసించగలరు?+
ఆర్పలేని మంటలున్న చోట మనలో ఎవరు నివసించగలరు?’ అని వాళ్లు అనుకుంటున్నారు.
15 ఎప్పుడూ నీతిగా నడుచుకుంటూ,+
నిజాయితీగా మాట్లాడుతూ,+
అన్యాయం వల్ల, మోసం వల్ల వచ్చే లాభాన్ని తిరస్కరిస్తూ,
లంచం తీసుకోవడానికి చేతులు చాపకుండా ఉండే వ్యక్తి,+
రక్తపాతం గురించిన మాటలు వినకుండా తన చెవిని,
చెడును చూడకుండా తన కళ్లను మూసుకునే వ్యక్తి
16 ఎత్తైన స్థలాల్లో నివసిస్తాడు;
అతని సురక్షితమైన ఆశ్రయం* బలమైన రాతి కోటల్లో ఉంటుంది;
అతనికి ఆహారం దొరుకుతుంది,
అతని నీటి సరఫరా ఎప్పటికీ ఆగదు.”+
17 నీ కళ్లు మహిమాన్విత రాజును చూస్తాయి;
అవి సుదూరాన ఉన్న దేశాన్ని చూస్తాయి.
18 నీ హృదయం భయంకరమైన సంగతిని గుర్తుచేసుకుంటుంది:*
“కార్యదర్శి ఎక్కడ?
కప్పం కట్టేవాడు ఎక్కడ?+
బురుజుల్ని లెక్కపెట్టేవాడు ఎక్కడ?”
19 అహంకారులైన* ప్రజల్ని నువ్విక చూడవు,
వాళ్ల భాష గ్రహించలేనంత కష్టంగా* ఉంటుంది,
వాళ్ల నత్తి మాటలు నీకు అర్థంకావు.+
20 సీయోనును చూడండి, మన పండుగలకు నెలవైన నగరాన్ని+ చూడండి!
యెరూషలేము ప్రశాంతమైన నివాస స్థలంగా,
ఎప్పటికీ కదిలించబడని గుడారంలా+ ఉండడం నీ కళ్లు చూస్తాయి.
ఆ గుడారం మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు,
దాని తాళ్లలో ఒక్కటి కూడా ఎప్పటికీ తెంచేయబడదు.
21 మహిమాన్వితుడైన యెహోవా
అక్కడ మనకు నదులు, విశాలమైన కాలువలు పారే ప్రాంతంగా ఉంటాడు;
తెడ్ల ఓడల సమూహమేదీ అక్కడికి వెళ్లదు,
వైభవోపేతమైన ఓడలేవీ అటుగా వెళ్లవు.
23 నీ శత్రువుల ఓడల తాళ్లు వదులుగా వేలాడతాయి;
అవి ఓడ కొయ్యను పట్టివుంచలేవు, దాని తెరచాపను విప్పలేవు.
ఆ సమయంలో విస్తారమైన దోపుడుసొమ్మును పంచుకుంటారు;
కుంటివాడు కూడా చాలా దోపుడుసొమ్ము తీసుకుంటాడు.+
24 అందులో నివసించే వాళ్లెవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు.+
అందులో నివసించే ప్రజల దోషం క్షమించబడుతుంది.+